breaking news
rs.6 lakhs
-
రొమాన్స్ స్కామ్: రూ.6 లక్షలు పోగొట్టుకున్న మహిళ
ఆన్లైన్ మోసాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్త వహించాలని అధికారులు ఎంతచెప్పినా.. ప్రజలు మోసపోతున్నారు. ఇటీవల జపాన్‌కు చెందిన 80 ఏళ్ల మహిళ.. వ్యోమగామినని చెప్పుకుని పరిచయమైన మోసగాడి భారినపడి దాదాపు రూ. 6 లక్షలు పోగొట్టుకుంది.జపాన్‌లోని ఉత్తరాన ఉన్న హక్కైడోకు చెందిన 80 ఏళ్ల మహిళ.. జూలైలో సోషల్ మీడియాలో తాను వ్యోమగామి అని చెప్పుకునే స్కామర్‌ను కలిసింది. కొంత సంభాషణ తరువాత.. తాను ప్రస్తుతం అంతరిక్ష నౌకలో.. అంతరిక్షంలో ఉన్నానని, ఆక్సిజన్ అవసరం ఉందని మహిళతో చెప్పాడు. ఆక్సిజన్ కొనడానికి డబ్బు కావాలని ఆమెను కోరాడు. ఒంటరిగా ఉన్న మహిళ ఆ మోసగాడిపై ప్రేమ పెంచుకుని.. 5000 పౌండ్లు (సుమారు రూ.6 లక్షలు) డబ్బు పంపింది. చివరకు మోసపోయానని తెలుసుకుంది.చివరికి చేసేదేమీ లేక పోలీసులను సంప్రదించింది. వారు దీనికి 'రొమాన్స్ స్కామ్' (అపరిచిత వ్యక్తులపై ప్రేమ పెంచుకోవడం) అని పేరుపెట్టారు. సోషల్ మీడియాలో మీకు పరిచయమైన వారు.. ఎవరైనా మీ నుంచి డబ్బు డిమాండ్ చేస్తే.. దయచేసి స్కామ్ జరిగే అవకాశం ఉందని తెలుసుకోండి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి అని పోలీసు అధికారి హెచ్చరించారు.ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన దేశాల జాబితాలో జపాన్ ఒకటి. దీంతో ఇక్కడ మోసాలు పెరుగుతున్నాయి. జపాన్ నేషనల్ పోలీసు ఏజెన్సీ ప్రకారం.. 2024 మొదటి 11 నెలల్లో 3,326 రొమాన్స్ స్కామ్‌లు నమోదయ్యాయి. ఈ కేసులు 2023తో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ.గతంలో రొమాన్స్ స్కామ్‌లు వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని.. ఇలాంటి రొమాన్స్ స్కామ్‌లు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఒక ఆస్ట్రేలియన్ మహిళ ఆన్లైన్ మోసగాళ్ల వలలో పడి రూ.4.3 కోట్లకు పైగా పోగొట్టుకుంది. డేటింగ్ యాప్‌లో పరిచయమైనా.. అపరిచితుడు మలేషియాలోని కౌలాలంపూర్‌లో తన పర్సు దొంగిలించబడినందున తనకు రూ.2,75,000 అవసరమని ఆమెకు చెప్పాడు. నిజమని నమ్మిన ఆ మహిళ డబ్బు పోగొట్టుకుంది.ఇదీ చదవండి: భారత్‌పై ప్రశ్న.. చైనా రోబో సమాధానం -
ఐస్‌క్రీమ్ అమ్మిన మంత్రి కేటీఆర్
-
ఐస్‌క్రీమ్ అమ్మిన మంత్రి కేటీఆర్
-
ఐస్‌క్రీమ్ అమ్మిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : టీఆర్ఎస్ కూలీ దినాల్లో భాగంగా ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు కూలీ పని చేశారు. కొంపల్లిలోని ఓ ఐస్‌క్రీమ్ పార్లర్లో శుక్రవారం ఆయన ఐస్‌క్రీమ్ అమ్మి రూ.లక్షలు సంపాదించారు. ఒక ఐస్‌క్రీమ్‌కు ఎంపీ మల్లారెడ్డి రూ.5 లక్షలకు కొనగా, మరో ఐస్‌క్రీమ్‌కు స్థానిక నేత శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి రూ.లక్ష చెల్లించారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్‌లో ఈనెలలో జరగనున్న బహిరంగ సభకు విరాళాలు సేకరించే కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ ఐస్ క్రీమ్ అమ్మారు. అలాగే కుత్బుల్లాపూర్‌లో కేటీఆర్ జ్యూస్, ఐస్‌క్రీమ్ అమ్మారు. ఓ భవన నిర్మాణంలో కాసేపు ఇంజినీర్‌గా పనిచేశారు. మొత్తం 25 నిమిషాల పనికి మంత్రి కేటీఆర్‌కు రూ.7.30 లక్షల కూలి గిట్టుబాటు అయింది. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి, బాల్క సుమన్, వివేకానంద, శంభీపూర్ రాజు పాల్గొన్నారు. ఆనంతరం అక్కడి బస్తీవాసులతో ముచ్చటించారు. టీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పార్టీ నేతలను, ప్రజలను కోరారు. కాగా ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గులాబీ కూలీ దినాలుగా పాటించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. 21న టీఆర్ఎస్ ప్లీనరీని అదేవిధంగా 27వ తేదీన వరంగల్‌లో భారీ బహిరంగ సభ సందర్భంగా కార్యకర్తలు, పార్టీ నేతలు శ్రమదానం చేసి ప్లీనరీ, బహిరంగ సభకు విచ్చేసే నిమిత్తం ఎవరి సొంత ఖర్చులకు వారే సంపాదించుకోవాలని సూచించారు. దీంతో మంత్రి కేటీఆర్ మరో రెండు రోజులు నగరంలో కూలీ పనులు చేయనున్నారు. -
రూ. 6 లక్షల సరుకు సీజ్
గార్లదిన్నె : కల్లూరులో గురువారం విజిలెన్స్ అధికారులు ఫర్టిలైజర్ షాపులపై ఆకస్మీక దాడులు చేశారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి శ్రీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ విజిలెన్స్ ఎస్ఐ రామక్రిష్టయ్య, విజిలెన్స్ ఏఓ ఉమాపతి కల్లూరులోని కేశవ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్ షాపుపై దాడులు నిర్వహించారన్నారు. షాపులో స్టాక్ రిజిష్టర్, షాపులో ఉన్న సరుకులకు తేడా ఉండటంతో పాటు రికార్డులు సక్రమంగా లేక పోవడంతో దాదాపు రూ.6.85 లక్షలు విలువ చేసే సరుకులు సీజ్ చేశామన్నారు. మండల విస్తారణ అధికారి మధుకర్ పాల్గొన్నారు.