కొలంబో టెస్టుకు వర్షం ఆటంకం | rain interrupted colombo test, india 50/2 | Sakshi
Sakshi News home page

కొలంబో టెస్టుకు వర్షం ఆటంకం

Aug 28 2015 1:06 PM | Updated on Sep 3 2017 8:18 AM

భారత్, శ్రీలంక చివరి, మూడో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది.

కొలంబో: భారత్, శ్రీలంక చివరి, మూడో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. భారత్ 15 ఓవర్లలో 50/2 స్కోరుతో ఉన్నప్పుడు వర్షం వచ్చింది. పుజారా (19), విరాట్ కోహ్లీ (14) క్రీజులో ఉన్నారు. వర్షం తెరిపినివ్వకపోవడంతో ఆటను నిలిపివేశారు.

మూడో టెస్టుల సిరీస్లో భాగంగా  కొలంబోలో జరుగున్న ఈ మ్యాచ్లో లంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన వెంటనే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ లోకేష్ రాహుల్ (2), రహానె (8) వెంటవెంటనే అవుటయ్యారు. ప్రసాద్ బౌలింగ్లో రాహుల్ బౌల్డవగా.. ప్రదీప్ ఓవర్లో రహానె వికెట్ల ముందు దొరికిపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement