breaking news
secret visit
-
సి-17లో వచ్చిందెవరో తెలుసా?.. ఆయనే!
మాస్కోలో అర్ధరాత్రి అమెరికా సైనిక విమానం ల్యాండ్ అయింది. ఆ వెంటనే రష్యాపై ఉక్రెయిన్ దాడులు ఆగిపోయాయి! అసలు ఆ విమానంలో ఉన్నదెవరు? ఎందుకు ఇంత రహస్యంగా మాస్కోకు వచ్చారు? అనే ప్రశ్నలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపాయి. ఇప్పుడు ఆ మిస్టరీ దాదాపు వీడినట్లే కనిపిస్తోంది. అమెరికా సీఐఏ డైరెక్టర్ జాన్ ర్యాట్‌క్లిఫ్ రష్యా అధికారులతో రహస్య చర్చల కోసం మాస్కో వచ్చినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి.అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) డైరెక్టర్ జాన్ ర్యాట్‌క్లిఫ్ రహస్యంగా రష్యా వెళ్లడం తీవ్ర చర్చకు దారితీసింది. ఆయన ఎవరిని కలిశారు? ఎలాంటి అంశాలపై చర్చలు జరిపారు? అనే వివరాలు బయటకు రావాల్సి ఉంది. అయితే మంగళవారం ఆయన రష్యా అధికారులతో సమావేశమైనట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఇదే సమయంలో అమెరికా సీఐఏ ఈ విషయంపై స్పందించేందుకు నిరాకరించగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ కూడా మీడియా ముందు ఈ పర్యటనను ధ్రువీకరించలేదు. మాస్కోకు సి-17 గ్లోబ్మాస్టర్మంగళవారం అమెరికా సైన్యానికి చెందిన భారీ రవాణా విమానం సి-17 గ్లోబ్‌మాస్టర్-3 మాస్కోలోని వ్నూకోవో విమానాశ్రయంలో దిగింది. విమానాల ట్రాకింగ్ వివరాల ప్రకారం.. ఈ విమానం తొలుత లాత్వియా రాజధాని రిగాకు చేరుకుని, అక్కడి నుంచి మాస్కోకు వెళ్లింది. అమెరికా సైన్యానికి చెందిన ఈ విమానం సైనికులు, వాహనాలు, భారీ కార్గో రవాణాకు ఉపయోగిస్తారు.అయితే విమానంలో ఎవరు ప్రయాణించారనే విషయాన్ని అమెరికా అధికారికంగా వెల్లడించలేదు. లాత్వియా రక్షణ శాఖ మాత్రం ఈ విమానానికి తమ గగనతలంలో ప్రయాణించేందుకు అనుమతి ఉందని, అవసరమైన సమన్వయం పూర్తయినట్లు తెలిపింది. ఆ వెంటనే విమానంలో సీఐఏ డైరెక్టర్ ర్యాట్‌క్లిఫ్ ఉన్నట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. U.S. Air Force Boeing C-17A Globemaster III strategic airlifter descending to land at the Vnukovo International Airport in Moscow on Tuesday morning.The cameraman, likely sarcastically, comments: "we are under attack!" https://t.co/7EfvANBScW pic.twitter.com/dVItO5nAjn— Status-6 (War & Military News) (@Archer83Able) August 25, 2026ఉక్రెయిన్‌కు అమెరికా కీలక సూచనర్యాట్క్లిఫ్ పర్యటనకు ముందు అమెరికా.. ఉక్రెయిన్‌కు కీలక సూచన చేసినట్లు సమాచారం. మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్తో పాటు రష్యాలోని ఉత్తర ప్రాంతాలపై సోమవారం నుంచి బుధవారం వరకు డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేయవద్దని కోరినట్లు తెలుస్తోంది. రష్యా రాజధానికి ఓ సీనియర్ అమెరికా అధికారి ప్రయాణిస్తున్నారని కూడా కీవ్‌కు సమాచారం ఇచ్చినట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ కథనాలు వెలువడ్డాయి. ఈ పరిణామం అమెరికా–ఉక్రెయిన్ సంబంధాలపైనా ఆసక్తిని రేకెత్తిస్తోంది. రష్యాతో యుద్ధం కొనసాగిస్తున్న ఉక్రెయిన్ను అమెరికా బహిరంగంగా సమర్థిస్తున్న సమయంలోనే.. సీనియర్ అమెరికా గూఢచార అధికారి మాస్కోకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.నాలుగేళ్ల తర్వాత మళ్లీ సీఐఏ చీఫ్ రాకర్యాట్క్లిఫ్ పర్యటన నిజమైతే.. 2021 తర్వాత రష్యా రాజధానికి అమెరికా గూఢచార సంస్థ అధిపతి వెళ్లడం ఇదే తొలిసారి. అప్పటి సీఐఏ డైరెక్టర్ విలియం బర్న్స్ 2021 నవంబర్‌లో మాస్కో వెళ్లి అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరిపారు. ఆ భేటీ జరిగిన మూడు నెలలకే రష్యా ఉక్రెయిన్‌పై దాడికి దిగింది. ప్రస్తుతం కూడా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండటం, మరోవైపు అమెరికా–రష్యా మధ్య సంబంధాలు సున్నితంగా ఉండటంతో ర్యాట్‌క్లిఫ్ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.