breaking news
Southern Sojourn
-
హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
హైదరాబాద్: శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నగరానికి వచ్చారు. దీనిలో భాగంగా కర్నూలు నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు వచ్చారు. రాష్ట్రపతి ముర్ముకు గవర్నర్ తమిళ సై, సీఎం కేసీఆర్‌లు స్వాగతం పలికారు. ఐదు రోజుల పాటు రాష్ట్రపతి ఇక్కడే బస చేయనున్నారు. దాంతో బొల్లారంలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఆవరణలోని రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాలను భద్రతా దళాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. కాగా, ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌తో పాటు సిమ్లా, హైదరాబాద్‌లోనూ రాష్ట్రపతి అధికారిక నివాసాలున్నాయి. శీతాకాలంలో కొన్ని రోజులు హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేయడంతో పాటు ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించడం ఆనవాయితీ. తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌తో పాటు దాదాపు అందరు రాష్ట్రపతులూ ఇక్కడ బస చేశారు. కోవిడ్ ఇతర కారణాల రీత్యా మూడేళ్ల పాటు రాష్ట్రపతి హైదరాబాద్ నివాసానికి రాలేదు. చివరిసారిగా 2019 డిసెంబర్లో నాటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించారు. రెండేళ్ల విరామానంతరం ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు విడిది కోసం వచ్చారు. చదవండి: ఐదురోజుల పాటు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు... ఈ మార్గాల్లోనే -
హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వస్తున్నారు. ఈనెల 22 నుంచి 31 వరకు ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేస్తారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. డిసెంబర్ 23న ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌లో ఎండీఎస్, బీడీఎస్‌ల స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ పాల్గొంటారు. అదేరోజు ఎఫ్టీఏపీసీసీఐ సెంటినరీ ఇయర్ సెలబ్రేషన్స్‌లో ఆయన పాల్గొంటారు. డిసెంబర్ 24న హైదరాబాద్‌లో మహిళా దక్షత సమితి, బన్సీలాల్ మలాని కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లను రాష్ట్రపతి ప్రారంభించన్నారు. 25న బెంగళూరులో పర్యటించనున్న ఆయన.. తరువాతి రోజు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ కాన్వకేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. 29న తిరువనంతపురంలో 77వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌ను ఆయన ప్రారంభించనున్నారు.