breaking news
R.S. Pura sector
-
మరోసారి కాల్పులకు తెగబడ్డ పాక్
జమ్మూ: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్లోని భారత అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని ఆర్ ఎస్ పురా సెక్టర్ ప్రాంతంలో కాట్రంకా సైనిక శిబిరాలే లక్ష్యంగా పాక్ కాల్పులకు తెగబడింది. ఈ మేరకు పోలీసులు శనివారం వెల్లడించారు. పాక్ కాల్పులపై వెంటనే స్పందించిన బీఎస్ఎఫ్ జవాన్లు ఎదురుకాల్పులకు దిగారు. శనివారం అర్థరాత్రి 1.00 గం.కు మొదలైన ఈ కాల్పులు 2.30 గం.ల వరకు జరుగుతునే ఉన్నాయని తెలిపారు. అయితే భారత్ వైపున ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణం నష్టం కానీ జరగలేదని పోలీసులు పేర్కొన్నారు. -
పాక్ మరోసారి కాల్పుల ఉల్లంఘన
పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఆ దేశ భద్రత దళాలు నిన్న సాయంత్రం భారత్- పాక్ సరిహద్దు రేఖ వెంబడి ఆర్.ఎస్.పురా సెక్టర్పై కాల్పులకు తెగబడిందని సరిహద్దు భద్రత దళానికి చెందిన ఉన్నతాధికారి మంగళవారం ఇక్కడ వెల్లడించారు. దాంతో భారత్ భద్రత దళాలు వెంటనే అప్రమత్తమైనాయని చెప్పారు. ఈ రోజు తెల్లవారుజాము వరకు ఇరువైపులా కాల్పుల ప్రక్రియ కొనసాగిందని తెలిపారు. అయితే భారత్- పాక్ సరిహద్దు వెంబడి పొరుగుదేశం పాకిస్థాన్ తరచుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకోని కేంద్ర హోం శాఖ మంత్రి షిండేతోపాటు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా మంగళవారం నియంత్రణ రేఖ వెంబడి పర్యటించి, పరిస్థితి సమీక్షించనున్నారు. దాదాపు 10 ఏళ్ల క్రితం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఏడాది జనవరి నుంచి ఇరుదేశాల సరిహద్దుల్లోని భారత్ సైనిక శిబిరాలపై కాల్పులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే.