breaking news
Standing Committee Election
-
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలో YSRCP ఘన విజయం
-
వైఎస్సార్సీపీకి ఓటేసిన కూటమి కార్పొరేటర్లు
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలో కూటమికి గట్టి షాక్ తగిలింది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ పద్మ రెడ్డి విజయం సాధించారు. భారీగా క్రాస్ ఓటింగ్ జరగ్గా.. కూటమి కార్పొరేటర్లు వైఎస్సార్సీపీకి ఓటు వేశారు. మొత్తం సీట్లు గెలుస్తామంటూ కూటమి నేతలు బీరాలు పలికారు. 50 ఓట్లతో పద్మ రెడ్డి గెలుపొందారు. పార్టీ ఫిరాయింపు కార్పొరేటర్లను ఓటింగ్‌కు వాడుకున్నా కానీ కూటమికి భంగపాటు తప్పలేదు.కార్పొరేటర్ పద్మా రెడ్డి మాట్లాడుతూ.. తనకు ఓటు వేసిన 50 మంది కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలిపారు. బీసీ వర్గానికి చెందిన మహిళను మార్చారనే బాధ కార్పొరేటర్లలో ఉందన్నారు. గతంలో స్టాండింగ్ ఎన్నికలకు ఎక్కడా డబ్బులు ఖర్చు చేయలేదు. ఇప్పుడు కూటమి క్యాంపు రాజకీయాలకు తెర లేపింది. కూటమి బాధితులు తమకు సహకరించారని ఆమె పేర్కొన్నారు.కూటమి పాలనకు చెంప పెట్టు: కేకే రాజువైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ.. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కార్పొరేటర్లు ఇచ్చిన తీర్పు కూటమి పాలనకు చెంప పెట్టు అన్నారు. ‘‘గతంలో అడ్డగోలుగా మేయర్ పదవిని కూటమి కైవసం చేసుకుంది. బీసీ మహిళకు జగన్ అవకాశం ఇస్తే అడ్డదారిలో మహిళా మేయర్‌ను దించేశారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు ఎన్నడూ డబ్బుతో రాజకీయం చేయలేదు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా క్యాంప్ రాజకీయం చేశారు. మాకున్న బలం 32 మంది కార్పొరేటర్లు. వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన అందరికీ 32 ఓట్ల కంటే అధికంగా వచ్చాయి.50 ఓట్లతో ఒక స్టాండింగ్ కమిటీ సీట్ గెలిచాం. కూటమి కార్పొరేటర్లు కూడా మాకు ఓటు వేశారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్ళు తెరవాలి. గెలిచిన స్థానాన్ని ప్రకటించడానికి కూడా ఇబ్బంది పెట్టారు. వైఎస్సార్సీపీ నుంచి బయటకు వెళ్లిన కార్పొరేటర్లు పశ్చాత్తాప పడి మాకు ఓట్లు వేసి ఉండచ్చు. కూటమి భయభ్రాంతులకు గురి చేసినా పోటీ చేసిన వారికి అభినందనలు’’ అని కేకే రాజు పేర్కొన్నారు. -
గుంటూరులో టీడీపీ బరితెగింపు..
-
జై మోదీ.. కేజ్రీవాల్ జిందాబాద్.. దద్దరిల్లిన హౌజ్
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్(ఎంసీడీ)లోని స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఎంసీడీ సభలో ఆప్, బీజేపీ నేతలు టేబుల్స్‌పైకి ఎక్కి నినాదాలు చేశారు. దీంతో, ఆ ప్రాంతంలో రసాభాస చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఎంసీడీలో ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎంపిక కోసం శుక్రవారం ఓటింగ్ జరిగింది. ఈ సందర్భంగా తామే గెలుపొందినట్టు ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ప్రకటించారు. తమ పార్టీకి మొత్తం 138 ఓట్లు వచ్చాయని చెప్పారు. ఈ క్రమంలో బీజేపీ కౌన్సిలర్లు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టు ఆయన తెలిపారు. చెందిన ఐదుగురు సభ్యులు ఆప్ అభ్యర్థులకు ఓటేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక, ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ 134 స్థానాలు గెలిచింది. అయితే ఇవాళ ఒక ఆప్ సభ్యుడు బీజేపీలో చేరాడు. దాంతో ఆప్ బలం 133కు తగ్గింది. అయినప్పటికీ శుక్రవారం జరిగిన ఎన్నికల్లో ఆప్‌కు 138 మంది సభ్యుల ఓట్లు పడటంతో బీజేపీ సభ్యులు క్రాస్ ఓటింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో తామే గెలిచామని ఆప్ నేతలు చెబుతున్నప్పటికీ బీజేపీ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. అయితే, ఎన్నికల అధికారులు మొత్తం ఆరుగురు సభ్యుల స్టాండింగ్ కమిటీకి ముగ్గురు ఆప్ సభ్యులు, ముగ్గురు బీజేపీ సభ్యులు ఎన్నికయ్యారని తెలిపినట్టు బీజేపీ చెబుతోంది. ఆప్ తామే గెలిచినట్లు తప్పుడు ప్రకటన చేసిందని బీజేపీ ఎదురుదాడికి దిగింది. దీంతో, స్టాండింగ్ కమిటీ గెలుపు ఎవరిదనే విషయంపై సస్పెన్స్ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో సభలో కొందరు కౌన్సిలర్లు జై శ్రీరామ్, జై మోదీ అంటూ నినాదాలు చేయగా.. ఆప్ కౌన్సిలర్లు ఆమ్ ఆద్మీ పార్టీ జిందాబాద్, కేజ్రీవాల్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. VIDEO | Brawl breaks out between AAP and BJP councillors in the MCD House as their tussle continues over the standing committee polls. pic.twitter.com/6dTKhAwdia — Press Trust of India (@PTI_News) February 24, 2023 ఇక, ఈ ఎన్నికల్లో ఆప్ తరఫున అమీల్ మాలిక్, రమీందర్ కౌర్, మోహిని జీన్వాల్, సారిక చౌదరిలను నామినేట్ చేసింది. మరోవైపు, బీజేపీ కమల్జీత్ సెహ్రావత్, పంకజ్ లూథ్రాలను రంగంలోకి దింపింది. కాగా, బీజేపీలో చేరిన ఇండిపెండెంట్ కౌన్సిలర్ గజేందర్ సింగ్ దారాల్ కూడా పోటీలో ఉన్నారు. అయితే, స్టండింగ్ కమిటీకి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది నిధులను ఎలా ఉపయోగించాలి, పలు ప్రాజెక్ట్‌లపై నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. VIDEO | MCD standing committee elections: Ruckus in the House after Delhi mayor Shelly Oberoi said an invalid vote cannot be called valid. pic.twitter.com/fnyiX9tv1j — Press Trust of India (@PTI_News) February 24, 2023 మరోవైపు.. ఈ ఎన్నికల్లో ఒక్క ఓటు చెల్లదంటూ మేయర్ షెల్లీ ఒబెరాయ్ ప్రకటించడంతో సభలో బాహాబాహీ చోటుచేసుకుంది. బీజేపీ, ఆప్ కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. సభలో తన్నుకోవడంతో పోలీసులు రంగం ప్రవేశం చేశారు. కౌన్సిలర్లను అడ్డుకున్నారు. Breaking : Scuffle breaks out among AAP, BJP councilors during Standing Committee Election. #MCDelections #MCD #Delhi #BJP #AAP pic.twitter.com/iBwpNfKgZN — Neeraj Shrivastava نیرج سریواستو नीरज श्रीवास्तव (@NeerShrivastava) February 24, 2023 -
జీవీఎమ్ సీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ ఘన విజయం
-
గ్రేటర్ విశాఖలో స్థాయిసంఘం ఎన్నికల కోలాహలం
-
జి వి ఎం సి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు
-
‘స్టాండింగ్’ ఏకగ్రీవమే !
ఆరు స్థానాలకు ఆరే నామినేషన్లు ఈ నెల 20న అధికారిక ప్రకటన పోటీకి కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం దూరం వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైనట్టే. ఈ విషయాన్ని ఈ నెల 20న అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికల్లో ఆరు స్థానాలకు గాను మంగళవారం గడువు ముగిసే సమయానికి ఆరు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. చివరి తేదీన ఉదయం నుంచి ఆయా పార్టీల కార్యాలయాల్లో నాయకులు మంతనాలు జరిపారు. టీఆర్ఎస్కు చెందిన కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హన్మకొండలోని హరిత హోటల్లో సమావేశమై చర్చించారు. సభ్యులుగా ఎవరు నామినేషన్ వేయాలనే విషయంపై మంతనాలు సాగించారు. నామినేషన్ల దాఖలుకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తుది గడువు కాగా, మేయర్, డిప్యూటీ మేయర్, కొందరు కార్పొరేటర్లు 1.35 నిమిషాలకు బల్దియా ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. నగర మేయర్ నన్నపనేని నరేందర్ అధ్వర్యంలో కార్పొరేటర్లు బల్దియా సెక్రటరీ నాగరాజ రావుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. మొదట 8వ డివిజన్ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్‌యాదవ్ నామినేషన్ దాఖలు చేయగా, 4వ డివిజన్ కార్పొరేటర్ బిల్ల కవిత బలపరిచారు. 27వ డివిజన్ కార్పొరేటర్ వద్దిరాజు గణేష్ నామినేషన్ దాఖలు చేయగా, 47వ డివిజన్ కార్పొరేటర్ నాల్లా స్వరూప రాణి రెడ్డి బలపరిచారు. 29వ డివిజన్ కార్పొరేటర్ కావటి కవితను 15వ డివిజన్ కార్పొరేటర్ శారదా జోషి బలపరిచారు. 3వ డివిజన్ కార్పొరేటర్ లింగం మౌనిక నామినేషన్ వేయగా, 2వ డివిజన్ కార్పొరేటర్ ల్యాదల్ల బాలయ్య బలపరిచారు. 56వ డివిజన్ నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచి, ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరిన కార్పొరేటర్ నాగమళ్ల ఝాన్సీ స్టాండింగ్ కమిటీకి నామినేషన్ వేయగా, 38వ డివిజన్ కార్పొరేటర్ కేశిరెడ్డి మాధవి బలపరిచారు. 40వ డివిజన్ కార్పొరేటర్ మిరియాల్‌కార్ దేవేందర్ నామినేషన్ వేయగా, 51వ డివిజన్ కార్పొరేటర్ మిడిదొడ్డి స్వప్న బలపరిచారు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం దూరం.. గ్రేటర్ పరిధిలోని 58 డివిజన్లు ఉండగా, అందులో 44 సీట్లను టీఆర్ఎస్ కార్పొరేటర్లు గెలుచుకున్నారు. 8 మంది ఇండిపెండెంట్లు విజయం సాధించగా, వీరిలో ఒకరిద్దరు మినహా అందరూ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక కాంగ్రెస్‌కు నలుగురు, బీజేపీకి ఒకరు, సీపీఎంకు ఒకరు కార్పొరేటర్లు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి నామినేషన్లు ఉంటాయని వీరంతా భావించారు. కానీ ఆ పార్టీ నుంచి ఎవరూ నామినేషన్లు వేయలేదు. దీంతో టీఆర్ఎస్ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా బరిలో ఉంచితే ఎన్నికకు తగిన బలం లేనందున ఆయా పార్టీలు దూరంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నేడు నామినేషన్ల పరిశీలన.. ఎన్నికలు లేకున్నా ప్రక్రియ మాత్రం కొనసాగుతోంది. కార్పొరేటర్లు దాఖలు చేసిన నామినేషన్లను అధికారులు బుధవారం పరిశీలిస్తారు. నామినేషన్లలో ఏమైనా పొరపాట్లు ఉంటే తిరస్కరించిన తర్వాత మిగిలిన జాబితా వెల్లడి వెల్లడిస్తారు. ఈనెల 20న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం అధికారికంగా అభ్యర్థులను ప్రకటిస్తారు. నగరాభివృద్ధికి ఐక్యంగా కృషి చేస్తాం.. మహా నగర అభివృద్ధిలో స్టాండింగ్ కమిటీ కీలకమైనదని గ్రేటర్ మేయర్ నన్నపనేని నరేందర్అన్నారు. మంగళవారం స్టాండింగ్ కమిటీ సభ్యుల నామినేషన్ అనంతరం ఆయన మాట్లాడుతూ నగర అభివృద్ధికి ఐక్యంగా కృషి చేస్తామని చెప్పారు. కమిటీ ఎన్నిక ఏకగ్రీవడం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఖాజా సిరాజుద్దీన్, కార్పొరేటర్లు బయ్యస్వామి తదితరులు పాల్గొన్నారు. -
సై.. రూలింగ్ x రెబల్స్
సాక్షిప్రతినిధి, అనంతపురం : అధికారపార్టీకి... ప్రతిపక్షపార్టీకి ఎన్నికలు జరగడం సహజం. అయితే ‘అనంత’ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అధికారపార్టీకి చెందిన అభ్యర్థులే పరస్పరం తలపడుతున్నారు. స్టాండింగ్ కమిటీలో మేయర్ కాకుండా తక్కిన ఐదుస్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బరిలో 9మంది అభ్యర్థులు ఉన్నారు. మేయర్ స్వరూప, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మద్దతుతో రహమత్బీ, రంగాచారి, రాజారావు, సుజాతమ్మ, సరళ బరిలో ఉన్నారు. వీరికి పోటీగా టీడీపీ నేత జయరాం నాయుడు వర్గం తరఫున ఉమామహేశ్వర్ , హరిత , విద్యాసాగర్, లాలూ, ధనలక్ష్మి నామినేషన్లు వేశారు. అయితే చివరి నిమిషంలో ధనలక్ష్మి నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో ఎమ్మెల్యే వర్గం నుంచి ఐదుగురు, జయరాం వర్గం నుంచి నలుగురు బరిలో నిలిచారు. ఎవరి లెక్కలు వారివి: ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని భావించిన ఎమ్మెల్యే స్వపార్టీ వారే పోటీగా నామినేషన్లు వేయడంతో అవాక్కయ్యారు. ఒకట్రొండుస్థానాలు ఓడినా నగరపార్టీలో బలం తగ్గడంతో పాటు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. అయితే 3 స్థానాలు మాత్రమే కచ్చితంగా గెలుస్తామని రెండు స్థానాలు జయరాం నాయుడు గెలిచే అవకాశం ఉందని ఓ అంచనాకు వచ్చినట్లు వారి సన్నిహితులు చెబుతున్నారు. అయితే జయరాం నాయుడు భార్య హరిత తప్పనిసరిగా గెలుస్తుందని, తక్కిన నాలుగు మాత్రం పోనివ్వకూడదని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కార్పొరేటర్లను విడివిడిగా పిలిపించుకుని మాట్లాడారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన జయరాం ఎలాగైనా ఎన్నికల్లో కనీసం 3స్థానాలు గెలిచి సత్తా చాటాలనే యోచనలో ఉన్నారు. కార్పొరేటర్లందరినీ జయరాం కూడా స్వయంగా కలిసి మద్దతు కోరినట్లు తెలుస్తోంది. మేయర్, ఎమ్మెల్యే తరఫున నామినేషన్ దాఖలు చేసిన వారిలో రాజారావు మినహా ఎవ్వరూ పార్టీఉన్నతి కోసం పని చేయలేదని, అలాంటి వారితో నామినేషన్లు వేయించినందుకే తాము రెబల్‌గా బరిలోకి దిగాల్సి వస్తోందని కార్పొరేటర్లకు వివరిస్తున్నారు. పార్టీ ఉన్నతికి శ్రమించిందెవరు.. చివరలో పార్టీలో చేరి పదవులు అనుభవిస్తున్న వారెవరో తెలుసుకుని ఓటేయాలని జయరాం చెబుతున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తాం: నాగవేణి, కమిషనర్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రశాంతంగా నిర్వహిస్తాం. ఓటింగ్హాలులో మేయర్ ఉండేందుకు వీల్లేదు. ఉదయం 11 నుంచి ఒంటి గంటవరకూ ఓటింగ్ జరగనుంది. నాలుగు గంటలకు కౌంటింగ్ జరిపి వెంటనే ఫలితాలు ప్రకటిస్తాం. ఐదుస్థానాలు గెలుస్తాం: స్వరూప, మేయర్ ఐదుస్థానాలు కచ్చితంగా గెలుస్తాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. టీడీపీ కార్పొరేటర్లు మావైపే ఉంటారనే నమ్మకం ఉంది. మూడుస్థానాలు మావే: జయరాంనాయుడు. నాలుగుస్థానాల్లో 3 స్థానాలు కచ్చితంగా గెలుస్తాం. నాలుగోస్థానం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాం. పార్టీ కోసం శ్రమించినవారిని కాకుండా తనకు అనుకూలమైన వ్యక్తులకు పదవులు కట్టబెట్టుకుని నిజమైన కార్యకర్తలకు ఎమ్మెల్యే అన్యాయం చేస్తున్నారు. దీనిపైనే మా పోరాటం! దీనికి కార్పొరేటర్ల మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాం. ఎన్నికల ప్రక్రియ ఇలా: స్టాండింగ్ కమిటీలో ఆరుగురు సభ్యులు ఉంటారు. ఇందులో మేయర్ చైర్మన్‌గా ఉంటారు. తక్కిన ఐదుస్థానాలకు ఓటింగ్ జరగనుంది. కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉన్నాయి. ఇందులో 32 టీడీపీ, 11వైఎస్సార్సీపీ, 4 స్వతంత్ర, 2 సీపీఐ, ఓ స్థానంలో సీపీఎం అభ్యర్థులు ప్రాథినిద్యం వహిస్తున్నారు. వీరిలో 14మంది టీడీపీ అభ్యర్థులు జయరాంనాయుడు వర్గం వైపు, 18మంది ఎమ్మెల్యే వర్గంవైపు ఉన్నట్లు తెలుస్తోంది. నలుగురు స్వతంత్ర అభ్యర్థుల్లో ఇరువర్గాలకు ఇద్దరు చొప్పున ఓటేసే అవకాశం ఉంది. సీపీఐ, సీపీఎం అభ్యర్థులు ఎవరికి ఓటేస్తారనేది ఇంకా తేలలేదు. వైఎస్సార్సీపీ సభ్యులు బాయ్‌కాట్ చేస్తారని మొదట అనుకున్నా ఓటింగ్‌లో పాల్గొంటారనే విషయంలో మాత్రం స్పష్టత వచ్చింది.