breaking news
scattering
-
భారీ ట్రాఫిక్, 20 టన్నుల టమోటా నాశనం
సాక్షి, ముంబై:మహారాష్ట్రలో అనుకోని రోడ్డు ప్రమాదం, భారీ ట్రాఫిక్ రైతుల పాలిట శాపంగా పరిణమించింది. భారీ టమోటా లోడ్‌తో వస్తున్నట్రక్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 టన్నుల టమోటా రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయింది. ఫలితంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో అధికారులు బుల్డోజర్ల సాయంతో టమోటాలను తొలగించి మరీ ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటన రైతులను నష్టాల్లోకి నెట్టేసింది. ట్రక్ బోల్తా పడిన ఈ ఘటనలో ఒకరు గాయపడగా, ఆసు పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈస్టర్న్ఎక్స్ప్రెస్ హైవేపై థానేలోని కోపారి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో టమోటా రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. కష్టపడి పండించిన పంట కళ్లముందే నాశనం కావడంతో రైతుల ఆవేదన వర్ణనాతీతం. ఒకవైపు గిట్టుబాటు ధర లేక రైతు అల్లాడిపోతున్నాడు. మరోవైపు పంటను మార్కెట్ చేసుకునే అవకాశాలూ అంతంత మాత్రమే. దీంతో అమ్ముకునే దారిలేక నడిరోడ్డుపై టమాటా, క్యాలిఫవర్ లాంటి పంటలను స్వయంగా రైతులే ధ్వంసం చేసిన ఘటనలు గతంలో అనేక చూశాం. One person was injured after a truck overturned near Kopari, Thane on Eastern Express Highway at around 2 am, today. The injured has been shifted to the nearest hospital: Thane Municipal Corporation pic.twitter.com/j9jrQY8WXX — ANI (@ANI) July 16, 2021 #WATCH | Thane, Maharashtra: Around 20 tonnes of tomatoes, scattered on Eastern Express Highway, being removed amid a huge traffic jam on both lanes of the Highway One person was injured after a tomato-laden truck overturned near Kopari, Thane on the Highway at around 2 am today pic.twitter.com/GPOmfgd1nO — ANI (@ANI) July 16, 2021 -
ఆహా... పిడుగా!
స్కేటింగ్‌లో చిన్నారి గిన్నీస్ రికార్డు సాక్షి ప్రతినిధి, బెంగళూరు: ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా 39 టొయోటా క్వాలిస్ కార్ల కింద కేవలం 28 సెకన్లలో స్కేటింగ్ ద్వారా రయ్‌మని దూసుకొచ్చేశాడు చిచ్చర పిడుగు గగన్. స్థానిక బసవేశ్వర నగరలోని ఫ్లోరెన్స్ స్కూలులో కిండర్ గార్టెన్ విద్యార్థి అయిన ఐదేళ్ల గగన్‌కు స్కేటింగ్ అంటే ఎంతో ఇష్టం. ఏడాదిన్నర కిందట స్కేటింగ్ క్లాసులో చేరాడు. అతని తండ్రి సతీశ్ వాషింగ్ మెషిన్ సర్వీసు సెంటర్లో పని చేస్తున్నాడు. స్కేటింగ్‌పై కుమారునికున్న శ్రద్ధాసక్తులను గమనించి, ఇందులో అతను ఏదో ఒకటి సాధించాలనే లక్ష్యంతో ప్రోత్సహించాడు. గిన్నీస్ రికార్డు కోసం 39 టొయోటా కార్లను వరుసగా 69.2 మీటర్ల దూరం మేరకు నిలిపి ఉంచారు. భూమికి, కార్ల ఛాసిస్‌లకు మధ్య దూరం కేవలం 8 అంగుళాలే. గతంలో రాష్ట్రంలోని బెల్గాంకు చెం దిన తొమ్మిదేళ్ల రోహన్ 47 సెకన్లలో 24 కార్ల కింద స్కేటింగ్ చేశాడు. ఆ రికార్డును గగన్ బద్దలు కొట్టాడు.