రష్యా–ఇరాన్ బంధం కూడా కీలకమే..ర్యాట్‌క్లిఫ్ మాస్కో పర్యటన సమయంలో మరో అంశం కూడా చర్చకు వస్తోంది. ఇరాన్‌తో రష్యాకు ఉన్న సన్నిహిత సంబంధాలు అమెరికాకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు అమెరికా ఇటీవల కొత్త ఆంక్షలు ప్రకటించింది. ఇరాన్‌తో వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలు, సంస్థలపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.రష్యా మాత్రం ఇరాన్‌తో సైనిక, ఆర్థిక, దౌత్య సంబంధాలను కొనసాగిస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు ఇరాన్ డ్రోన్లు అందించినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. మరోవైపు రష్యా.. ఇరాన్‌కు అమెరికా లక్ష్యాలపై దాడులకు ఉపయోగపడే ఉపగ్రహ చిత్రాలను అందించిందని ఉక్రెయిన్ ఆరోపించింది. మాస్కో ఈ ఆరోపణలను ఖండించింది.ఖైదీల మార్పిడిలోనూ కీలక పాత్రఅమెరికా–రష్యా మధ్య ఖైదీల మార్పిడి వ్యవహారాల్లోనూ సీఐఏ కీలక పాత్ర పోషిస్తోంది. ర్యాట్‌క్లిఫ్ స్వయంగా 2025 ఏప్రిల్‌లో అమెరికా–రష్యా ద్వంద్వ పౌరురాలు క్సేనియా కరేలినా విడుదలకు సంబంధించిన చర్చల్లో పాల్గొన్నట్లు సమాచారం. 2024లో వాల్‌స్ట్రీట్ జర్నల్ విలేకరి ఇవాన్ గెర్ష్కోవిచ్, మాజీ అమెరికా మెరైన్ పాల్ వీలన్ విడుదలకు దారితీసిన ఖైదీల మార్పిడిలోనూ సీఐఏ ప్రమేయం ఉంది.పుతిన్‌తో భేటీ ఉంటుందేమో!ర్యాట్‌క్లిఫ్ మాస్కో పర్యటన వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఉక్రెయిన్ యుద్ధం, రష్యాతో సంబంధాలు, ఇరాన్ అంశం, ఖైదీల మార్పిడి వంటి పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. అధికారికంగా ఎలాంటి వివరాలు బయటకు రాలేదు.ఇదీ చదవండి: ఇరాన్‌పై కోపం.. భారత కంపెనీలకూ షాక్! -
యూఏఈలో ఇజ్రాయెల్ ప్రధాని రహస్య పర్యటన
జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో అత్యంత రహస్యంగా పర్యటించారు. 'ఆపరేషన్ లయన్స్ రోర్' కొనసాగుతున్న సమయంలోనే ఆయన ఈ పర్యటన చేపట్టారని, అక్కడ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమయ్యారని నెతన్యాహు కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.ఇరాన్‌తో యుద్ధం జరుగుతున్న తరుణంలో, ఇజ్రాయెల్ తన 'ఐరన్ డోమ్' గగనతల రక్షణ వ్యవస్థలను, సంబంధిత సిబ్బందిని యూఏఈకి పంపినట్లు ఇజ్రాయెల్‌లోని అమెరికా రాయబారి మైక్ హకాబీ వెల్లడించారు. ఈ ప్రకటన వెలువడిన మరుసటి రోజే నెతన్యాహు పర్యటన వార్త బయటకు రావడం గమనార్హం.హకాబీ చేసిన వ్యాఖ్యలను నెతన్యాహు కార్యాలయం నేరుగా ధృవీకరించనప్పటికీ, ఈ పర్యటన ఇజ్రాయెల్, యూఏఈ మధ్య సంబంధాలలో ఒక "చారిత్రక పురోగతి" అని పేర్కొంది.ఫిబ్రవరి చివరలో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల నేపథ్యంలో, ఇరాన్ ఇతర అరబ్ దేశాల కంటే యూఏఈనే ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంది. గత నెలలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ, ఇరాన్ నుండి నిరంతరం క్షిపణి, డ్రోన్ దాడులు ఎదురవుతున్నట్లు యూఏఈ వెల్లడించింది.2020లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన జరిగిన 'అబ్రహం ఒప్పందాల' తర్వాత, ఇజ్రాయెల్‌తో అధికారిక దౌత్య సంబంధాలు కలిగి ఉన్న అరబ్ దేశాలలో చమురు సంపన్న దేశమైన యూఏఈ అత్యంత కీలకమైన మిత్రదేశంగా ఎదిగింది.ఈ రహస్య భేటీ మధ్య ప్రాచ్యంలో మారుతున్న రాజకీయ, రక్షణ సమీకరణాలకు నిదర్శనంగా నిలుస్తోంది. -
మంత్రి నారా లోకేష్ రహస్య పర్యటన.. అంతా సస్పెన్స్..?
