-
వరస్ట్ లైఫ్.. బొమ్మలా బతుకుతున్నాను
* మంచి మిత్రుడిగా భావించిన వాడే ప్రపోజ్ చేశాడు * ప్రతి వ్యక్తి ఆడపిల్లను అదే భావనతో చూస్తున్నారు * అందరిపై నాకు అసహ్యం కలుగుతోంది * ‘సాక్షి’ చేతికి రిషితేశ్వరి రెండో డైరీలోని మరికొన్ని పేజీలు సాక్షి, గుంటూరు: ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి కళాశాలలో చేరినప్పటి నుంచీ ఎదుర్కొన్న బాధలు, పడ్డ కష్టం మొత్తం డైరీల్లో రాసుకుంది. తాజాగా బయటపడిన రిషితేశ్వరి రెండో డైరీలోని కొన్ని పేజీలు ‘సాక్షి’ చేతికి చిక్కాయి. అందులోని కొన్ని ముఖ్యమైన విషయాలు ఇలా ఉన్నాయి... ♦ ఇంటర్లో 88% మార్కులు తెచ్చుకున్నా. ఆర్కిటెక్చర్ కోర్సు తీసుకుని కెరీర్‌ను తీర్చిదిద్దుకోవాలని ఆశిస్తున్నా.. నిరుపేదలకు తక్కువ ఖర్చుతో ఇల్లు నిర్మించుకొనేలా చేయాలనేది నా లక్ష్యం. ఆర్కిటెక్చర్లో సీటు సాధించడానికి నాటా(నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఆర్కిటెక్చర్) ఎంట్రన్స్ రాసేందుకు విజయవాడ, మొగల్రాజపురంలోని ఓ కోచింగ్ సెంటర్లోచేరి నెలరోజులపాటు కష్టపడి చదివా. 112 ర్యాంక్ రావడంతో జేఎన్ఎఫ్ఏయూలో సీటు వస్తుందని ఆశించా. ఒక్క ర్యాంకు తేడాతో జేఎన్ఎఫ్ఏయూలో సీటు కోల్పోయి ఏఎన్‌యూలో సీటు సాధించా. ఎంతో నమ్మకం... కోరిక... ఆశలు... ఆశయాలతో మొదటిరోజు కళాశాలలో అడుగుపెట్టాను. ♦ కొత్త కాలేజీ కావడంతో ర్యాగింగ్ ఉంటుందని టెన్షన్‌తో ఉన్న నాకు ఇక్కడ ర్యాగింగ్ ఉండదంటూ వార్డెన్ ధైర్యం చెప్పింది. కానీ మొదటిరోజు రాత్రి సీనియర్స్ నన్ను పిలిచి సీనియర్స్‌తో ఎలా వ్యవహరించాలో షరతులు విధించారు. మా రూమ్‌లో 8 మంది ఉన్నాం. వారిలో పావని, హనీష, ఉన్నతి, మౌనికలు సీనియర్లు. ముగ్గురు నా క్లాస్మేట్స్. ♦ హనీష నాతో మొదట్లో బాగుండేది. తరువాత నాలుగో సంవత్సరం విద్యార్థి శ్రీనివాస్‌తో మాట్లాడాలని చెప్పింది. నేను మాట్లాడలేదు. ఓ రోజు శ్రీనివాస్‌తో ఫోన్‌చేసి మాట్లాడాలంటూ నన్ను ర్యాగింగ్ చేసింది. చేసేదిలేక నేను అతనితో మాట్లాడాను. లైబ్రరీలో కలవాని చెప్పాడు. శ్రీనివాస్ లైబ్రరీలో నాపక్కనే కూర్చుని ఫోన్ లాక్కొని నా ఫొటోలు చూశాడు. నువ్వు చిన్న హీరోయిన్లా ఉన్నావంటూ కామెంట్ చేశాడు. చాటింగ్ చేయడం ప్రారంభించాడు. కానీ నాకు అలా చేయడం ఇష్టం ఉండేది కాదు. ♦ నా ఫోన్లో శ్రీనివాస్ కాంటాక్ట్ నేమ్ మార్చమని హనీష చెప్పింది. నేను అన్నయ్య అని అతని నంబర్ సేవ్ చేశాను. కొద్దిసేపటికి శ్రీనివాస్ ఫోన్‌చేసి నా నంబర్ ఏమని సేవ్ చేశావని అడిగాడు. అన్నయ్య అని