సంప్రదాయ దుస్తుల్లో యాంకర్ స్రవంతిని చూశారా..
ఒకప్పుడు తన డ్రెస్సింగ్ విషయంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొన్న యాంకర్ స్రవంతి చొక్కారపు.. ఇప్పుడు పూర్తిగా సంప్రదాయ లుక్‌లో మెప్పిస్తున్నారు. వినాయకుడి పూజల్లో చీరకట్టులో పాల్గొన్న ఆమె తాజా ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సినిమా ఈవెంట్లు, టీవీ కార్యక్రమాల్లో తనదైన యాంకరింగ్‌తో బిజీగా ఉంటోంది స్రవంతి.. సంప్రదాయ దుస్తులంటే తనకు వ్యక్తిగతంగా ఎంతో ఇష్టమని గతంలోనే చెప్పింది. తన దగ్గర ఏకంగా వెయ్యికి పైగా చీరలు ఉన్నాయని వెల్లడించింది.సినిమా ఈవెంట్లలో మాత్రం సందర్భాన్ని బట్టి దుస్తులు ఎంచుకోవాల్సి వస్తుందని, కొన్ని సందర్భాల్లో నిర్వాహకులే కాస్ట్యూమ్స్ నిర్ణయిస్తారని స్రవంతి చెప్పింది. అందుకే తనకు ఆప్షన్ ఉంటే మాత్రం చీరనే ఎంచుకుంటానని ఆమె స్పష్టం చేసింది. వినాయకుడి పూజల్లో పాల్గొన్న స్రవంతి ఫొటోలు ప్రస్తుతం ఫొటోలు వైరల్ అయ్యాయి.