breaking news
Sagar highway
-
సాగర్ హైవేపై ప్రయివేట్ బస్సు బోల్తా
► పది మంది పాస్టర్లకు స్వల్ప గాయాలు ► నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం యాచారం: సాగర్ హైవేపై ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో పది మంది ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా యాచారం సీఐ మదన్ మోహన్ రెడ్డి తెలిపిన వివరాలు...నగరంలోని ఆంధ్ర క్రిష్టియన్ జికల్ కాలేజీకి చెందిన 26 మంది పాస్టర్లు శనివా రం ఉదయం గాంధీనగర్ నుంచి ఓ ఓ ప్రైవేటు బస్సులో నాగార్జునసాగర్ విహారయాత్రకు వెళ్లారు. నగరానికి తిరిగి వస్తుండగా రాత్రి 8–45 గంటల సమయంలో యాచారం– గునుగల్ గేట్ల మధ్యన క్రీడా క్షేత్రం సమీపంలో బస్సు బొల్తా పడింది. ఈ సంఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది పాస్టర్లకు స్వల్పగాయాలయ్యాయి. వారిని వెంటనే నగరంలోని వివిధ ఆస్పత్రులకు పంపించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
సాగర్ హైవే రక్తసిక్తం
నల్లగొండ జిల్లా దేవ్లాతండాలో ఘోర ప్రమాదం ఆటోను ఢీకొట్టిన స్కార్పియో... ఇద్దరు దుర్మరణం 24 మందికి తీవ్రగాయాలు 9 మంది పరిస్థితి విషమం చింతపల్లి: ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్నాయి.. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.. వారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అక్కడే ఉన్న తండావాసులు ముందుకొచ్చారు.. అప్పటికప్పుడు ఆటోలో వారిని తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.. ఇంతలో ఓ స్కార్పియో వాహనం మృత్యువులా వచ్చింది.. ఆటో సహా అక్కడున్నవారిపైకి దూసుకెళ్లింది.. ఆటో డ్రైవర్‌తోపాటు బైక్ ప్రమాదంలో బయటపడిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరో 24 మంది గాయపడ్డారు. వారిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది. బుధవారం రాత్రి నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వింజమూరు పంచాయతీ దేవ్లాతండా వద్ద హైదరాబాద్-సాగర్ హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి యాక్సిడెంట్లో బయటపడి.. మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గుల మండలం పల్లెతండాకు చెందిన నేనావత్ మాన్యానాయక్ తన మోటార్ సైకిల్‌పై వింజమూరు నుంచి కుర్మేడ్ వెళ్తున్నాడు. ఇదే సమయంలో దేవరకొండకు చెందిన రాములు మరో మోటార్ సైకిల్‌పై దేవరకొండ వైపు వెళ్తున్నాడు. వింజమూరు దేవ్లాతండా వద్దకు రాగానే ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఇందులో వారిద్దరికీ గాయాలయ్యాయి. ప్రమాదాన్ని చూసిన తండావాసులు వారిని ఆటోలో ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో హైదరాబాద్ వైపు వేగంగా వెళ్తున్న మహేంద్రా స్కార్పియో వాహనం రోడ్డు పక్కనే ఉన్న తండావాసులపైకి దూసుకెళ్లింది. దీంతో మాన్యానాయక్ (35), దేవ్లాతండాకు చెందిన ఆటో డ్రైవర్ వాంకుణావత్ భీముడు (30) అక్కడికక్కడే మృతి చెందారు. అదే తండాకు చెందిన 24 మంది గాయపడ్డారు. వీరిని తొలుత దేవరకొండ ఆస్పత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. వారిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో మోటార్ సైకిళ్లతోపాటు ఆటో, ప్రమాదానికి కారణమైన మహేంద్ర స్కార్పియో వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. స్కార్పియో డ్రైవర్ పరారయ్యాడు.