చెప్పాను. అలా ఎందుకు చేశావు, నన్ను శ్రీ అని పిలవమని అనడంతో షాక్‌కు గురయ్యాను. ♦ దసరా సెలవుల్లో నా ఫ్రెండ్ ఆదిత్య నన్ను ప్రేమించమంటూ ప్రపోజ్ చేశాడు. నో చెప్పాను. చాలా కోపం వచ్చింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. మరో సీనియర్ చరణ్ నావెంటపడటం మొదలు పెట్టాడు. నేను మంచి మిత్రుడుగా భావించిన మనిషి కూడా నన్ను ప్రేమించమంటూ ప్రపోజ్ చేశాడు. నేను అతన్ని మంచి ఫ్రెండ్‌గా చూశాను. కానీ ఆ వెధవ నన్ను మరో దృష్టితో చూశాడు. ♦ శ్రీనివాస్ నా క్లాస్ అబ్బాయిలతో నా గురించి ఎంక్వయిరీ చేస్తున్నాడు. ప్రతి వ్యక్తి ఆడపిల్లను అదేభావనతో చూస్తున్నారు. దీంతో అందరిపై నాకు అసహ్యం కలుగుతోంది. ఆర్కిటెక్చర్ విద్యార్థులు ఎక్కువమంది వెధవలు ఉన్నారు. ఛీ... వరస్ట్ లైఫ్... నేను బొమ్మలా బతుకుతున్నాను. ♦ హాయ్‌ల్యాండ్‌లో శ్రీనివాస్, చరణ్‌లు నాపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. మద్యం సేవించి నన్ను దగ్గరకు లాక్కుని వేధించారు. ఆ స్థితిలో చనిపోవాలనిపించింది. మిస్పర్ఫెక్ట్ అవార్డును శ్రీనివాస్ చేతులు మీదుగా ఇప్పించారు. చాలా అసహ్యంగా అనిపించింది. ఈ విషయాలన్నీ ఎవరితోనూ చెప్పుకోలేక పోయా.. చివరకు మానాన్నతో కూడా. -
రిషితేశ్వరి రెండో డైరీలో ఏం రాసిందంటే..!
గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్‌కు గురై ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి కేసు మరో మలుపు తిరిగింది. రిషితేశ్వరి రాసుకున్న రెండో డైరీ 'సాక్షి టీవీ' చేతికి చిక్కింది. ఆ డైరీలో ఆమె అనుభవించిన చిత్రవధ మొత్తాన్ని వివరించింది. యూనివర్సిటీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, చేదు అనుభవాలను ఆమె తన డైరీలో ఇలా రాసుకుంది.... * ఫ్రెషర్స్ డే పార్టీ రోజు నాకు మిస్ ఫర్ఫెక్ట్ అవార్డు ఇచ్చారు. * మిస్ ఫర్ఫెక్ట్ అవార్డును శ్రీనివాస్ చేతుల మీదుగా అందించారు. * ఆ సమయంలో షేక్ హ్యాండ్ ఇస్తూనే అతను నా నడుం మీద చేయి వేశాడు. * స్టేజి దిగి క్రిందకు వస్తుంటే జయచరణ్ నాతో అసభ్యంగా వ్యవహరించాడు. * ఆ సమయంలో జయచరణ్ ఫుల్‌గా మందు తాగి ఉన్నాడు. * శ్రీనివాస్‌తో ఫోన్ చేయమని, జయచరణ్తో మాట్లాడమని హనీషా పదేపదే కోరేది. * కాదన్నందుకు హనీషా నన్ను ర్యాగింగ్ చేసింది. * తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీనివాస్‌ను కలిశాను. నన్ను చూసి హీరోయిన్లా ఉన్నావన్నాడు. * తర్వాత రోజు నుంచి శ్రీనివాస్ నాతో ఫోన్లో చాటింగ్ చేస్తున్నాడు. * అతని