breaking news
Solidarity with strike
-
'ఆహా'ర హైదరాబాదీ జంతర్ మంతర్!
సాక్షి, హైదరాబాద్: నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నిరసనగా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా నిరసనకు దిగిన ఆందోళనకారులకు హైదరాబాదీలు ఫుడ్ సపోర్ట్ అందిస్తున్నారు. తమ దాతృత్వంతో సంఘీభావం చాటుతున్నారు. ముంబై, బెంగళూరు, చెన్నై, పుణె, కోల్‌కతా తదితర నగరాల యువత బాటలోనే హైదరాబాదీలు కూడా ఇక్కడినుంచే స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్‌ల ద్వారా ఢిల్లీలోని జంతర్ మంతర్ సమీప రెస్టారెంట్లకు ఆర్డర్లు ఇస్తున్నారు.ఆ పదార్థాలు అక్కడి నిరసనకారులకు అందేలా చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనేక స్క్రీన్ షాట్లలో ‘ప్లీజ్ డి్రస్టిబ్యూట్ దిస్ ఫుడ్ టు ఎనీ వన్ హంగ్రీ ఎట్ జంతర్ మంతర్’ వంటి సందేశంతో ఆర్డర్లు ఇవ్వడం కనిపిస్తోంది. ఇలాంటివారిలో ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన వినియోగదారులు ఉన్నట్లు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఆన్లైన్ సేవలను వేగంగా స్వీకరించే నగరంగా పేరొందిన హైదరాబాద్ నుంచి కూడా ఈ తరహా సంఘీభావం వ్యక్తమవడం చర్చనీయాంశమైంది. మున్ముందు నగరంలోనూ...! ‘‘డిజిటల్ యుగంలో నిరసనలకు మద్దతు తెలిపే విధానం కూడా మారిపోతోంది. ఒక ఉద్యమానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తి కేవలం మొబైల్ ఫోన్‌తో కొన్ని నిమిషాల్లో భోజనం పంపగలగడం సాంకేతికత తీసుకొచి్చన సామాజిక అనుసంధానత’’ అని సామాజిక విశ్లేషకులు అభివరి్ణస్తున్నారు. డబ్బు విరాళం ఇవ్వకుండా, నేరుగా అవసరమైన సమయంలో ఆహారం అందించడం అంటే నిరసనకారులకు ప్రత్యక్ష సహకారం అందజేసినట్లేనని పేర్కొంటున్నారు. మున్ముందు... మన నగరంలో ఏదైనా భారీ ఆందోళన కొన్ని రోజుల పాటు సాగితే ఇదే విధానం (ఆన్లైన్లో ఆందోళనకారులకు ఫుడ్ డెలివరీ ఆర్డర్) అవలంబించే అవకాశం లేకపోలేదని వివరిస్తున్నారు. -
కాపు నేతలపై కేసులు నమోదు
పిఠాపురం : కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్షకు సంఘీభావంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో దీక్షలు చేపట్టిన పలువురు కాపు నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పిఠాపురం పట్టణంతో పాటు గొల్లప్రోలు నగర పంచాయతీ కొత్తపల్లి, గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లో సుమారు 250 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 144 సెక్షన్ అమలులో ఉండగా ప్రదర్శనలు, రిలే నిరాహార దీక్షలు, నిరసనలు జరిపి చట్టాన్ని ఉల్లంఘించారన్న అభియోగాలపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కొద్దిసేపు కాపు నాయకులకు, పోలీసులు మధ్య వాగ్వాదం జరిగింది. అరట్లకట్టలో 43 మందిపై.. కరప : అరట్లకట్టలో దీక్షలు చేపట్టిన 43 మందిపై కరప పోలీసులు కేసు నమోదు చేశారు. వీరందరిపై కేసులు నమోదుచేసినట్టు ఏఎస్సై అడబాల గంగరాజు తెలిపారు. గోపాలపురంలో రావులపాలెం : గోపాలపురం కాపు కల్యాణ మండపంలో శుక్రవారం రిలే దీక్షలు చేపట్టిన 12 మందిపై కేసులు నమోదు చేసినట్టు ఎస్సై పీవీ త్రినాథ్ శుక్రవారం తెలిపారు. వీఆర్వోలు ఇచ్చిన నివేదిక మేరకు ఆకుల రామకృష్ణ, మరో 11 మంది పై కేసులు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. వాడపాలెంలో 12 మందిపై.. కొత్తపేట : వాడపాలెంలో దీక్షలు చేపట్టిన కాపు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారంతా నిబంధనలు ఉల్లంఘించారని ఎస్సై డి.విజయకుమార్ తెలిపారు.


