breaking news
sentenced to 20 years
-
షాకింగ్: 560 మంది శరీర భాగాలను అమ్ముకున్న తల్లీకూతుళ్లు!
వాషింగ్టన్: అమెరికాలోని కొలొరాడో రాష్ట్రంలో సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. శ్మశన వాటిక మాజీ ఓనర్ అయిన ఓ 46 ఏళ్ల మహిళకు ఫెడరల్ కోర్టు మంగళవారం 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అంత్యక్రియల కోసం తీసుకొచ్చిన 560 మృతదేహాలకు చెందిన వివిధ అవయవాలను బంధువులకు తెలియకుండానే అమ్ముకున్నట్లు నేరం నిరూపణ అయిన క్రమంలో ఈ మేరకు తీర్పు ఇచ్చింది. మృతుల బంధువులను మోసం చేసి ఫోర్జరీ డోనార్ పత్రాల సాయంతో ‘మేగన్ హెస్’ అనే మహిళ శరీర భాగాలను విక్రయించినట్లు తేలిందని అధికారులు తెలిపారు. గత జులై నెలలో తను చేసిన నేరాన్ని అంగీకరించిందని, ఈ క్రమంలోనే కోర్టు 20 ఏళ్ల శిక్ష విధించినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఆమెకు సహకరించిన తల్లి షిర్లే కొచ్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష పడినట్లు తెలిపింది. ఇదీ జరిగింది.. కొలొరాడో రాష్ట్రంలోని మోంట్రోస్‌లో ‘సన్‌సెట్ మెసా’ అనే శశ్మాన వాటిక, అవయవదాన సేవలను నిర్వహించేది మేగన్ హెస్. 69 ఏళ్ల తల్లి షిర్లే కొచ్ ఆమెకు ఈ కార్యక్రమాల్లో సహకరించేది. ఈ క్రమంలోనే ఇరువురు అక్రమంగా మృతదేహాల అవయవాలను విక్రయిస్తూ డబ్బులు సంపాదించటం మొదలు పెట్టారు. బంధువులే అవయవాలను దానం చేస్తున్నట్లుగా నకిలీ పత్రాలను సృష్టించి తమ చీకటి కార్యాన్ని నిర్విగ్నంగా కొనసాగించారు. ఇలా 560 మంది శరీర భాగాలను విక్రయించారు. 2016-2018 మధ్య అమెరికాలో అవయవాల విక్రయాలపై రాయిటర్స్ పరిశోధనాత్మక కథనాలు వెలువడిన క్రమంలో మేగన్ హెస్, ఆమె తల్లి షిర్లే చేసిన దందా బయటపడింది. తల్లీకూతుళ్ల విషయాన్ని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ)కి రాయిటర్స్ సమాచారం అందించడంతో వారి బిజినెస్ కేంద్రాలపై దాడులు చేసింది. అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రాధాన్యం కలిగిన కేసుగా పోలీసులు అభివర్ణించారు. ఇరువురిని అరెస్ట్ చేసి విచారించగా గత జులై నెలలో నేరం అంగీకరించారు. ఈ క్రమంలోనే మేగన్ హెస్కు 20 ఏళ్లు, ఆమె తల్లి షిర్లే కొచ్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది ఫెడరల్ కోర్టు. నిందితురాలి తల్లి షిర్లే ప్రధానంగా అవయవాలను శరీరం నుంచి వేరు చేసి భద్రపరిచే పనిలో సహకరించేదని తేల్చింది. తల్లీకూతుళ్ల ఆపరేషన్‌కు 200లకుపైగా కుటుంబాలు బాధితులుగా మారినట్లు తెలిసింది. మరోవైపు.. హెస్ చేసిన చర్యలను సమర్థించారు ఆమె న్యాయవాది. నిందితురాలికి 18 ఏళ్ల వయసులో మెదడు దెబ్బతిన్నదని అందుకే ఇలా ప్రవర్తించిందని చెప్పుకొచ్చారు. కోర్టులో సాక్ష్యం చెప్పిన ఓ బాధితుడు వారి నేరాలపై కీలక విషయాలు బయటపెట్టాడు. తన తల్లికి చెందిన భుజాలు, మోకాళ్లు, పాదాలు విక్రయించారని ఆరోపించారు. అమెరికాలో అవయవాల మార్పిడి కోసం గుండె, కిడ్నీలు వంటి వాటిని విక్రయించడం నేరం. వాటిని ఎవరైనా దానం చేస్తేనే మార్పిడికి ఉపయోగించాలి. చట్టం పరిధిలో లేని తల, భుజాలు, వెన్నెముఖలను సైతం వారు విక్రయించేవారని తేలింది. ఇదీ చదవండి: దేశం విడిచి వెళ్లమని బెదిరింపులు.. నెలకి రూ.1కోటి ఆఫర్: మహిళా కోచ్ -
గుర్మీత్ సింగ్‌కు 20 ఏళ్ల జైలు
-
గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలు
రెండు అత్యాచార కేసులకు రూ. 30 లక్షల జరిమానా కూడా ► గుర్మీత్‌కు శిక్ష ఖరారు చేసిన సీబీఐ కోర్టు న్యాయమూర్తి ► కోర్టు హాల్లో బోరున విలపించిన డేరా చీఫ్! ► శిక్షపై పైకోర్టులో అప్పీల్ చేస్తామన్న డిఫెన్స్ లాయర్లు ► హరియాణా, పంజాబ్‌ల్లో పటిష్ట భద్రత రోహ్తక్/చండీగఢ్: 2002 నాటి రెండు అత్యాచార కేసుల్లో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్ (50)కు సీబీఐ కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఒక్కో కేసులో పదేళ్ల చొప్పున రెండు కేసుల్లో మొత్తంగా 20 ఏళ్ల శిక్ష వేస్తున్నట్లు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ స్పష్టం చేశారు. దీంతోపాటు ఒక్కో కేసుకు రూ. 15 లక్షల చొప్పున జరిమానాను కూడా విధించారు. ఇందులో రూ.14 లక్షల చొప్పున బాధితురాళ్లకు అందజేయనున్నారు. రోహ్తక్ జిల్లా సునరియా జైల్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారు. కాగా, గుర్మీత్‌కు విధించిన శిక్షపై పైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు గుర్మీత్ తరపు న్యాయవాది తెలిపారు. శిక్ష ప్రకటించగానే డేరా చీఫ్ కోర్టు హాల్లోనే బోరున విలపించినట్లు తెలిసింది. కాగా, తీర్పు తర్వాత తలెత్తే ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు హరియాణా, పంజాబ్ రాష్ట్రాలు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశాయి. ఇరు రాష్ట్రాల్లోనూ ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు. క్షమించండి.. ప్లీజ్! గుర్మీత్‌ను పంచకులలోని కోర్టుకు తీసుకురావటం వల్ల పరిస్థితులు ఆందోళనకరంగా మారే అవకాశం ఉన్నందున సునరియా జైల్లోని లైబ్రరీ హాల్లో తాత్కాలిక కోర్టు ఏర్పాటు చేశారు. సోమవారం పంచకుల నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో జగ్దీప్ సింగ్ జైలుకు చేరుకున్నారు. గుర్మీత్ కూడా తెలుపురంగు కుర్తా, పైజామా మ్యాచింగ్ తెల్లని బూట్లు ధరించి కోర్టు హాల్లోకి వచ్చారు. మధ్యాహ్నం 2.30కు విచారణ ప్రారంభమైనప్పటి నుంచీ ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. గుర్మీత్‌కు విధించాల్సిన శిక్షపై డిఫెన్స్, ప్రాసిక్యూషన్ న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. డేరా చీఫ్ ఆరోగ్యం, అతను చేసిన సామాజిక సేవ నేపథ్యంలో శిక్ష తగ్గించాలని గుర్మీత్ తరపు న్యాయవాదులు కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి ఒక్కో అత్యాచారం కేసుకు పదేళ్ల చొప్పున 20 ఏళ్లపాటు కఠినకారాగార శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో గుర్మీత్ బోరున విలపించారని.. చేతులు జోడించి తనను క్షమించమని వేడుకున్నారని సీబీఐ తరపు న్యాయవాది తెలిపారు. గుర్మీత్‌కు రోహ్తక్ జైలులో ఖైదీ నంబరు 1997ను కేటాయించారు. వైద్య పరీక్షల అనంతరం డేరా చీఫ్ ఖైదీ దుస్తులను ధరించాల్సి ఉంటుంది. కేసు ఏంటి? జూలై 2007లో డేరా చీఫ్‌పై అంబాలా కోర్టులో సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. 1999, 2001లో ఇద్దరు సాధ్వి (మహిళా భక్తులు)లపై గుర్మీత్ అత్యాచారానికి పాల్పడ్డాడని అందులో పేర్కొంది. ఈ చార్జిషీటుపై విచారణ సందర్భంగా 2008లో డేరా చీఫ్‌పై నేర శిక్షాస్మృతి సెక్షన్లు 376 (అత్యాచారం), 506 (సాక్షులను భయపెట్టడం) కింద అభియోగాలు మోపింది. 2009, 2010లో ఇద్దరు ఫిర్యాదుదారులు కోర్టు ముందు తమ వాంగ్మూలం ఇచ్చారు. ఆగస్టు 17, 2017న ఈ కేసుల వాదనలు పూర్తి చేసిన సీబీఐ కోర్టు.. ఆగస్టు 25న గుర్మీత్‌ను దోషిగా ప్రకటించింది. కనిపిస్తే కాల్చివేత హెచ్చరికలు.. గుర్మీత్‌కు 20 ఏళ్లపాటు శిక్ష విధించటంతో అతని అభిమానులు మరోసారి విధ్వంసకాండకు పాల్పడతారన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో హరియాణా, పంజాబ్ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఆందోళనకారులు కనబడితే కాల్చేస్తామని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. గుర్మీత్‌కు శిక్ష ఖరారు చేసిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితిని సమీక్షించేం దుకు హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సాధ్యమైనన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజలు వదంతులు నమ్మొద్దని, డేరా అభిమానులు శాంతంగా ఉండాలని సీఎం కోరారు. అటు పంజాబ్‌లో పరిస్థితిని ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సమీక్షించారు. డేరా అనుచరులు కోర్టు తీర్పును ఆమోదించాలని, హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దని కోరారు. పరిస్థితులు చల్లారినట్లేనని భావించేంతవరకు సున్నిత ప్రాంతాల్లో కర్ఫ్యూ కొన సాగుతుందన్నారు. ఈ తీర్పును స్వాగతించే, వ్యతిరేకించే పరిస్థితుల్లేవని అమరీందర్ పేర్కొన్నారు. దేవుడి కాళ్లదగ్గర పడేశారు! డేరా చీఫ్‌కు శిక్ష ఖరారు సందర్భంగా న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనాదికాలంగా దేశంలో ఉన్న మతసంస్థలు, కొనసాగుతున్న పవిత్రమైన ఆధ్యాత్మిక సామాజిక సంస్కృతికి ఇలాంటి బాబాల ద్వారా మచ్చపడుతోందన్నారు. ‘విశ్వసించిన తమపైనే అత్యాచారానికి పాల్పడిన గుర్మీత్‌ను బాధితులే దేవుని కాళ్ల దగ్గర పడేశారు’ అని జగ్దీప్ సింగ్ వ్యాఖ్యానించారు. తనను నమ్మి వచ్చిన మహిళలపై గుర్మీత్ సింగ్ లైంగిక దోపిడీకి పాల్పడ్డారు. బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. అలాంటి వ్యక్తిపై కోర్టు ఎలాంటి సానుభూతి చూపించాల్సిన పనిలేదు. డేరా సచ్చా సౌదా వంటి మతసంస్థకు నాయకుడిగా చెప్పుకునే వ్యక్తి ఇలాం టి క్రూరత్వానికి ఒడిగట్టడం దారుణం.. తరతరాల భారత పవిత్రమైన ఆధ్యాత్మిక సామాజిక సంస్కృతికి మచ్చగా మిగిలిపోతుంది. పురాతనమైన దేశ సంస్కృతికి తీవ్రమైన నష్టం కలగజేస్తుంది’ అని న్యాయమూర్తి 9పేజీల తీర్పులో పేర్కొన్నారు. జైల్లో బాబాలు ఆశారాం బాపు జననం: 17 ఏప్రిల్ 1941 2013: జోధ్‌పూర్‌లో తనను ఆశారాం లైంగికంగా వేధించారని 16 ఏళ్ల బాలిక ఫిర్యాదు చేయడంతో ఈయనను అరెస్టు చేశారు. సంత్ రాంపాల్ హరియాణాలోని ‘సత్లోక్’ ఆశ్రమం వ్యవస్థాపకులు నవంబర్ 2014: దేశద్రోహం, హత్య, హత్యకు కుట్ర పన్నడం, అక్రమంగా ఆయుధాలు కల్గిఉండటం తదితర కేసులపై అరెస్టు చేశారు. స్వామీ నిత్యానంద జననం: 1 జనవరి 1977 ఏప్రిల్ 2010: అత్యాచారం, నమ్మకద్రోహం, బెదిరింపులకు సంబంధించిన కేసుల్లో అరెస్టు చేశారు.