మెసేజీలన్నీ నన్ను ఇష్టపడుతున్నట్లుగానే ఉంటున్నాయి. నాకు చిరాకేస్తోంది. * అతనితో చాటింగ్ చేయాలని కానీ, మాట్లాడాలని కానీ లేదు. * తర్వాత కాలేజీలో అభిషేక్, ఆదిత్య పరిచయమయ్యారు. వారు మంచి ఫ్రెండ్స్ అని బ్రదర్స్ అని ఫీలయ్యాను. * అయితే దసరా సెలవుల సమయంలో ఆదిత్య నాకు ప్రపోజల్ చేశాడు. నేను నో అని చెప్పా. * శ్రీనివవాస్ను ఒకసారి సార్ అని పిలిస్తే.. సర్ కాదు.. శ్రీ అని పిలవమన్నాడు. * శ్రీనివాస్ ఫోన్ చేస్తే ఓసారి నా ఫ్రెండ్‌తో నేను లేనని చెప్పించా. * తర్వాత క్లాస్ రూమ్‌కు వచ్చి నీ ఫోన్ ఎక్కడుందని అడిగాడు. * నా ఫ్రెండ్‌కి ఇచ్చానని చెప్తే.. అయితే తీసుకుని నాకివ్వు. వారం తర్వాత ఇస్తానన్నాడు. * శ్రీనివాస్ వేషాలను తట్టుకోలేక అతనితో గట్టిగా వాదించాను. తర్వాత అతను కొద్దిరోజులు దూరంగా ఉన్నాడు. * అదే సమయంలో జయచరణ్ ఎంటరయ్యాడు. నావెంట పడుతున్నాడు. * నేను మంచి ఫ్రెండ్ అనుకున్న అభిషేక్ కూడా నాకు ప్రపోజల్ చేశాడు. అతనొక స్టుపిట్. * శ్రీనివాస్‌కు దూరంగా ఉంటున్నానని, అతను నా గురించి నా క్లాస్‌మెట్స్ దగ్గర ఎంక్వయిరీ చేస్తున్నాడు. * ఎన్నో ఆశలు, ఆశయాలతో నాగార్జున యూనివర్సిటీలో అడుగు పెట్టా. కానీ ఇది ఇక్కడి ఆర్కిటెక్చర్ కాలేజీ వరెస్ట్ కాలేజీ. * ఇక్కడి స్టూడెంట్స్‌లో చాలామంది వరెస్ట్ గాళ్లే. చాలామంది అబ్బాయిలు నాకోసం ట్రై చేస్తున్నారు. * నా జీవితం మీద విరక్తి కలుగుతోంది. నేను అనుకున్నదొకటి.. జరుగుతోందొకటి. * అన్నీ నాన్నతో చెప్పుకునే నేను.. ఈ విషయాలు చెప్పుకోలేకపోతున్నా. * ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావటం లేదు. * ఫ్రెషర్స్ డే పార్టీ రోజు చరణ్ ఫుల్లుగా తాగి డిన్నర్ సమయంలో తన పక్కన కూర్చోమన్నాడు. * ఎలా పడితే అలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోయా. అక్కడున్నుంచి ఎలా తప్పించుకోవాలా? అని ఆలోచించా. * నా ఫోన్ లాక్కుని నా నెంబర్లు, ఫోటోలు, వివరాలన్నీ చూశాడు. నాకైతే చచ్చిపోవాలనిపించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
గర్భిణులూ జెర జాగ్రత్త..
న్యూస్‌రీల్
వడగండ్ల వాన
‘బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి’
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్‌లో చేరికలు ప్రభావం చూపేనా..?
ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం
ఎన్నికల వేళ డేగకళ్ల నిఘా
నాంచారమ్మ జాతర విజయవంతం చేయండి
క్లుప్తంగా
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement