ఆరో రోజు 22,840 క్వింటాళ్ల విత్తన పంపిణీ
అనంతపురం అగ్రికల్చర్ : విత్తన వేరుశనగ పంపిణీలో ఆరో రోజు మంగళవారం 63 మండలాల పరిధిలో 19,695 మంది రైతులకు 22,840 క్వింటాళ్లు పంపిణీ చేసినట్లు వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం మీద ఇప్పటివరకు 85,552 మంది రైతులకు 99,339 క్వింటాళ్లు అందజేశామని పేర్కొన్నారు. కమ్యూనిటీ మేనేజ్మెంట్ సీడ్ సిస్టం (సీఎంఎస్ఎస్) కింద మన విత్తన కేంద్రాల (ఎంవీకే) ద్వారా కూడా ఎంపిక చేసిన ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.