breaking news
Shaurya
-
శౌర్య సంచలనం
హ్యూస్టన్ (అమెరికా): ప్రపంచ జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత కుర్రాడు శౌర్య బావా సంచలనం సృష్టించాడు. ఈ మెగా టోర్నీలో బాలుర సింగిల్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. 2014లో కుష్ కుమార్ తర్వాత ఈ టోర్నీలో భారత్‌కు పతకం రావడం ఇదే ప్రథమం. ఢిల్లీకి చెందిన 18 ఏళ్ల శౌర్య క్వార్టర్ ఫైనల్లో 2–11, 11–4, 10–12, 11–8, 12–10తో లో వా సెర్న్ (మలేసియా)పై గెలుపొందాడు. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శౌర్య మూడు మాŠయ్చ్ పాయింట్లను కాపాడుకోవడం విశేషం. నిర్ణాయక ఐదో గేమ్‌లో శౌర్య 7–10తో ఓటమి అంచుల్లో నిలిచాడు. అయితే శౌర్య ఆందోళన చెందకుండా సంయమనంతో ఆడి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. బాలికల సింగిల్స్ విభాగంలో జాతీయ చాంపియన్ అనాహత్ సింగ్ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో 16 ఏళ్ల అనాహత్ 8–11, 9–11, 11–5, 12–10, 11–13తో నదీన్ ఎల్హమీ (ఈజిప్‌్ట) చేతిలో పోరాడి ఓడిపోయింది. -
స్వాభిమాన పోరాటాలకు స్ఫూర్తి
పీష్వా బ్రాహ్మణులపై మహార్ పోరాట యోధుల యుద్ధ విజయానికి చిహ్నమే భీమా కోరేగావ్. 500 మంది మహర్ వీరులు 28 వేల మంది పీష్వా బ్రాహ్మణ సైన్యంతో మహారాష్ట్ర కోరే గావ్‌లోని భీమా నది వద్ద భీకర యుద్ధం చేసి 1818 జనవరి 1న విజయం సాధించారు. అపార సైనిక బలగం కలిగిన పీష్వా రాజ్యంతో యుద్ధం చేయలేని బ్రిటిష్ వాళ్లు తమతో కలిసి పోరాడాలని మహర్లను కోరారు. అప్పటి మహార్ నాయకుడు సిద్‌నాక్ పీష్వా సైన్యాధికారి బాపు గోఖలే వద్దకు వెళ్లి పశువులకన్నా హీనంగా చూడబడుతున్న తమకు గౌరవంగా బతికే అవకాశం కల్పించాలని కోరారు. యుద్ధం చేసినా, చేయకపోయినా మీ బతుకులకు మేము ఇచ్చే స్థానం ఇంతేనని గోఖలే కరాఖండీగా చెప్పారు. వేల సంవత్సరాల బానిస సంకెళ్లు తెంచు కోవాలని ప్రతిన బూనిన ఐదు వందల మంది మహర్ సైన్యం, రెండు వందల మంది బ్రిటిష్ సైన్యంతో కలిసి 200 కిలోమీటర్లు నడిచి భీమా నది ఒడ్డుకు చేరుకున్నారు. 20 వేల మంది పదాతిదళం, 8 వేల మంది అశ్విక దళంతో కనుచూపుమేరలో కని పిస్తున్న పీష్వా సైన్యాన్ని చూస్తే ఎవరికైనా వణుకు పుడుతుంది. కానీ బతికితే పోరాట వీరులుగా బత కాలనీ, లేదంటే హీనమైన బతుకులతో చావాలనీ నిర్ణయించుకున్న మహర్ సైన్యం పీష్వా సైన్యంతో యుద్ధానికి తలపడింది. తిండి లేకుండా కాలినడకన వచ్చి కూడా మహర్ సైన్యం సింహాల్లాగా పీష్వా సైన్యాన్ని ఎదుర్కోవడాన్ని చూసిన బ్రిటిష్ లెఫ్ట్‌నెంట్ కల్నల్ ఆశ్చర్యపోయారు. భీకర పోరాటంలో భీమా నది ఎర్రబడింది. పీష్వా సైన్యం వెనక్కి తగ్గింది. అమరులైన 12 మంది మహార్ సైనికులకు బ్రిటిష్ వారు స్మారక స్థూపం కట్టించడమే కాకుండా మహర్ సైనికులతో మహర్ రెజిమెంట్ ఏర్పాటు చేశారు. (చదవండి: డెస్మండ్ టూటూ.. వివక్షపై ధిక్కార స్వరం) 1927 జనవరి 1న ఈ స్మారక స్థూపాన్ని మొదటిసారి సందర్శించిన బాబాసాహెబ్ అంబేడ్కర్ దీన్ని దళితుల ఆత్మగౌరవ చిహ్నంగా పేర్కొన్నారు. ఆనాటి నుండి ప్రతి సంవత్సరం ఎందరో దళితులు జనవరి ఒకటిన దీని దర్శనానికి వెళ్లడం మొదలైంది. దళిత గౌరవం నిలిచి గెలిచిన రోజు అయినందున దేశవ్యాప్తంగా శౌర్య దివస్‌గా జరుపుకొంటున్నారు. (చదవండి: జీవించే హక్కు అందరి సొంతం కాదా?) అత్యంత క్రూరమైన అంటరానితనం పీష్వా బ్రాహ్మణ రాజ్యమైన పుణె ప్రాంతంలో ఉండేది. దళితుల నీడ కూడా అగ్రవర్ణాలపై పడకూడదనీ, దళితులు పొద్దున, సాయంత్రం అగ్రవర్ణాల వారి ఇళ్లకు గానీ వారి దగ్గరకు గానీ పోగూడదనీ, తమ నీడ తమ పైన పడే పట్టగలు మాత్రమే వెళ్లాలనే నిబంధన ఉండేది. శివాజీ పాలనలో ఇలా ఉండేది కాదు. శివాజీ పాలనలో సైన్యంలో ఉన్న మహార్లను అనంతర పాలకులు తొలగించి మనుధర్మాన్ని పకడ్బందీగా అమలుపరిచారు. 200 సంవత్సరాల క్రితం జరిగిన భీమా కోరేగావ్ యుద్ధ గాయం ఇంకా మానడం లేదు. యుద్ధం జరిగి 200 సంవత్సరాలు జరిగిన సంద ర్భంగా జరుపుకొన్న ఉత్సవాలపై అగ్రవర్ణాలవారు దాడి చేశారు. ఇప్పటికి దళితులూ, అగ్రవర్ణాల మధ్య తారతమ్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు భేదభావం లేదంటూ దళిత వాడల్లో భోజనాలు చేస్తూనే, మరోపక్క కోరేగావ్ లాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. (చదవండి: కీలవేణ్మని పోరాటం.. స్వతంత్ర భారత తొలి దళిత ప్రతిఘటన) శౌర్య దివస్ స్ఫూర్తిగా బ్యాలట్ యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఆనాడు ప్రత్యక్ష యుద్ధం చేసిన బహుజనులు నేడు ప్రజాస్వామ్య దేశంలో బహుజన రాజ్యం కోసం కొత్త ఎత్తుగడలతో ముందుకు సాగాలి. జ్యోతిరావు ఫూలే, పెరియార్, సాహూ మహారాజ్, నారాయణ గురు లాంటి మహానుభావుల మార్గంలో– బహుజనుల్లో ఎదిగిన వాళ్లు విలువలతో కూడిన రాజకీయాల నిర్మాణం చేయాలి. - సాయిని నరేందర్ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు (జనవరి 1న భీమా కోరేగావ్ శౌర్య దినోత్సవం) -
ఏపీ: ట్రాఫిక్ ఆర్ఎస్ఐకు అరుదైన గౌరవం
సాక్షి, అమరావతి: మహిళ ప్రాణాలు రక్షించిన ట్రాఫిక్ ఆర్ఎస్ఐ అర్జున్‌రావుకు అరుదైన గౌరవం దక్కింది. "ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శౌర్య పతకం" ప్రభుత్వం ప్రకటించింది. ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ గౌతమ్ సవాంగ్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన "దిశ"పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. "దిశ"పై మహిళా పోలీసులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ దిశానిర్దేశం చేశారు. ఇంటింటికి వెళ్లి మహిళల ఫోన్లలో దిశయాప్‌ను డౌన్లోడ్ చేసి అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలలు, విద్యాసంస్థల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలని డీజీపీ ఆదేశించారు. చదవండి: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు ఏపీ మరో కీలక నిర్ణయం: వారిక మహిళా పోలీసులు -
దోవల్ కొడుకు పొలిటికల్ ఎంట్రీ!
