breaking news
Sangamesvara Temple
-
కృష్ణమ్మ ఒడిలో సంగమేశ్వరుడు
-
ఎట్టకేలకు ఒక్కటయ్యారు
బషీరాబాద్(తాండూరు): బషీరాబాద్ మండలం మంతట్టి గ్రామానికి చెందిన బోయిని నర్సింహులు కొడుకు శ్రీశైలం (22), ఇదే గ్రామానికి చెందిన తలారి అంజిలప్ప కూతురు జయశ్రీ(చిట్టి) (21) చాలా కాలంగా ప్రేమించుకున్నారు. ఇద్దరివీ వ్యవసాయాధారిత కుటుంబాలే. గ్రామం నుంచి నిత్యం తాండూరు వెళ్లి చదువుకునే వారు. వీరి మధ్య ఉన్న స్నేహం, చనువు ప్రేమకు దారితీసింది. దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కులాలు ఒక్కటయినప్పటికీ ఇరు కుటుంబాల పెద్దలు, బంధువులు వీరి వివాహానికి అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురైన ప్రేమికులిద్దరూ వారం రోజుల క్రితం ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు మరింత రాజుకున్నాయి. ఇంటినుంచి పారిపోయిన జంట మంగళవారం ఫోన్లో గ్రామ పెద్దలను సంప్రదించింది. తాము కలిసి జీవించాలనుకుంటున్నామని ఇందుకు తమ తల్లిదండ్రులను ఒప్పించాలని కోరారు. లేదంటే ఇద్దరం కలిసి తనువు చాలిస్తామని హెచ్చరించారు. ఈ సమస్యకు మార్గం చూపాలనుకున్న గ్రామస్తులు, పెద్దలు ఇరు కుటుంబాలకు సర్ది చెప్పి పెళ్లికి ఒప్పించారు. చివరకు అబ్బాయి, అమ్మాయి తల్లిదండ్రులు అంగీకారం తెలిపారు. దీంతో ప్రేమజంట బుధవారం నవాంద్గి సంగమేశ్వరాలయం వద్ద ప్రత్యక్షమైంది. విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని స్వామివారి సన్నిధిలో పెళ్లి జరిపించారు. అప్పటివరకూ పగతో రగిలిపోయిన వారి మోములపై చిరునవ్వులు దరహాసం చేశాయి. అనంతరం కొత్తజంటను వరుడి ఇంటికి చేర్చారు. -
పుష్కర ఏర్పాట్లు ఇలానా! సిగ్గు.. సిగ్గు
కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని సప్తనదుల సంగమంలో కొలువైన సంగమేశ్వర ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్లో మహిళా భక్తుల ఇబ్బందులు వర్ణనాతీతం. ఆదివారం సుమారు 15 వేలకు పైగా భక్తులు ఇక్కడ పుష్కర స్నానాలు చేశారని అంచనా. అయితే, తగిన ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయింది. ప్రధానంగా పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం వస్త్రాలు మార్చుకునేందుకు మహిళలు పడ్డ ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. భర్తలు, బంధువులు.. చీరలు, పంచెలు అడ్డుగా పట్టుకుంటే తప్ప దుస్తులు మార్చుకునే పరిస్థితి లేకపోయింది. అధికారులు రోజుకు లక్ష మంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేదని ప్రకటించినా.. వేలల్లో వచ్చిన భక్తులకు కూడా సౌకర్యాలు కల్పించలేని పరిస్థితి నెలకొంది. - ఆత్మకూరు