సాక్షి, అమరావతి: ఏపీ మంత్రి నారా లోకేష్ రహస్య పర్యటనపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. నిన్న మధ్యాహ్నం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లిన లోకేష్.. అక్కడి నుంచి ఎక్కడి వెళ్లారో సస్పెన్స్ నెలకొంది. రెండు వారాల్లోనే రెండోసారి మంత్రి లోకేష్ విదేశాలకు వెళ్లారంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.కాగా, నారా లోకేశ్ బుధవారం రహస్యంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.. విమానాశ్రయం నుంచి నేరుగా జన్‌పథ్–1లోని సీఎం (చంద్రబాబు) నివాసానికి చేరుకున్న లోకేష్.. రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులతో రహస్యంగా భేటీ అయినట్లు తెలిసింది. అనంతరం రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ లోకేశ్‌ను కలిశారు. అర్ధరాత్రి వరకూ భేటీలు కొనసాగడం.. ఎవరెవరు కలుస్తున్నారు అనే విషయాలు గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిచ్చిది. ముఖ్యమంత్రి, మంత్రులు అధికారిక పర్యటన నిమిత్తం ఢిల్లీ వచ్చినప్పుడు రెసిడెంట్ కమిషనర్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి ఆహ్వానిస్తారు. ఇక్కడ ఉన్న పోలీసు సిబ్బంది వీఐపీ ఫెసిలిటేషన్ చేస్తారు. లోకేశ్ పర్యటనలో ఇవేమీ కనిపించలేదు. కాగా, లోకేశ్ కొందరు బీజేపీ ప్రముఖులతో వేర్వేరుగా భేటీ అయినట్లు తెలిసింది. -
చైనాలో కిమ్ రహస్య పర్యటన..!
బీజింగ్ : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చైనాలో పర్యటిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. సోమవారం కిమ్ రహస్యంగా చైనాలో పర్యటించడానేది ఆ వార్తల సారంశం. కిమ్ పర్యటనపై ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. కిమ్ ఎవరితో బేటీ కానున్నాడు, ఏయే అంశాలపై చర్చించనున్నాడనేది ఆసక్తిగా మారింది. దీనిపై అటూ చైనా నుంచి గానీ, ఉత్తర కొరియా నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ కిమ్ చైనా పర్యటన వాస్తవమైన పక్షంలో 2011లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన తొలి విదేశీ పర్యటన ఇదే అవుతుంది. చైనా, నార్త్ కొరియా బార్డర్లో బలగాలను మోహరించడం, బీజింగ్‌లోని ప్రముఖ హోటల్ వద్ధ భద్రత ఏర్పాట్లు చేపట్టడం ఈ వార్తలకు బలం చేకూర్చుతున్నాయి. చాలా కాలంగా అమెరికా, ఉత్తర కొరియాల మధ్య న్యూక్లియర్ క్షిపణుల అంశంలో వివాదం పరిష్కారం దిశగా సాగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మేలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, కిమ్ మధ్య భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలో కిమ్ చైనా పర్యటనపై వార్తలు పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. చాలా కాలం నుంచి ఉత్తర కొరియా, చైనాకు మిత్ర దేశంగా ఉంది. కిమ్ తండ్రి చనిపోక ముందు చాలా సార్లు రహస్యంగా చైనా పర్యటన చేపట్టారు. -
సింగపూర్ బృందం రహస్య పర్యటన!
-
సింగపూర్ బృందం రహస్య పర్యటన!
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో సింగపూర్ బృందం రహస్యంగా పర్యటిస్తోంది. ఈ బృందం నిన్న అమరావతితో పాటు తుళ్లూరులో పర్యటించింది. శనివారం సింగపూర్ సభ్యులు గుంటూరులో పర్యటిస్తున్నారు. ఆర్డీవో భాస్కరనాయుడు దగ్గరుండి సింగపూర్ బృందాన్ని గ్రామాల్లో తిప్పుతున్నారు. కాగా ఏపీ రాజధాని పరిధిలోని భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్రామాల ప్రజలు.... సింగపూర్ బృందాన్ని అడ్డుకుంటారని వారిని ఏపీ సర్కార్ రహస్యంగా తిప్పుతోంది.