డెహ్రాడూన్ : జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కుమారుడు శౌర్య దోవల్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధ చేసుకుంటున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పౌరీ ఘర్వాల్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. 43 ఏళ్ల శౌర్య దోవల్ ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్‌గా ఉన్నారనే విషయం తెలిసిందే. కాగా గత కొంత కాలంగా శౌర్య ప్రజలతో మమేకమవుతున్నారు. ‘బీమిసాల్ ఘర్వాల్ అభియాన్’ ద్వారా ఘర్వాల్ అభివృద్దికి తోడ్పాటును అందిస్తున్నారు. ఈ స్కీమ్‌లో ప్రజలను భాగస్వాములను చేయుటకోసం రెండు మొబైల్ నంబర్లను కూడా బ్యానర్లలో, కటౌట్లల్లో ప్రచురించారు. ఒక మిస్డ్ కాల్ ఇస్తే అభియాన్‌లో భాగస్వామ్యులు కావాలని తెలియజేస్తారు. మరో నంబర్ ద్వారా ‘ మెరుగైన ఘర్వాల్ గురించి ఆలోచిస్తున్న వారు ప్రచారంలో పాల్గొనవచ్చు ఇది శౌర్య దోవల్ యొక్క చొరవ’ అని పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఘర్వాలి భాషలో కూడా అందుబాటులో ఉంచారు. ఘార్వాలి జిల్లాతోపాటు చుట్టుపక్కల మరో ఏడు జిల్లాల్లో కూడా శౌర్య పోటోలతో బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేశారు. ఇదంతా శౌర్య పొలిటికల్ ఎంట్రీ కోసమే అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతంలో శౌర్య దోవల్ బీజేపీలో చేరతారన్న ఊహాగానాలొచ్చాయి. 2019 ఎన్నికలకు ముందు ఆయన చేరతారని పార్టీ వర్గాలు అన్నాయి. 2017 డిసెంబర్లో ఉత్తరాఖండ్ రాష్ట్ర బీజేపీ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో కూడా శౌర్య పాల్గొన్నారు. అయితే తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశంలేదని శౌర్య అప్పట్లో అన్నారు ‘ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు. అది నా చేతుల్లో లేదు. కానీ బెమిసాల్ ఘర్వాల్, బులండ్ ఉత్తరాఖండ్ ప్రాంతాల అభివృద్దికి కృషి చేస్తాను. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రాజకీయ బలం కూడా అవసరం అని అర్థమయింది’ అని శౌర్య ఓ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. కాగా దోవల్ పొలిటికల్ ఎంట్రీ గురించి బీజేపీ పరోక్షంగా స్పందించింది. ‘ బెమిసాల్ ఘర్వాల్ ప్రచారం శౌర్య రాజకీయ ఎంట్రీకి ఉపయోగ పడుతుంది. ఈ ప్రచారంలో బీజేపీ పాల్గొనలేదు. అతనికి చాలా తెలివి ఉంది. ఉత్తరాఖండ్ సమస్యలపై ఆయనకు పట్టుఉంది. ఇలాంటి తెలివైన వాళ్లు రాజకీయాల్లోకి రావాలి’ అని ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు అజయ్ భట్ పేర్కొన్నారు. -
ఘోర నేరాలపై శౌర్యం
