Singer Madonna
-
వైట్‌హౌస్‌ను పేల్చేయాలి!
-
వైట్‌హౌస్‌ను పేల్చేయాలి!
సింగర్ మడోన్నా వివాదాస్పద వ్యాఖ్యాలు సోషల్ మీడియాలో విమర్శలు.. సమర్థించుకున్న సింగర్ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికను వ్యతిరేకిస్తూ అమెరికా అంతటా నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. శనివారం వాషింగ్టన్ డీసీలో ట్రంప్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో ప్రముఖ పాప్ సింగర్ మడోన్నా ప్రసంగిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష భవనమైన వైట్‌హౌస్‌ను పేల్చేయాలని తాను భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలతో కంగుతిన్న టీవీ చానెళ్లు వెంటనే ఆందోళన లైవ్ ప్రసారాలను కాసేపు నిలిపివేశాయి. సోషల్ మీడియాలోనూ మడోన్నా వ్యాఖ్యలపై విమర్శలు వచ్చాయి. దీంతో మడోన్నా స్పందిస్తూ తన వ్యాఖ్యలు కేవలం ఉపమానయుక్తంగా చెప్పినవేనని అన్నారు. ’నేను హింసను కోరుకునే వ్యక్తిని కాను. నేను ఉపమానయుక్తంగా మాట్లాడాను. నేను రెండురకాల అభిప్రాయాలను వ్యక్తం చేశాను. ఒకటి ఆశాజనకమైన అభిప్రాయం కాగా, మరొకటి ఆగ్రహం, ఆవేశంతో కూడిన మనోభిప్రాయం మాత్రమే’ అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. మహిళలపై తీవ్ర అసభ్యకర వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్ విధానాలను ఎదుర్కోవడానికి స్త్రీలందరూ సిద్ధంగా ఉన్నారని మహిళా ఆందోళనకు నేతృ త్వం వహించిన మడోన్నా పేర్కొన్నారు. -
మాజీ భర్తను మళ్లీ పెళ్లి చేసుకుంటా: సింగర్
లాస్ ఏంజిల్స్: ప్రముఖ పాప్ సింగర్ మడోన్నా తాజాగా తన అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. తన మాజీ భర్త ష్యాన్ పెన్ను మళ్లీ పెళ్లి చేసుకుంటానని ఆమె ప్రకటించింది. అందుకు బదులుగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం 1.50 లక్షల డాలర్లు (రూ. కోటి 2 లక్షలు) ఇస్తానని ష్యాన్ ప్రకటించాడు. ఆఫ్రికా దేశం మలావి కోసం విరాళాలు సేకరించేందుకు అమెరికాలోని మియామి ఆర్ట్ బేస్‌లో మడోన్నా ప్రత్యేక గాలా ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆమె మాజీ భర్త ష్యాన్ పెన్ 1.50 లక్షల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించగా.. అందుకు బదులుగా అతనిపై ఉన్న తన ప్రేమను మడోన్నా వెల్లడించింది. అతనిపై తనకు ఇప్పటికీ ప్రేమ ఉందని ప్రకటించింది. ఆయనను మళ్లీ చేసుకుంటానని సరదాగా ప్రకటించింది. భారీగా విరాళాలు సేకరించేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో లియోనార్డో డికాప్రియో వంటి హాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. హాట్‌గా హాట్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మడోన్నా.. తన వస్తువులు, ఒక కారు, డిజైనర్ నగలు, మాజీ భర్త ష్యాన్ పెన్‌తో కలిసి ఉన్నప్పుడు దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు వేలం వేసి విరాళాలు సాధించింది. మొత్తం 7.5 మిలియన్ డాలర్ల (రూ. 51 కోట్ల)ను సేకరించింది. ఈ సందర్భంగా అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరును తీవ్రంగా తప్పుబట్టింది.