breaking news
Sanjay Kapur
-
సంజయ్ మరణానికి కారణం ఓ తేనెటీగ : వైద్యులు ఎంత శ్రమించినా.!
అహ్మదాబాద్‌లో జరిగిన విషాదకరమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎన్నో కంపెనీల్లో అంతులేని శోకాన్ని నింపింది. ఒక్కో కుటుంబానికి ఒక్కో విషాద గాథ. ఎన్నో ఆశలతో విమానం ఎక్కిన వందలమంది క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం ఇలా ఉండగానే బిజినెస్ ప్రపంచంలో మరో విషాదం చోటు చేసుకుంది. సోనా కామ్‌స్టార్‌కు చెందిన ఉంజయ్ కపూర్ అకస్మాత్తుగా కన్నుమూశారు. విమాన ప్రమాదంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసిన కొన్ని గంటల తరువాత గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. అయితే ఆయన మరణం ఎలా జరిగిందో తెలిస్తే షాకవ్వక మానరు. మరణం ఎటువైపు ఎలా ముంచుకు వస్తుందో తెలియదు అనడానికి ఈ సంజయ్ మరణం నిదర్శనంగా నిలుస్తోంది. పోలో క్రీడలో ప్రసిద్ధుడు, వ్యాపారవేత్త బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్, 53 ఏళ్ల వయసులో గుండెపోటుతో యునైటెడ్ కింగ్డమ్లో మరణించారు. పోలో ఆడుతున్నప్పుడు, ఒక తేనెటీగ సంజయ్ నోటిలోకి దూరిపోయింది. పొరపాటున దాన్ని మింగడంతో అది గుండెపోటుకు దారితీసిందని చెబుతున్నారు. తక్షణమే వైద్య సహాయం అందించినప్పటికీ ఫలితం లేకపోయిందని. నిపుణులు కూడా పరిస్థితిని పరిష్కరించలేకపోయారట.భారతదేశ ఆటోమోటివ్ రంగంలో ప్రముఖ వ్యాపారవేత్త, కపూర్ ఆటోమోటివ్ మార్గదర్శకుడు సురీందర్ కపూర్ కుమారుడు సోనా కామ్స్టార్ చైర్మన్ సంజయ్ కపూర్ ఆకస్మిక మరణం బిజినెస్ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎయిరిండియా ప్రమాదంపై తన విచారాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, అంతలోనే ఆయన కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.ప్రమాదంపై ఆయన ట్వీట్ అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై కపూర్ సోషల్ మీడియా ద్వారా విచారం వ్యక్తం చేశారు. "అహ్మదాబాద్‌లో జరిగిన విషాదకరమైన ఎయిర్ ఇండియా ప్రమాదం భయంకరమైన వార్త. బాధిత కుటుంబాలందరికీ నా సానుభతి. ఈ క్లిష్ట సమయంలో ధైర్యాన్ని, శక్తిని పొందాలని కోరుకుంటున్నాను"ఎవరీ సంజయ్ కపూర్గురుగ్రామ్లో ఉన్న ప్రముఖ ప్రపంచ ఆటో విడిభాగాల తయారీదారు సోనా కామ్స్టార్ అధినేత సంజయ్ కపూర్. ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ACMA) అధ్యక్షుడిగా కూడా పనిచేశారు . అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) తయారీ మండలికి సహ-అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తాను చదువుకున్న డెహ్రాడూన్‌లోని ది డూన్ స్కూల్ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. బకింగ్‌హామ్ విశ్వవిద్యాలయం నుండి HRలో BBA పూర్తి చేసిన తరువాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఓనర్-ప్రెసిడెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌లో చేరారు. సంజయ్ 2003లో తన తండ్రి కంపెనీలో పగ్గాలు చేపపట్టి ప్రపంచ బ్రాండ్‌గా దాన్ని తీర్చిదిద్దారు. సోనా కామ్స్టార్ అనే కంపెనీకి సంజయ్ ఛైర్మన్‌గా ఉన్నారు. -
డ్రెస్ పట్టడం లేదని మాజీ భర్త నన్ను కొట్టబోయాడు: హీరోయిన్