కొన్ని కథలు కొత్తగా ఉంటాయి. మరికొన్ని కొత్తగా చెప్పాల్సి ఉంటాయి. చాలా కొద్దికథలే కొత్తగానూ, కొత్తగా చెప్పినట్లుగానూ ఉంటాయి. మొదటి రెండు రకాల సినిమాలూ తరచూ వస్తాయి. మూడో రకం సినిమాలు రావ డమే అరుదు. అలాంటి సినిమాలు తీసేవారూ అరుదే. అలాంటి సినిమా తీయాలనుకున్నప్పుడు రాత, దానితో పాటు తీత - రెండూ కత్తి మీద సామే. కానీ, ధైర్యం చేసి, దర్శక - నిర్మాతలు తెరపై చూపిన ‘శౌర్య’ం - ఈ ఫిల్మ్. చిన్న పాయింట్‌తో అల్లుకున్న 2 గంటల కథేమిటంటే, శౌర్య (మనోజ్) కోట్ల ప్రాజెక్ట్ సాధించినా, దాన్ని ప్రేమించిన అమ్మాయి నేత్ర (రెజీనా) కోసం వదులుకొనే కుర్రాడు. శివరాత్రి నాటి రాత్రి మొక్కు తీర్చేందుకు గుడిలో జాగారం చేస్తుంటే, హీరో పక్కనే హీరోయిన్ పీక తెగి, రక్తపు మడుగులో ఉంటుంది. ఆ నేరం హీరోపై పడుతుంది. డెత్బెడ్ మీద ఉన్న ఆ అమ్మాయి ఒక నంబర్ రాసి, కన్ను మూస్తుంది. ఎంపీ కూతురైన హీరోయిన్‌కీ, హీరోకీ సంబంధమేంటి? ఆ నంబరేంటి? హీరోయే నిజంగా నేరం చేశాడా లాంటి వన్నీ సస్పెన్స నిండిన ఈ థ్రిల్లర్ లవ్‌స్టోరీలో తెరపై చూడాల్సినవి. గత ఏడాదే వివాహమైన మనోజ్ ఈ సినిమాలో పాత్ర కోసం బొద్దుగా, ముద్దుగా అయ్యారు. ఎమ్‌ఫార్మసీ చదివిన, హుందాతనం నిండిన ఉద్యోగిగా కాస్ట్యూమ్స్‌లో కొత్తగా కనిపించే ప్రయత్నం చేశారు. ఇక, హీరో ప్రేమికురాలిగా, పలుకుబడి ఉన్న ఎంపీ కూతురు నేత్రగా రెజీనాది అభినయపరంగా కాకున్నా, కథా పరంగా కీలక పాత్ర. ఎస్.ఐగా ప్రకాశ్‌రాజ్‌ది ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ రోల్. హీరోయిన్ తండ్రిగా నాగినీడు, బాబాయ్‌గా సుబ్బరాజులది పాత్రోచిత నటన. కామిక్ రిలీఫ్ కోసం సినిమాలో హీరోయిన్ బావగా ‘ప్రభాస్’ శ్రీను, పోలీసు కానిస్టేబు ల్గా ‘షకలక’ శంకర్ లాంటివాళ్ళున్నారు. ‘చుచ్చూ పోయిస్తా!’ అంటూనే, లేని దయ్యానికి భయపడే మినిస్టర్‌గా బ్రహ్మానందం సెకండాఫ్‌లో ఎంట్రీ ఇస్తారు. ఆయనపై పాట అదనం. ఆ కాసేపు పక్కన పెడితే, మిగతా సినిమా అంతా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, సీరియల్ ఆఫ్ సీన్స్. చిత్రం: ‘శౌర్య’, తారాగణం: మంచు మనోజ్, రెజీనా కసండ్రా, ప్రకాశ్‌రాజ్, నాగినీడు, సుబ్బరాజు, బ్రహ్మానందం, ‘ప్రభాస్’ శ్రీను, రచన: గోపీ మోహన్, మాటలు: దశరథ్, కిశోర్ గోపు, సంగీతం: కె. వేదా, ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్, నిర్మాత: మల్కాపురం శివకుమార్, కథ - దర్శకత్వం: దశరథ్, నిడివి: 121 నిమిషాలు, రిలీజ్: మార్చి 4 దర్శకుడు దశరథ్ సోదరుడైన వేదా ఇచ్చిన సంగీతం ఆయనలోని వైవిధ్య ప్రదర్శనకు ఉపకరిస్తుంది. కెమేరామన్, ఎడిటర్, ఫైట్స్ లాంటి సాంకేతిక విభాగాలన్నీ కథ, కథనానికి తగట్టుగానే ఉన్నాయి. మొదట క్యారె క్టర్ల పరిచయం, పీటముడిగా మారిన ఒక ఊహించని క్రైమ్‌లో అనుకోని మలుపుతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఆ సమయంలో కోర్టులో హీరో చెప్పిన ఒక మాటతో ఊహించని ట్విస్ట్. దాంతో, ఇంటర్వెల్. ‘థ్రిల్ కంటిన్యూస్’ అనే ఇంటర్వెల్ కార్డ్‌కు తగ్గట్లే, ఫస్టాఫ్ తర్వాతా కథ సీరియస్‌గా సాగిపోతూ... ఉంటుంది. మరో అరగంటలో సినిమా ముగుస్తుందనగా, కథలో కొత్త వేగం వస్తుంది. ఓపిక పట్టినవాళ్ళకు సస్పెన్స్ వీడే అరగంట తప్పక బాగుంటుంది. పెచ్చరిల్లుతున్న కుల విద్వేషాలు, పరువు హత్యలనే సమకాలీన అంశాన్ని ఇతివృత్తంగా ఎంచుకోవడం అభినందించాల్సిందే. అయితే, దాన్ని