breaking news
Sewage flow
-
తాగునీటి సమస్య తలెత్తొద్దు
సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరా విషయంలో అప్రమత్తంగా ఉండాలని, రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఎల్ నినో నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని క్యూర్ ఏరియాలోని మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు) వంద శాతం సామర్థ్యంతో పనిచేసేలా చూడాలన్నారు.బుధవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో తాగునీటి సరఫరా, ఎస్టీపీల నిర్మాణం, శుద్ధి చేసిన జలాల వినియోగంపై సీఎం సమీక్ష నిర్వహించారు. సచివాలయం, సీఎంవో, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు, ఇతర శాఖల కార్యాలయాల్లో పచ్చదనం నిర్వహణతోపాటు ఇతర అవసరాలకు శుద్ధి చేసిన నీటిని వినియోగించాలని ఆదేశించారు.పబ్లిక్ పార్కులు, రోడ్ల శుభ్రతకు సైతం ఈ నీటినే వాడాలన్నారు. భవన నిర్మాణాల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రైవేట్ ఎస్టీపీల ఏర్పాటును ప్రోత్సహించాలని, డేటా కేంద్రాలకూ శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలని సూచించారు. ఎస్టీపీల నిర్వహణకు సౌర విద్యుత్ వినియోగించే అవకాశాలను పరిశీలించాలని రెడ్కో ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.శుద్ధి జలాల కోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్ఎస్టీపీల్లో నీటి శుద్ధికి అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలను పాటించాలని, నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడొద్దని సీఎం స్పష్టం చేశారు. ప్రతి శుద్ధి కేంద్రం వద్ద ప్రత్యేక అధికారిని నియమించాలని, అన్ని ప్లాంట్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కేంద్రాల పనితీరును హైడ్రా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసే ట్యాంకర్లను గుర్తించి పర్యవేక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.ఈ నీటి వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. శుద్ధి జలాల కోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఎస్టీపీల నిర్వహణ, శుద్ధి చేసిన నీటి వినియోగానికి సంబంధించి నవంబర్ 1వ తేదీ నుంచి ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం 26 ఎస్టీపీల నుంచి శుద్ధి చేసిన నీటిని గ్రీన్ ట్యాంకర్ల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు జలమండలి అధికారులు సీఎంకు వివరించారు.వినియోగదారుల నుంచి కేవలం రవాణా రుసుము మాత్రమే వసూలు చేస్తున్నామని, నీటిని ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎంవో కార్యదర్శి మాణిక్‌రాజ్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికొలస్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, టీజీఎస్పీడీసీఎల్ ఎండీ జితేష్ వి.పాటిల్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి రవి, సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: కరువును ఎదుర్కొంటాం -
మురుగు ముప్పు తప్పాలంటే..
పైపులైన్లు మారిస్తేనే ‘సాగర్’ శుద్ధి కూకట్పల్లి, సికింద్రాబాద్ నాలా పైపులైన్ మారిస్తేనే ప్రయోజనం అప్పటివరకు హుస్సేన్‌సాగర్‌లోకి యథేచ్ఛగా మురుగు ప్రవాహం రూ.376.13 కోట్ల ఆర్థిక సహాయం కోరుతూ కేంద్రానికి వినతి సిటీబ్యూరో: నగరం నడిబొడ్డున ఉన్న చారిత్రక హుస్సేన్‌సాగర్‌కు మురుగు, పారిశ్రామిక వ్యర్థజలాల నుంచి విముక్తికి కూకట్పల్లి, సికింద్రాబాద్ నాలా పైపులైన్ మారిస్తేనే ప్రయోజనమని జలమండలి పరిశీలనలో తేలింది. ఈ నాలకు సంబంధించిన కె అండ్ ఎస్ మెరుున్(కూకట్పల్లి, సికింద్రాబాద్ మెరుున్)ను 18.25 కిలోమీటర్ల మేర తక్షణం మార్చి కొత్త పైపులైన్ వేస్తేనే ప్రయోజనమని తేల్చింది. ఇందుకు రూ.261 కోట్లు అంచనా వ్యయం అవుతుందని నిర్ణరుుంచింది. లేనిపక్షంలో సాగర్‌కు మురుగు ముప్పు తప్పదని భావిస్తోంది. దీంతోపాటు నగరంలో ఇటీవలి భారీ వర్షాలకు దెబ్బతిన్న పైపులైన్లు, భవనాలు, మ్యాన్‌హోళ్లను పునరుద్ధరించేందుకు మొత్తంగా రూ.376.13 కోట్ల మేర నిధులు అవసరమని.. ఈ మొత్తాన్ని ఆర్థిక సహాయంగా అందజేయాలని ఇటీవల నగరానికి వచ్చిన కేంద్ర ప్రభుత్వ బృందానికి నివేదించింది. ఇదీ పరిస్థితి.. కూకట్పల్లి, బాలానగర్, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లోని బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్ కంపెనీల నుంచి రోజువారీగా సుమారు 450 మిలియన్ లీటర్ల వ్యర్థజలాలు వెలువడుతారుు. ఈ జలాలు కె అండ్ ఎస్ మెరుున్ ద్వారా హుస్సేన్‌సాగర్ సమీపంలో ఉన్న మారియెట్ హోటల్ వరకు దశాబ్దాల క్రితం వేసిన పైపులైన్ ద్వారా మళ్లిస్తున్నారు. అక్కడి నుంచి మూసీలోకి వదిలిపెడుతున్నారు. ఈ పైపులైన్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవడంతో సర్ప్లస్ నాలా నుంచి నిత్యం పారిశ్రామిక వ్యర్థజలాలు హుస్సేన్‌సాగర్‌లోకి చేరుతుండడంతో సాగర్‌కు మురుగు నుంచి విముక్తి లభించడంలేదు. మరోవైపు అమీర్‌పేట్ దివ్యశక్తి అపార్ట్మెంట్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వరకు ఉన్న ‘ఏ’ మెరుున్ భారీ మురుగునీటి పైపులైన్ కూడా ఇటీవలి భారీ వర్షాలకు ఎన్టీఆర్ గార్డెన్ వద్ద దెబ్బతినడంతో ఈ పైపులైన్ ద్వారా పారే మురుగు నీటిని కూడా సాగర్‌లోకి మళ్లిస్తున్నట్లు తెలిసింది. దీంతో సాగర్‌కు కష్టాలు తప్పడంలేదు. ఈనేపథ్యంలో కెఅండ్‌ఎస్ మెరుున్ పైపులైన్‌తోపాటు ఏ మెరుున్ పైపులైన్లను మార్చేందుకు ఆర్థిక సహాయం అందజేయాలని జలమండలి కేంద్ర బృందానికి సమర్పించిన నివేదికలో కోరింది.


