breaking news
srilnka
-
కొలంబో టెస్టుకు వర్షం ఆటంకం
కొలంబో: భారత్, శ్రీలంక చివరి, మూడో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. భారత్ 15 ఓవర్లలో 50/2 స్కోరుతో ఉన్నప్పుడు వర్షం వచ్చింది. పుజారా (19), విరాట్ కోహ్లీ (14) క్రీజులో ఉన్నారు. వర్షం తెరిపినివ్వకపోవడంతో ఆటను నిలిపివేశారు. మూడో టెస్టుల సిరీస్లో భాగంగా కొలంబోలో జరుగున్న ఈ మ్యాచ్లో లంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన వెంటనే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ లోకేష్ రాహుల్ (2), రహానె (8) వెంటవెంటనే అవుటయ్యారు. ప్రసాద్ బౌలింగ్లో రాహుల్ బౌల్డవగా.. ప్రదీప్ ఓవర్లో రహానె వికెట్ల ముందు దొరికిపోయాడు. -
బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక
కొలంబో: భారత్తో చివరి, మూడో టెస్టులో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మూడో టెస్టుల సిరీస్లో భాగంగా ఈ మ్యాచ్ కొలంబోలో జరుగుతోంది. ఈ సిరీస్లో టీమిండియా, లంక 1-1తో సమంగా నిలిచిన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో లంక గెలవగా, రెండో మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఇరు జట్లకు మూడో టెస్టు కీలకం.