breaking news
september 22nd
-
22న జెడ్పీ చైర్మన్ ఎన్నిక
అనంతపురం అర్బన్: జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక ఈ నెల 22న ఉదయం 11 గంటలకు జెడ్పీ సమావేశం మందిరంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఖాళీ ఏర్పడిన జెడ్పీ చైర్మన్ పదవికి 22వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిందని కలెక్టర్ తెలిపారు. చైర్మన్ ఎన్నిక కోసం 18వ తేదీలోగా ఫారం–9 ద్వారా జెడ్పీ సభ్యులకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసేందుకు నోటీసు పంపాలని, అనివార్య కారణాల వల్ల 22వ తేదీన చైర్మన్ ఎన్నిక జరగకపోతే 23న నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిదని కలెక్టర్ పేర్కొన్నారు. -
వచ్చే నెల 22న జిల్లాస్థాయి కళా పోటీలు
అనంతపురం ఎడ్యుకేషన్ : కళా ఉత్సవ్–2016ను పురస్కరించుకుని విద్యాశాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 22న స్థానిక సైన్స్ సెంటర్లో వివిధ అంశాల్లో జిల్లాస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి (డీఈఓ) అంజయ్య ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో 9–12 తరగతులు చదువుతున్న విద్యార్థులు బృందాలుగా ఏర్పడి ఈ పోటీల్లో పాల్గొనాలని సూచించారు. వ్యక్తిగతంగా పోటీ పడే అవకాశం లేదని స్పష్టం చేశారు. బృందాల వివరాలను ఈ నెల 30లోగా 94400 88488, 94925 83514, 83413 88693 నంబర్లకు ఫోన్‌చేసి తెలియజేయాలని సూచించారు. పాల్గొనే అంశం, విద్యార్థుల సంఖ్యను కచ్చితంగా తెలియజే యాలని పేర్కొన్నారు. సంగీతానికి సంబంధించి 6–10 తరగతుల విద్యార్థులు ఒక బృందంగా, నాట్యం 8–10 మంది విద్యార్థులు, రంగస్థలం 8–12 మంది, దృశ్య కళలు 4–6 మంది విద్యార్థులు ఒక బృందంగా ఉండాలని తెలియజేశారు.