breaking news
sares
-
బతుకమ్మ చీరలు.. పండగైపోయినంక ఇస్తరా?
మహబూబాబాద్ అర్బన్ : తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ(Bathukamma Gift). ఆడబిడ్డలకు ఇష్టమైన ఈ వేడుకలకు కానుకగా గత ప్రభుత్వం చీరలు(sarees) అందించేది. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రస్తుతం ప్రభుత్వం మహిళా సంఘాల్లోని సభ్యులకు చీరలను అందించేందుకు నిర్ణయించింది. అయితే ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు ప్రారంభమైనా.. నేటికీ జిల్లాకు బతుకమ్మ చీరలు(Bathukamma sarees) చేరకపోవడం గమనార్హం. అయితే ఇతర జిల్లాలకు చీరలు చేరినట్లుగా తెలిసింది. కాగా, మహిళా సంఘాల సభ్యుల వివరాలు ప్రభుత్వానికి ఇవ్వకపోవడంతోనే ఆలస్యం అవుతుందని సంబంధిత జిల్లా అధికారులు చెబుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏటా బతుకమ్మ పండుగకు చీరల పంపిణీతో లక్షలాది మంది మహిళలకు లబ్ధి చేకూరింది. ఈ చీరలు పండుగ సందర్భంగా ఆనందాన్నివ్వడంతోపాటు, ఆర్థిక భారాన్ని తగ్గించే విధంగా ఉండేవని మహిళలు అభిప్రాయపడుతున్నారు. ఈసారి బతుకమ్మ పండుగ కూడా వచ్చేసింది.. మరి చీరలు ఎప్పుడు వస్తాయని మహిళలు ఎదురుచూస్తున్నారు.మహిళా సంఘాల సభ్యులకే..గతంలో రేషన్‌కార్డు(Ration card) కలిగి ఉండి 18 సంవత్సరాలు నిండిన యువతులు, మహిళలకు ప్రభుత్వం చీరలు అందించేది. ప్రస్తుతం మహిళా సంఘాల్లోని సభ్యులకు మాత్రమే చీరలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో మహిళా పొదుపు సంఘాల్లో 1,95,540 మంది సభ్యులుగా ఉన్నారు. వీరికి మాత్రమే ఈఏడాది ప్రభుత్వ కానుక అందనుంది. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీ కేంద్రాలు, 482 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇందులో మెప్మా సిబ్బంది, గ్రామస్థాయిలో ఐకేపీ సిబ్బంది, గ్రామపంచాయతీ కార్యదర్శులు, సీసీలు తదితరులతో చీరలు పంపిణీ చేయనున్నారు. డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులై ఉండి వారి వివరాలు ఆన్లైన్లో నమోదైతేనే చీరను అందించనున్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతులు, మహిళలకు ఈసారి చీరలు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం ఒక చీరపై రూ.800 ఖర్చు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. తొర్రూరు పట్టణ కేంద్రానికి మాత్రం 15వేలు చీరలు వచ్చినట్లు తెలిసింది.రెండు బతుకమ్మ చీరలిస్తాం.. తూచ్, ఒక్కటే ఇస్తాం! -
తాడేపల్లిలో చీరలు కొంటున్నారా..?
– జాగ్రత్త సుమా! తాడేపల్లి రూరల్: మీరు తాడేపల్లిలో చీరలు కొంటున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే నాణ్యత లేని చీరలను తీసుకువచ్చి, షోరూమ్ చీరలు అంటూ నమ్మబలికి అమ్మేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. తాడేపల్లి, బిట్రగుంట, కప్పరాలతిప్ప, చీరాలకు చెందిన బట్టల దొంగలు గతంలో జోరుగా దుస్తులను అపహరించుకు వెళ్లేవారు. వారి ఆటలు సాగకపోవడంతో తర్వాత ఆ పని మానుకున్నారు. చేతిలో డబ్బులు ఆడకపోవడంతో దొంగలు తమ రూటు మార్చారు. బళ్లారి, కాంచీపురం తదితర ప్రాంతాల నుంచి.. చీకిపోయిన, లోపాలు, చిన్న చిన్న చిరుగులు ఉన్న చీరలు తీసుకువచ్చి మధ్యవర్తుల ద్వారా అమ్మకాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి చీరలు సీతానగరంలోని పలు ప్రాంతాల్లో, కొత్తూరు రైల్వే బ్రిడ్జి వద్ద, పశువులు ఆసుపత్రి సమీపంలో ఓ ఉద్యోగి విచ్చలవిడిగా అమ్ముతున్నట్లు సమాచారం. ఇటీవల కృష్ణా జిల్లా నందిగామకు చెందిన ఓ కుటుంబం రూ.లక్ష విలువైన దుస్తులు కొని మోసపోయినట్లు తెలుస్తోంది. తస్కరించి తీసుకొచ్చి.. తాడేపల్లి, చీరాల, కప్పరాలతిప్ప, బిట్రగుంట తదితర ప్రాంతాలకు చెందిన మహిళా దొంగలు చీరలు, జీన్స్ ప్యాంట్లు, వివిధ కంపెనీల టీ షర్టులు, షర్టులు తీసుకొచ్చి అమ్మేందుకు ఇక్కడి మధ్యవర్తులకు అప్పగించేవారు. అవి మంచి దుస్తులు, నాణ్యత కలవి కావడంతో బాగా గిరాకీ ఉండేది. తక్కువ ధరతో మంచి దుస్తులు దొరుకుతుండటంతో కొనుగోలుదారులూ ఆసక్తి చూపేవారు. ప్రస్తుతం షాపింగ్ మాళ్లు, దుకాణాల్లో నిఘా వ్యవస్థ బలంగా ఉండటం, పోలీసులు ఎప్పటికప్పుడు దొంగల ఆటలు కట్టించి సొమ్ము రికవరీ చేస్తుండటంతో వారి ఆగడాలకు అడ్డుకట్టపడినట్లయ్యింది.