తన సినిమాలతో కుర్రకారును ఓ ఊపు ఊపిన హీరోయిన్ కరిష్మా కపూర్. పలువురు బడా హీరోలతోనూ జతకట్టి బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకుందావిడ. ఆన్‌స్క్రీన్‌లో తన నటనతో కట్టిపడేసే ఆమె జీవితంలో ఎన్నో కష్టాలున్నాయి. 2003లో వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ను పెళ్లి చేసుకున్న ఆమె వైవాహిక జీవితం ఎంతోకాలం సవ్యంగా సాగలేదు. ఇద్దరి మధ్య గొడవలు రావడంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరి మీద ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. కరిష్మా తన భర్త, అత్తలపై వరకట్న వేధింపుల కేసు కూడా పెట్టింది. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. 'సంజయ్ తల్లి నాకు ఒక డ్రెస్ బహుమతిగా ఇచ్చింది. కొడుకు కియాన్ పుట్టిన తర్వాత దాన్ని నన్నోసారి వేసుకోమన్నారు. తల్లినయ్యాక నా శరీరం కొద్దిగా లావైంది. ఆ డ్రెస్ నాకు పట్టలేదు. అది చూసిన సంజయ్ కోపంతో నన్ను లాగి కొట్టమని అతడి తల్లికి చెప్పాడు. అతడి ప్రవర్తనను తప్పు పట్టాల్సింది పోయి ఆమె కూడా కొడుక్కే సపోర్ట్ చేసేది' అని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది కరిష్మా. ఇలా ఎన్నో వివాదాల నడుమ కరిష్మా, సంజయ్‌లకు 2016లో విడాకులు మంజూరయ్యాయి. పిల్లలు సమైరా, కియాన్ రాజ్ కపూర్ బాధ్యతలను తల్లికే అప్పజెపుతూ తీర్పు వెలువరించింది న్యాయస్థానం. చదవండి: సుశాంత్‌ది ముమ్మాటికీ హత్యే: పోస్ట్‌మార్టమ్ సిబ్బంది వర్షం డైరెక్టర్ మా బాబాయి, ఆయన పోయిన నెలకే నాన్న చనిపోయారు: కమెడియన్ కూతురు -
15 రకాల వస్తు దిగుమతులను నివారించొచ్చు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి పిలుపునిచ్చిన ఆత్మ నిర్భర్ (స్వీయ సమృద్ధి) సాధన కోసం భారీగా దిగుమతి చేసుకుంటున్న 15 వస్తువులను అసోచామ్ గుర్తించింది. దేశీయంగా ఉత్పత్తిని పెంచడం ద్వారా వీటి విషయంలో స్వావలంబన సాధించొచ్చని పేర్కొంది. వీటిల్లో ఎలక్ట్రానిక్స్, బొగ్గు, ఐరన్–స్టీల్, నాన్ ఫెర్రస్ మెటల్స్, వంటనూనెలు, తదితర ఉత్పత్తులున్నాయి. ప్రతి నెలా 5 బిలియన్ డాలర్ల విలువైన (37,500 కోట్లు) ఈ వస్తువులను దిగుమతి చేసుకుంటున్నామని.. విదేశీ మారక నిల్వలకు భారీగా చిల్లు పెడుతున్న ఈ దిగుమతులకు వెంటనే కళ్లెం వేయాలని అసోచామ్ సూచించింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్న మే నెలలో 2.8 బిలియన్ డాలర్ల విలువైన (రూ.21,000 కోట్లు) ఎలక్ట్రానిక్ వస్తు దిగుమతులు నమోదయ్యాయి. హెచ్ఎంఏ ప్రెసిడెంట్‌గా సంజయ్ కపూర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (హెచ్ఎంఏ) నూతన ప్రెసిడెంట్‌గా సంజయ్ కపూర్ ఎన్నికయ్యారు. 2020–21 కాలానికి ఆయన ఈ పదవిలో ఉంటారు. పలు మల్టీనేషనల్ కంపెనీలకు ఆయన కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు. -
విడాకుల కేసులో హీరోయిన్ ఒప్పందం
న్యూఢిల్లీ: బాలీవుడ్లో ఒకప్పటి టాప్ హీరోయిన్ కరిష్మా కపూర్, ఆమె భర్త సంజయ్ కపూర్ల విడాకుల వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కివచ్చింది. భరణం చెల్లింపు విషయంలో వీరిద్దరూ సుప్రీం కోర్టులో ఓ ఒప్పందానికి వచ్చారు. ఈ కేసును శుక్రవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ముంబైలో ఉన్న తన తండ్రి ఇంటిని కరిష్మా కపూర్ పేరు మీద బదలాయించేందుకు సంజయ్ అంగీకరించాడు. ఇక సంజయ్ కపూర్ పిల్లల కోసం 14 కోట్ల రూపాయల బాండ్లను కొనుగోలు చేశాడు. వీటి ద్వారా ప్రతి నెల వచ్చే 10 లక్షల రూపాయల వడ్డీని పిల్లల ఖర్చులకు వెచ్చించనున్నారు. కరిష్మ, సంజయ్‌ల మధ్య మనస్పర్థలు రావడంతో గత అయిదేళ్లుగా విడిగా ఉంటున్నారు. కరిష్మా వద్ద ఉన్న పిల్లల్ని తన కస్టడీకి అప్పగించాలని కోరుతూ సంజయ్ కపూర్ గత ఏడాది ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా, తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ కరిష్మా ఇటీవల తన భర్త, అత్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు వరకు వెళ్లింది. భర్త, అత్తపై పెట్టిన కేసును ఉపసంహరించుకుంటున్నట్టు కరిష్మా కోర్టుకు తెలియజేసింది. ఇక పిల్లలను కరిష్మా వద్ద ఉంచేందుకు సంజయ్ అంగీకరించాడు. పిల్లలను చూసేందుకు వెళ్లేందుకు సంజయ్‌కు అనుమతించారు.