breaking news
Sanitation issue
-
పారిశుధ్య సమస్యలపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్!
సాక్షి, అమరావతి: గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలకు సంబంధించి ఫిర్యాదుల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. బోర్లు, బావుల వద్ద అపరిశుభ్ర వాతావరణం, ఇళ్ల మధ్య చెత్త కుప్పలు, మురుగు కాల్వలలో పారే నీరు రోడ్లపైకి చేరడం వంటి సమస్యలతో పాటు ‘క్లాప్’ మిత్రల ద్వారా ఇంటింటి నుంచి చెత్త సేకరణకు సంబంధించిన సమస్యలను టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. టోల్ ఫ్రీ ద్వారా అందే ఫిర్యాదుల పరిష్కారం కోసం అన్ని జిల్లాల్లోని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి కార్యాలయాల్లో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి ప్రత్యేక కమిటీ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేపడతారు. ఫిర్యాదు అందిన వెంటనే దానిస్థాయి ప్రకారం 24 గంటల వ్యవధిలో సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతారు. సమస్యల పరిష్కారం కోసం గ్రామ పంచాయతీ కార్యదర్శితో పాటు ఈవోపీఆర్డీలు, ఎంపీడీవోలు, డివిజనల్ పంచాయతీ అధికారులు, జిల్లా గ్రామ పంచాయతీ అధికారులకు వేర్వేరు స్థాయిల్లో పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినట్లు పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని పంచాయతీరాజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఏది గుడ్.. ఏది బ్యాడ్?.. అరవండి.. పరుగెత్తండి.. చెప్పండి -
గుట్టలు గుట్టలుగా చెత్త
కొనసాగుతున్న జీహెచ్ఎంసీ కార్మికుల సమ్మె తీవ్రమవుతున్న పారిశుధ్య సమస్య సిటీబ్యూరో ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడ ంతో జీహెచ్ఎంసీలో సమ్మె కొనసాగుతుందని వివిధ యూనియన్ల నేతలు స్పష్టం చేశారు. గత సోమవారం నుంచి జీహెచ్ఎంసీలోని కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో నగరంలో రోడ్లన్నీ చెత్తకుప్పలుగా మారాయి. రోజుకు దాదాపు 3800 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడుతుండగా, మూడు రోజులుగా ఎక్కడి చెత్త అక్కడే గుట్టలుగా పేరుకుపోయి పరిస్థితి మరింత తీవ్రమైంది. ముసురుతున్న దోమలు, ఈగలతో ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీలో గుర్తింపుయూనియన్ జీహెచ్ఎంఈయూ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. యూనియన్ అధ్యక్షుడు గోపాల్ తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. కార్మికుల కనీస వేతనం రూ. 16,500కు పెంచడంతో పాటు మిగతా డిమాండ్లనూ వెంటనే పరిష్కరించాలన్నారు. పరిస్థితి తీవ్రత గుర్తించిన జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ కార్మికసంఘాల నేతలతో చర్చలు జరిపారు. తన పరిధిలో ఉన్న కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కరించనున్నట్లు హామీ ఇచ్చారు. నాలుగో తరగతి ఉద్యోగులకు పదోన్నతుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్లు రామకృష్ణారావు, రవికిరణ్ పాల్గొన్నారు. విధుల్లో పాల్గొనండి.. రంజాన్, బోనాల పండుగలు, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంటనే విధుల్లో పాల్గొనాల్సిందిగా కమిషనర్ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సానుకూలంగా ఉన్నారన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కార్మికుల సమ్మె కొనసాగుతున్నందున వెంటనే ప్రత్యామ్నాయచర్యలు చేపట్టాల్సిందిగా సోమేశ్‌కుమార్ జోనల్, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. బుధవారం వారితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి స్వచ్ఛ యూనిట్ నోడల్ అధికారికి ప్రత్యేకంగా ఒక వాహనం, నలుగురు కార్మికులను ఏర్పాటుచేసి బుధవారం రాత్రి నుంచి రహదారులపై పేరుకుపోయిన చెత్తను తొలగించాలని సూచించారు.