breaking news
Siddharathajain
-
‘కన్నడ’ కథ సుఖాంతం!
బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ సంక్షోభం తప్పే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీ వైపు ఆకర్షితులయ్యారని భావించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సొంత పార్టీకే విధేయత ప్రకటించి తిరిగొచ్చారు. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలో శుక్రవారం జరిగే సీఎల్పీ భేటీలో వారంతా పాల్గొనే అవకాశాలున్నాయి. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్ష బీజేపీ చేసిన ప్రయత్నం విఫలమైందని చాటిచెప్పడమే లక్ష్యంగా తన బలం చాటుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అంతర్గత అసమ్మతిని చల్లార్చేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నేటి సమావేశానికి గైర్హాజరైతే తీవ్ర పరిణామాలుంటాయని తమ ఎమ్మెల్యేలను సిద్దరామయ్య హెచ్చరించారు. పార్టీలోకి తిరిగిస్తున్న అసంతృప్త ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తారా? అని సిద్దరామయ్యను ప్రశ్నించగా..ఆయన బదులిస్తూ మంత్రి పదవులిస్తామని ఎవరికీ చెప్పలేదని, కాంగ్రెస్‌లో అసలు అసంతృప్తే లేదన్నారు. బీజేపీకి మిగిలింది భ్రాంతే: కుమారస్వామి కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఏ ప్రయత్నాలు ఫలించబోవని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి స్పష్టం చేశారు. జనవరి 15 తర్వాత బీజేపీకి సం‘క్రాంతి’ అని పలికిన ఆ పార్టీ నేతలకు చివరికి సం‘భ్రాంతి’ మిగిలిందని ఎద్దేవా చేశారు. గురువారం విధానసౌధలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను రెండు, మూడు రోజులు విదేశీ పర్యటనకు వెళ్తే విమర్శించిన బీజేపీ నేతలు ఇప్పుడు మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకుని గురుగ్రామ్ హోటల్లో ఏం చేస్తున్నారని నిలదీశారు. ‘ఆపరేషన్ కమల’ చేపట్టలేదు: యడ్యూరప్ప వచ్చే లోక్‌సభ ఎన్నికల సన్నాహాలపై చర్చించేందుకే తమ ఎమ్మెల్యేలు గురుగ్రామ్ వెళ్లినట్లు బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు యడ్యూరప్ప వెల్లడించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు తాము ప్రయత్నించడం లేదని, కాంగ్రెస్– జేడీఎస్ అంతర్గత పోరుకు బీజేపీని నిందించడం సబబుకాదన్నారు. బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్తే కాంగ్రెస్ పార్టీకి ఎందుకని ప్రశ్నించారు. 104 మంది బీజేపీ ఎమ్మెల్యేలు గురుగ్రామ్ నుంచి బెంగళూరుకు బయల్దేరినట్లు తెలిసింది. -
తుది విడత ప్రశాంతం
సాక్షి, ఏలూరు: జిల్లాలో తుది విడత ‘పరిషత్’ పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా ముగి సింది. చెదురుమదురు ఘటనలు మిన హా కొవ్వూరు, నరసాపురం రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 24 మండలాల్లో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిద్ధార్థజైన్ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు కేంద్రాల వద్ద బారులు తీరారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఓటేసిన అనంతరం ఇద్దరు మృతి పెరవలి మండలం అన్నవరప్పాడులో డేగ సత్యవతి (70) అనే మహిళ ఓటేసి ఇంటికి వెళ్లగానే మృతి చెందింది. వడదెబ్బ కారణంగా ఇంటికెళ్లిన ఆమె వాకిట్లో కుప్పకూలిపోయింది. యలమంచిలి మండలం ఊటాడలో దొంగ సుబ్బారావు (55) అనే వ్యక్తి ఓటేసిన అనంత రం వడదెబ్బకు గురై పోలింగ్ కేంద్రం సమీపంలోనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు విడిచాడు. జిల్లాలో అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన భీమవరం మండలం గూట్లపాడులో భారీ భద్రత నడుమ పోలింగ్ నిర్వహించారు. కాంగ్రెస్ నాయకుడిపై రౌడీషీట్!కొవ్వూరు మండలం కాపవరంలో కాం గ్రెస్ నాయకుడు ఎండీ రఫీయుల్లాబేగ్కు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బేగ్ ఇంటి వద్ద జనం గుమిగూడి ఉండటంతో వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. దీంతోపాటు బేగ్ ఇంటిని సోదా చేయగా ఏ వార్డులో ఓటర్లకు ఎంత పంచారనే వివరాలతో కూడిన పుస్తకం పోలీసుల కంటపడింది. దీనిపై ప్రశ్నించగా బేగ్ దురుసుగా ప్రవర్తించాడని అతనిపై రౌడీషీట్ తెరిచేందుకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామని జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఏవీ సుబ్బరాజు తెలిపారు. భట్లమగుటూరులో గంట ఆలస్యం పెనుమంట్ర మండలం భట్లమగుటూరులో పోలింగ్‌ను గ్రామస్తులు బహిష్కరించారు. సుమారు గంట పాటు పోలింగ్ నిలిచిపోయింది. పోటీలో ఉన్న అభ్యర్థులు తాము పదవిలోకి రాగానే గ్రామ సమస్యలు తీరుస్తామని హామీ ఇవ్వడంతో ఉదయం 8 గంటల సమయంలో పోలింగ్ ప్రారంభమైంది. పాలకొల్లు మండలం కాపవరంలో ఓ వ్యక్తి నకిలీ బ్యాలెట్ పేపర్‌ను బాక్సులో వేసి ఒరిజినల్ పేపర్‌ను బయటకు తీసుకురావడం కల కలం సృష్టించింది. చాగల్లులో యథేచ్ఛగా ప్రలోభాల పరంపర కొవ్వూరు మండలంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో అంధకారం అలుముకుంది. విద్యుత్ కోతలకు ఎన్నికల అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో వెలుగు లేకపోవడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు. చాగల్లు మండలం ఊనగట్ల పోలింగ్ కేంద్రం వద్ద లైనులో ఉన్న ఓ టర్లను టీడీపీ నాయకులు ఓట్లు అ భ్యర్థించడంతో వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. దేశం నాయకుల తీరుపై ఎన్నికల అధికారి ఫిర్యాదు చేశారు. మండలంలో చివరి క్షణం వరకూ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తెలుగు తమ్ముళ్లు ప్రయత్నించారు. పోలింగ్ ప్రారంభమయ్యే వరకు చీరలు, నగదు యథేచ్ఛగా పంచారు.