breaking news
RSS support
-
ఢిల్లీ వర్సిటీ ఏబీవీపీదే!
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూని యన్ (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ మద్దతు గల ఏబీవీపీ అభ్యర్థి ఆర్యన్ మాన్ అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. ఏడేళ్ల విరామం తర్వాత గత ఏడాది ఈ స్థానాన్ని గెలుచుకున్న ఎన్ఎస్యూఐ నుంచి అధ్యక్ష పదవిని ఏబీవీపీ చేజిక్కించుకోవడం విశేషం. ఏబీవీపీ అభ్యర్థి ఆర్యన్ మాన్, కాంగ్రెస్ అనుబంధ ఎన్ఎస్యూఐ అభ్యర్థి జోస్లిన్ నందిత చౌదరిపై 16,196 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆర్యన్ మాన్కు 28,841 ఓట్లు రాగా, ఎన్ఎస్యూఐ అభ్యర్థి జోస్లిన్‌కు 12,645 ఓట్లు వచ్చాయి. మొత్తం నాలుగు స్థానాలకు గాను.. ఏబీవీపీ అధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులను గెలుచుకుంది. అయితే ఉపాధ్యక్ష పదవిని కోల్పోయింది. ఏబీవీపీకి చెందిన కునాల్ చౌదరి, దీపికా ఝా.. కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులకు ఎన్నికయ్యారు, కాగా ఎన్ఎస్యూఐకి చెందిన రాహుల్ ఝాన్స్లా ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ), ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ)లు ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయాయి. ఈ ఎన్నికల్లో తమ సంస్థ బాగా పోరాడిందని ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరి ఎక్స్‌లో పోస్టు చేశారు. ఏబీవీపీకి వ్యతిరేకంగానే కాకుండా.. ఢిల్లీ పాలన యంత్రాంగం, ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాలు, ఆర్ఎస్ఎస్–బీజేపీ, ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా కూడా తాము పోరాడినట్లు స్పష్టం చేశారు. వేలాది మంది ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు తమకు గట్టి మద్దతుగా నిలిచారని, తమ అభ్యర్థులు బాగా పోరాడారని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ ప్యానెల్ నుంచి ఉపాధ్యక్షునిగా ఎన్నికైన రాహుల్ ఝాన్స్లా, గెలిచిన ఇతర ఆఫీస్ బేరర్లకు శుభాకాంక్షలు తెలిపారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ఎన్ఎస్యూఐ ఎల్లప్పుడూ సామాన్య విద్యార్థుల సమస్యల పరిష్కారానికి, ఢిల్లీ యూనివర్సిటీ పరిరక్షణకు పోరాడుతుందని స్పష్టం చేశారు. తాము మరింత బలపడతామని ధీమా వ్యక్తం చేశారు. 2024లో జరిగిన డీయూఎస్‌యూ ఎన్నికలలో, ఎన్ఎస్యూఐ ఏడేళ్ల విరామం తర్వాత అధ్యక్ష పదవిని, సంయుక్త కార్యదర్శి పదవిని గెలుచుకుంది. ఏబీవీపీ ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకొని, కార్యదర్శి స్థానాన్ని నిలుపుకొని విద్యార్థి సంఘ ఎన్నికల్లో తన ఉనికిని చాటుకుంది. గురువారం జరిగిన ఈ ఎన్నికల్లో దాదాపు 40 శాతం పోలింగ్ నమోదైంది. -
ఎమర్జెన్సీకి ఆరెస్సెస్ మద్దతు!
ఐబీ మాజీ చీఫ్ టీవీ రాజేశ్వర్ వెల్లడి న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ విధించిన ‘ఎమర్జెన్సీ’కి ఆరెస్సెస్ మద్దతు తెలిపిందా? ఆనాడు ఇందిరను, ఆమె కుమారుడు సంజయ్ గాంధీని ఆరెస్సెస్ అప్పటి చీఫ్ బాలాసాహెబ్ దేవరస్ కలవాలనుకున్నారా? ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆరెస్సెస్ మద్దతిచ్చిందా?.. ఈ ప్రశ్నలన్నింటికి కచ్చితంగా అవునని సమాధానమిస్తున్నారు కేంద్ర నిఘా విభాగం (ఐబీ) మాజీ చీఫ్ టీవీ రాజేశ్వర్. ఎమర్జెన్సీ సమయంలో ఆయన ఐబీలో డిప్యూటీ చీఫ్‌గా ఉన్నారు. రిటైర్ అయిన తరువాత యూపీ, సిక్కింల గవర్నర్‌గా పనిచేశారు. తాను రాసిన ‘ది క్రూషియల్ ఈయర్స్’ పుస్తకంలో పేర్కొన్న అంశాలపై ఇండియా టీవీకి ఇచ్చిన ఇంట ర్వ్యూలో ఆయన ఎమర్జెన్సీ నాటి విశేషాలను పంచుకున్నారు. ‘ఎమెర్జెన్సీ విధించిన ఆర్నెళ్ల తరువాత దాన్ని ఎత్తేయాలని ఐబీ సూచిం చింది. అందుకు ఇందిర అనుకూలంగానే ఉన్నప్పటికీ.. సంజయ్ మాత్రం ససేమిరా అన్నారు.. దేవరస్ ఇందిరతో భేటీ కావాలనుకున్నారు. కానీ ఇందిర ఒప్పుకోలేదు. ఎమెర్జెన్సీలో తీసుకున్న నిర్ణయాలకు మద్దతు తెలిపేందుకు ఆయన సంజయ్‌నీ కలుసుకోవాలనుకున్నారు’ అని రాజేశ్వర్ తెలిపారు.