breaking news
Shahdol
-
ఒకే గోడ.. 4 లీటర్ల పెయింట్.. 233 మంది కార్మికులు
భోపాల్: దేశంలో రకరకాలుగా అక్రమాలు, మోసాలు జరుగుతున్నాయి. కానీ, ఇంతటి విడ్డూరాన్ని ఎన్నడూ చూడలేదంటూ ముక్కున వేలేసుకుంటున్నారు జనం. మధ్యప్రదేశ్‌లోని షహ్డోల్ జిల్లాలో వెలుగుచూసిందీ అంకెల గారడీ. బియోహరి అసెంబ్లీ నియోజకవర్గంలోని సకండి గ్రామ ప్రభుత్వ పాఠశాల గోడకు నాలుగు లీటర్ల రంగు వేసేందుకు ఏకంగా 168 మంది కూలీలు, 65 మంది తాపీ పనివారిని వినియోగించారు. ఇందుకోసం కాంట్రాక్టర్ రూ.1.07 లక్షల బిల్లు చేశాడు. ఎలాంటి పరిశీలనలు లేకుండానే అధికారులు సంతకాలు చేయడం, నగదు డ్రా చేసుకోవడం జరిగిపోయాయి. ఇలాంటిదే మరోటి..నిపనియా గ్రామంలోని స్కూలుకు 10 కిటికీలు, నాలుగు తలుపులకు 20 లీటర్ల రంగు వేసేందుకు 275 మంది కార్మీకులను, 150 మంది తాపీ పనివారిని పెట్టుకున్నారట. వీరికోసం కాంట్రాక్టర్ రూ.2.3 లక్షల మేర బిల్లు కోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు ఓకే చెప్పేశారు. స్కూలు భవనం గోడలపై కనిపించాల్సిన వీరి పనితనం..ఉత్తుత్తి లెక్కలు రాయడంలో రాటుదేలింది. సుధాకర్ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ ఇలాంటి కాకి లెక్కలు చూపి మే 5వ తేదీన బిల్లు చేసింది. ఈ బిల్లును ఏప్రిల్ 4వ తేదీనే స్కూలు ప్రిన్సిపాల్ ఓకే చేసినట్లు రికార్డుల్లో ఉంది. రంగు వేయడానికి ముందు, తర్వాత ఫొటోలను బిల్లులకు జత చేయడం తప్పనిసరి. ఏ ఫొటోలు లేకుండానే ఈ కంపెనీకి బిల్లులు మంజూరైపోవడం మరో ఘనత. బిల్లుల వ్యవహారం సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో నెటిజన్లు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఫూల్ సింగ్ మర్పంచి స్పందిస్తూ... సకండి, నిపనియా స్కూళ్లకు వేసిన రంగుల బిల్లు వ్యవహారం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దర్యాప్తు చేపట్టి, బాధ్యులైన వారిపై చర్యలుతీసుకుంటాం’అంటూ ముక్తసరిగా చెప్పేయడం విశేషం. -
దారుణం: ఆక్సిజన్ అందక ఆరుగురు మృతి
షాహ్‌దోల్: మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్‌లో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా కొరత కారణంగా ఆరుగురు కరోనా రోగులు మృత్యు వాతపడ్డారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం వేకువజాము మధ్యన ఈ దుర్జటన చోటు చేసుకుంది. ఐసీయూలో తగినంత ఒత్తిడితో ఆక్సిజన్ సరఫరా కాకపోవడంతో ఊపిరి అందక ఈ అరుగురు మృతి చెందారని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రి డీన్ డాక్టర్ మిలింద్ షిరాల్కర్ ఆదివారం తెలిపారు. ఐసీయూలో మొత్తం 62 మంది పేషెంట్లు ఉండగా... మిగతా వారంతా క్షేమంగా ఉన్నారని వివరించారు. శనివారం సాయంత్రం నుంచే ఆక్సిజన్ నిల్వలు తగ్గిపోవడంతో పదేపదే సరఫరా దారులను సంప్రదించామని, అర్ధరాత్రికి గాని ఆక్సిజన్ సిలిండర్లు రాలేదని తెలిపారు. అయితే షాహ్‌దోల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యేంద్ర సింగ్ మాట్లాడుతూ... పరిస్థితి విషమించే ఈ ఆరుగురు మరణించారని అన్నారు. ఒకవేళ ఆక్సిజన్ స్థాయి తగ్గితే మిగతా పేషెంట్లు కూడా ఇబ్బంది పడాలి కదా? అని ప్రశ్నించారు. చదవండి: లాక్డౌన్ పై నిర్మలా సీతారామన్ మరోసారి క్లారిటీ -
తాపీగా నకిలీ రూ.2000 నోట్లు ప్రింట్ చేస్తూ..
భోపాల్: ఎన్ని హెచ్చరికలు వచ్చినా, పోలీసుల తనిఖీలు జరుగుతున్నా పరిస్థితి మాత్రం మారడం లేదు. ఏం చక్కా కొత్త నోట్లను ముద్రిస్తూ ఇద్దరు వ్యక్తులు పోలీసులకు చిక్కిపోయారు. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అచ్చుయంత్రాన్ని ఓ స్కానర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం రూ.2000 నోట్లను మధ్యప్రదేశ్‌లోని షాడోల్లో ఓ ప్రాంగణంలో ముద్రిస్తున్నారు. ఇప్పటికే చాలా నోట్లను ముద్రించారు కూడా. పెద్ద నోట్ల రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కొత్త రూ.2000 నోట్లలో అప్పుడే దొంగనోట్లు వస్తున్నాయని గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా గతంలో నకిలీ నోట్లను ముద్రిస్తూ పట్టుబడిన వారి సహాయంతో గాలింపులు చేపడుతున్న పోలీసులు చివరకు ఓ ఇద్దరు వ్యక్తులను షాడోల్లో అరెస్టు చేశారు. వీరి వెనుక ఎవరైనా ఉండి ఉంటారా అనే వివరాలను తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించారు.