breaking news
senior woman team
-
భారత మహిళలకు తొలి ఓటమి
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా పర్యటనలో భారత సీనియర్ మహిళల జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. శనివారం అర్జెంటీనా జూనియర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 1–2 గోల్స్ తేడాతో ఓటమి పాలైంది. అర్జెంటీనా తరఫున మ్యాచ్ 11వ నిమిషంలో సోల్ పాగెల్లా గోల్ చేయగా... 54వ నిమిషంలో సలీమా (భారత్) దాన్ని సమం చేసింది. అయితే మరో 3 నిమిషాల్లోనే గోల్ సమర్పించుకున్న భారత్ ఓటమి పాలైంది. మ్యాచ్ 57వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను అగస్టినా గోర్జెలానీ నేర్పుగా గోల్ చేసి తమ జట్టుకు విజయాన్ని అందించింది. ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌లు 2–2, 1–1తో డ్రాగా ముగిశాయి. తదుపరి మ్యాచ్ ఆదివారం జరగనుంది. -
సెంట్రల్‌జోన్ సీనియర్ ఉమన్ క్రికెట్ టీం ఎంపిక
ఒంగోలు: సెంట్రల్ జోన్ సెక్రటరీ కోకా రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం సెంట్రల్ జోన్ ఉమన్ క్రికెట్ టీం ఎంపిక చేశారు. స్థానిక శర్మ కాలేజీ గ్రౌండ్లో ప్రారంభమైన ఈ సెంట్రల్ జోన్ పరిధిలోని ప్రకాశం, కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జట్ల మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న మ్యాచ్‌లలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో టీం ఎంపిక పూర్తి చేశారు. ఎంపికలో సెలక్షన్ కమిటీ చైర్మన్ సయ్యద్ ఆలీ, కోకా రమేష్, ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చింతపల్లి ప్రతాప్కుమార్లతోపాటు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఉమన్ టీం కోచ్ ఎస్.శ్రీనివాసరెడ్డి ఉన్నారు. సెంట్రల్ జోన్ టీం : ఎస్.మేఘన(కెప్టెన్–కృష్ణా జిల్లా), ఆర్.కల్పన–వికెట్ కీపర్ (వైస్ కెప్టెన్–కృష్ణా జిల్లా), పీవీ సుధారాణి, టి.మల్లిక(ప్రకాశం), సీహెచ్.ఝాన్సీలక్ష్మి(గుంటూరు), జి.స్నేహ, ఎం.భావన,కె.థాత్రి, ఎల్ఎస్ఎస్ తేజస్విని(కృష్ణా), జి.నవ్యదుర్గ, సీహెచ్.కవిత, వికెట్ కీపర్ కె.హెప్సీబా, ఇ.సత్యవాణి, ఎం.లావణ్య(పశ్చిమ గోదావరి)లను ఎంపిక చేశారు. స్టాండ్‌బైలుగా టి.ఉమాదేవి(పశ్చిమగోదావరి), ఎన్.జ్యోతిర్మయి, కె.ఆకాంక్ష(కృష్ణా), కె.శ్రీఅమృత(గుంటూరు), పి.కల్పన, సింధుశ్రీ(ప్రకాశం జిల్లా)లు ఎంపికయ్యారు. ఈ జట్టుకు కోచ్‌గా ఎస్.రమాదేవి, డి.చంద్రికలు ఎంపికయ్యారు.