మనసును కదిలించే సెంటిమెంటల్ అంశాలతో కాకుండా, విభిన్నంగా క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్‌గా రూపొందించాలని భావించారు. ముడివీడనట్లు కనిపిస్తున్న ఒక నేరం తాలూకు మిస్టరీని సాల్వ్ చేయడం కోసం సస్పెన్స్ పంథాను ఆశ్రయించారు. అలా ఈ సినిమా పూర్తిగా ఆ దోవలో వెళ్ళింది. ఈ వ్యవహారంలో హీరోతో పాటు పోలీస్ ప్రకాశ్‌రాజ్, నేరస్థులూ మరింత కీలకంగా వ్యవహరిస్తే, కథకు ఇంకా ఊపు, ఉత్సాహం వచ్చేవి. మిస్టరీ సాల్వేషన్కి ఒకరు, దానికి వ్యతిరేకంగా మరొకరు వ్యవహరించడ మనే పంథాలో కలిసొస్తుంది. మొత్తం మీద, ప్రేమకథలోనే సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాల లాంటివి కలవడం ఒక కొత్తదనమే. అందుకే, టీవీలో కనిపించే ‘నేరాలు - ఘోరాలు’ లాంటి క్రైమ్స్టోరీలకు ఇది వినూత్నమైన వెండితెర ఆవిష్కారం. చాలాసార్లు మనం చూసి ఊహించే దానిలోనో, అవతలివాళ్ళు చెప్పే దానిలోనో కాక, అసలు నిజం వేరొకటి ఉంటుందని అవగాహన కల్పిస్తుంది. వెరసి, ఈ సినిమా ‘ఆనర్ కిల్లింగ్స్’ లాంటి ఘోర మైన నేరాలపై చూపిన ‘శౌర్యం’. - రెంటాల జయదేవ -
మాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్
సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేయడానికైనా, బరువు పెరగడానికైనా సిద్ధపడిపోతారు కొంతమంది హీరోలు. అలా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాలనుకునే హీరోల్లో మనోజ్ ఒకరు. దశరథ్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘శౌర్య’ నేడు విడుదలవుతోంది. మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ చిత్రం కోసం మనోజ్ బొద్దుగా తయారయ్యారు. ఇక... మనోజ్ ముచ్చట్లు తెలుసుకుందాం... ♦ ‘శ్రీ’ నుంచి నాకు దశరథ్ గారు తెలుసు. ఆయన కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం ఉంది. ఒకరోజు ఫోన్ చేసి, కథ చెబుతానంటే ఇంటికి రమ్మన్నాను. 30 నిముషాల్లో కథ చెప్పారాయన. ఆ కథ నచ్చింది. ఆ తర్వాత గెటప్ ఎలా ఉండాలనే విషయం గురించి చర్చించుకున్నాం. మామూలుగా నా సినిమాలంటే ఫైట్లు, డ్యాన్సులు కామన్‌గా ఉంటాయనుకుంటారు. అలాగే నేను కొంచెం రఫ్ లుక్‌లో కనిపిస్తాను. కానీ, తనకలా వద్దనీ, కొంచెం బొద్దుగా, క్యూట్‌గా ఉండాలనీ దశరథ్ చెప్పారు. దాంతో బాగా తినడం మొదలుపెట్టాను. కానీ, నా మజిల్ పవర్ మాత్రం తగ్గలేదు. అందుకని పప్పు-ఆవకాయ్-నెయ్యి బాగా తినడం మొదలుపెడితే, అప్పుడు బుగ్గలు వచ్చాయి. ప్యాంటు, షర్ట్ టక్ చేసుకుని, పక్క పాపిడి తీసి, నున్నగా దువ్వుకుని, ప్లెయిన్ షర్ట్స్ వేసుకుని లుక్‌ని సెట్ చేసుకున్నాం. ఈ సినిమా కోసం మొత్తం ఎనిమిది కిలోలు బరువు పెరిగాను. ♦ ఈ చిత్రకథ విషయానికొస్తే.. మొదటి పది నిమిషాల్లో ఇది ఎలాంటి సినిమా? అనేది తెలిసిపోతుంది. అక్కణ్ణుంచి ఆసక్తికరంగా ఉంటుంది. రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు దశరథ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. దశరథ్ తనను తాను ఊహించుకుని