breaking news
sangam mandal
-
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఘటన చోటుచేసుకుంది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారును ఇసుక టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృత్యువాతపడ్డారు. మృతుల్లో చిన్నారి సైతం ఉన్నట్టు తెలిసింది. అయితే, ఇసుక టిప్పర్ లారీ.. రాంగ్ రూట్ వచ్చిన కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. కారును టిప్పర్ ఢీకొట్టిన తర్వాత.. వాహనాన్ని కొంత దూరం ఈడ్చుకెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించడం అత్యంత విషాదకరమని అన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
సంగం మండలం వెంగారెడ్డిపాలెంలో విక్రమ్‌రెడ్డి ప్రచారం
-
బావిలో పడి మతిస్థిమితం లేని యువకుడి మృతి
పల్లారుగూడ(సంగెం) : మతిస్థిమితం లేని ఓ యువకుడు ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతి చెందిన సంఘటన సం గెం మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని పల్లారుగూడ శివారు వీఆర్ఎన్ తండాకు చెందిన గుగులోత్ చిన్ని, భద్రు దంపతు లకు కుమారులు సారయ్య(25), చిరంజీవి, కూతురు సునిత ఉన్నారు. పెద్దవాడైన సారయ్యకు మతిస్థిమితం సరిగా లేదు. పలుమార్లు ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇంట్లోంచి బయటకు వెళ్లి తనంతట తానుగా తిరిగి వచ్చేవాడు. ఇదే మాదిరి గా 15న మధ్యాహ్నం ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లాడు కానీ తిరిగి రాలేదు. ఆదివారం ఉదయం తమ్ముడు చిరంజీవి వ్యవసాయ పనుల నిమిత్తం చేను వద్దకు వెళ్లాడు. సమీపం లో ఉన్న తాగునీటి బావిలో నీళ్లు చేదడానికి బకెట్ వేసి చూడ గా అన్న సారయ్య శవం కనిపించింది. వెంటనే ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. మృతుడి తండ్రి భద్రు ఫిర్యాదు మేరకు శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించి కేసు దర్యా ప్తు చేస్తున్నట్లు పీఎస్సై ఎం.రాజు తెలిపారు. కాగా, మృతుడి కుటుంబాన్ని ఎంపీపీ బొమ్మల కట్టయ్య పరామర్శించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా బావిలోని నీటిని పూర్తిగా తీసివేసి బ్లీచింగ్ పౌడర్ చల్లి శుభ్రపరిచిన తర్వాతనే నీటి సరఫరా చేస్తామని సర్పంచ్ అరుణ తెలిపారు.