breaking news
Steel City
-
స్టీల్ సిటీ అందాలకు అమెరికన్ ట్రావెల్ వ్లాగర్ ఫిదా, వైరల్ వీడియో
పాపులర్ అమెరికన్ ట్రావెల్ వ్లాగర్ టోనీ క్లోర్ (Tony Klor) స్టీల్‌సిటీ జమ్షెడ్పూర్ అందాలకు ఫిదా అయిపోయాడు. బిహార్, ఉత్తరప్రదేశ్‌లలో వైరల్ వీడియోలతో ప్రసిద్ధి చెందిన ఈ కంటెంట్ క్రియేటర్, ఇటీవల జార్ఖండ్‌లోని 'స్టీల్ సిటీ' జమ్షెడ్పూర్ను మొదటిసారిగా సందర్శించి, ఎంతగానో ముగ్ధుడయ్యాడు. మొదట ఇది తన ఇండియా బకెట్ లిస్ట్‌లో లేకపోయినా, ఈ నగరాన్ని చూశాక తనకిష్టమైన ప్రదేశాలలో ఒకటిగా మారిందని ఆయన ప్రశంసించడం విశేషంగా నిలుస్తోంది.మెట్రో నగరాలు, ప్రశాంతమైన బీచ్‌లు, పర్వతాలు, ఎడారులు, దట్టమైన అడవుల వంటి ఊహించదగిన అన్ని రకాల ప్రకృతి దృశ్యాలకు భారతదేశం నిలయం. జైపూర్, గోవా, వారణాసి వంటి నగరాలు అంతర్జాతీయ పర్యాటకులకు ఇష్టమైన ప్రదేశాలుగా ఉన్నప్పటికీ, అంతగా ప్రాచుర్యం లేని అనేక పట్టణాలు, వాటిలో చూడటానికి ఎన్నో విశేషాలు ఉన్నప్పటికీ, అవి పెద్దగా ఎవరి దృష్టినీ ఆకర్షించవు. కానీ అనుకోకుండా స్టీల్ సిటీని సందర్శించిన టోనీ క్లోర్ జమ్షెడ్పూర్ను "భారతీయ పిట్స్బర్గ్" అని అభివర్ణించారు. టాటా స్టీల్ నిర్వహణలోనే నగరం ఇంత శుభ్రంగా, ప్రణాళికాబద్ధంగా నడవడం చూసి అబ్బురపడ్డారు. View this post on Instagram A post shared by Tony Klor (@tonykmontana) ఇక్కడ గోల్పహాడి ఆలయం, జూబ్లీ పార్క్, సాక్షి మార్కెట్, డిమ్నా లేక్ మరియు దొముహాని ప్రాంతాలను ఆయన సందర్శించారు. ఇక్కడి పచ్చదనం, పరిశుభ్రత, సోలార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ , క్రీడా రంగానికి ఇది అందించిన ఒలింపియన్లను గురించి తెలుసుకొని అభినందించారు. అంతేకాదు జార్ఖండ్‌పై తన అభిప్రాయం, అపోహలను తారుమారు చేస్తూ ప్రజలు అనుకునేదానికంటే ఈ రాష్ట్రం చాలా అందంగా ఉందని, జమ్షెడ్పూర్ ఒక వెలుగులోకి రాని "అరుదైన రత్నం" (underrated gem) అని టోనీ పేర్కొన్నారు. "నేను ఈ నగరం గురించి నా పిల్లలకు కూడా చెబుతాను" అని సోషల్ మీడియాలో రాశారు. టోనీ షేర్ చేసిన వీడియో నెటిజన్లను, ముఖ్యంగా జమ్షెడ్పూర్ వాసులను విశేషంగా ఆకట్టుకుంది. తమ నగర అందాలను ఇంత చక్కగా చూపించినందుకు వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. -
బీటీపీఎస్ రెడీ
700 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు రంగం సిద్ధం పూర్తి కావస్తున్న మూడవ స్టేజ్ పనులు జూన్ నుంచి విద్యుత్ ఉత్పాదన 1200 మందికి పైగా ఉద్యోగావకాశాలు బళ్లారి : స్టీల్ సిటీ బళ్లారిలో మరో 700 మెగా వాట్ల విద్యుత్ ఉత్పాదనకు రంగం సిద్ధమవుతోంది. కుడితిని వద్ద ఉన్న బళ్లారి థర్మల్ విద్యుత్ కేంద్రం(బీటీపీఎస్) విద్యుత్ ప్లాంట్‌లో 2010లో అప్పటి బీజేపీ ప్రభుత్వ హయాంలో బీటీపీఎస్‌లో రూ.3750 కోట్ల వ్యయంతో మరో 700 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు భూమిపూజ చేసింది. ఆ పనులు త్వరలో పూర్తి కానున్నాయి. జూన్‌లోగా మూడో స్టేజీ విద్యుత్ ఉత్పాదన పనులు పూర్తి కానుండడంతో బళ్లారి జిల్లాకే కాకుండా కర్ణాటక రాష్ట్రానికి విద్యుత్ కొరత తీరేందుకు దోహదం చేస్తుందని అధికారులు చెబున్నారు. ఈ పనులు పూర్తి అయితే మొత్తం 1700 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన అవుతుందని సంబంధిత అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న విద్యుత్ ఉత్పాదన పనుల్లో చిమ్నీ, కూలింగ్ టవర్, బాయిలర్ పనులు జరుగుతున్నాయి. మూడో యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమయితే బీటీపీఎస్‌లో దాదాపు 1200 మందికిపైగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశముంది. కాగా, 2008లో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో ప్రారంభించిన బీటీపీఎస్ 2012లో మరో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు రెండవ స్టేజ్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి మొత్తం 1000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.