క్రియేట్ చేసిన పాత్రలో నేను నటించాను. మొత్తం క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. ఇది పక్కా దర్శకుడి సినిమా. మొన్ననే మా ఫ్యామిలీ అంతా సినిమా చూశాం. సంగీత దర్శకుడు వేదాకి ఇది తొలి సినిమా అయినప్పటికీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇరగదీసేశాడు. ♦ నేనే సినిమా ఒప్పుకున్నా మా ఇంట్లోవాళ్లతో, ఇతరులతో షేర్ చేసుకోను. నాకు కథ, పాత్ర నచ్చితే ఒప్పేసుకుంటాను. ఫైనల్‌గా అవుట్‌పుట్ చూపిస్తాను. జయాపజయాల గురించి అస్సలు ఆలోచించను. ఎందుకంటే, మా నాన్నగారు కెరీర్లో శిఖరాగ్రంలో ఉన్నప్పుడూ చూశాను. డౌన్లో ఉన్నప్పుడూ చూశాను. అందుకే మాకు జయాపజయాల గురించి పెద్దగా పట్టింపు ఉండదు. మా నాన్నగారు ఈ సినిమా చూసి, ‘చాలా సటిల్‌గా చేశావ్’ అని అభినందించారు. ♦ పెళ్లికి ముందు... పెళ్లి తర్వాత నాలో వచ్చిన మార్పు ఒక్కటే. ఐదు సంవత్సరాల క్రితం నుంచే మాకు పరిచయం ఏర్పడింది. మాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఐదేళ్లు ఎవరి కంటా పడకుండా తిరిగి, మ్యానేజ్ చేశాం. పెళ్లి తర్వాత అందరి కంటా పడేలా తిరుగుతున్నాం. అదే తేడా (నవ్వుతూ)! ♦ ‘కులం, డ్రగ్స్... ఈ రెండూ చాలా ప్రమాదకరం. దయచేసి ఈ రెండింటినీ దగ్గరకు చేరనివ్వద్దు’ అని ఈ మధ్య యూత్‌కి చెబుతున్నాను. నా సినిమాను ఫలానా కులం వాళ్లే చూస్తారు... వేరే హీరోల సినిమాలు వాళ్ల కులం వాళ్లు చూస్తారు.. అనే పిచ్చి ఫిలాసఫీని నేను నమ్మను. సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. ♦ ఈరోజు మూడు సినిమాలు విడుదలవుతున్నాయ్. నాకు పోటీల్లాంటివి ఉండవు. ‘మనం ముగ్గురం పార్టీ చేసుకుందాం’ అని ఆ మిగతా రెండు సినిమాల వాళ్లతో నేను అన్నాను. ఇండస్ట్రీ ప్రస్తుతానికి చాలా ఆరోగ్యకరంగా ఉంది. ఎప్పటికీ అలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఫైనల్‌గా ప్రేక్షకులను నేను కోరుకునేది ఒక్కటే. అందరూ కలిసి నా సినిమాను థియేటర్లో చూడండి. పైరసీ చేయొద్దు. -
కొత్త కొత్తగా...
‘‘ఇందులో నాది చాలా మంచి క్యారెక్టర్. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. భవిష్యత్తులో మనోజ్‌తో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నా’’ అని రెజీనా చెప్పారు. మంచు మనోజ్, రెజీనా జంటగా దశరథ్ దర్శకత్వంలో బేబి త్రిష సమర్పణలో శివకుమార్ మల్కాపురం నిర్మిస్తున్న ‘శౌర్య’ సాంగ్ టీజర్ ఆవిష్కరణ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఇదొక థ్రిల్లింగ్ లవ్‌స్టోరీ అని, చిత్రీకరణ మొత్తం పూర్తయిందని దశరథ్ తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ ‘సూర్య వర్సెస్ సూర్య’ తర్వాత మా సంస్థలో వస్తున్న సినిమా ఇది. ఇందులో మనోజ్ చాలా కొత్త కొత్తగా కనబడతారు. జనవరిలో పాటలను, చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. నందు, మధుమణి, శివారెడ్డి, జీవీ తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: వేదా, కెమెరా: మల్హర్‌భట్ జోషి.