-
అయ్యా కాల్మొక్త.. కనికరిచండి
సాక్షి, మహబూబ్‌నగర్ న్యూటౌన్ : అయ్యా.. నీ కాల్మొక్త.. నా భూమిని ఖబ్జా చేసిండ్రు.. అడిగితే కొడుతుండ్రు.. 30 ఏళ్ల కిందట ఎకరాకు రూ.16 వేల చొప్పున 5 ఎకరాలు భూమి కొన్నా.. నా భూమి పక్కనే ఉన్న తిమ్మారెడ్డి అనే దొర ఈ మధ్య పొలంలో ఖడీలు పాతిండు. ఇదేంటంటే కొట్టిండు.. ఊరి పెద్దమనుషులు కూడా ఆయనకే మద్దతు చెప్తున్నరు.. జర నాకు నాయం చెప్పండి.. అంటూ మహబూబ్‌నగర్ మండలం బొక్కలోనిపల్లికి చెందిన చిన్నబాలప్ప అధికారులకు తన గోడును వెళ్లబోసుకున్నాడు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ ఫిర్యాదులు, వినతులను అధికారులకు అందజేసి వేడుకున్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకట్రావు, డీఆర్వో వెంకటేశ్వర్లు, సర్వే ల్యాండ్ ఏడీ శ్యాంసుదర్‌రెడ్డి, సోషల్ వెల్ఫేర్ డిడి ఉదయ్‌కుమార్ వినతులు స్వీకరించారు. ఎక్కువగా భూ కబ్జాలు, రైతుబంధు చెక్కు, పాస్‌బుక్కులు, హాస్టళ్లలో పిల్లలకు సీట్లు ఇప్పించాలని, పెన్షన్లు, ట్రైసైకిళ్లు అందించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం 66 దరఖాస్తులు అందించగా హెల్ప్‌డెస్క్ ద్వారా ఉచితంగా సేవలందించారు. ఉన్నతాధికారులు వచ్చిన వినతులను శాఖల వారీగా విభజించి పరిష్కరించాలని ఆయా శాఖల మండల అధికా రులను ఆదేశించారు. పాస్‌బుక్కులు, చెక్కులు రాలె భూప్రక్షాళన సర్వే చేసి ఆర్వోఆర్ 1బి ఇచ్చారు. రైతుబంధు పథకంలో అందరికిలాగే మాకు కూడా పాస్‌పుస్తకాలు, చెక్కులు వస్తాయని అనుకున్నాం. కానీ ఇంతవరకు రాలేదు. ఎందుకని అడిగితే సరిగ్గా సమాధానం చెప్తలేరు. సర్వే నెం.67లో మొత్తం 14.10 ఎకరాల భూమికి సంబంధించి రైతుబంధు పథకం పట్టాదారు పాస్‌పుస్తకాలు, చెక్కులు ఇప్పించాలని కోరుతూ మహబూబ్‌నగర్ మండలం వెంకటాపూర్ గ్రామ పరిధిలోని అవతలిగడ్డతాండకు చెందిన కె.చంద్రు నాయక్ తన కుటుంబ సభ్యులతో వచ్చి గోడును చెప్పుకున్నాడు. -
ఆర్డీఓ, ఇద్దరు తహసీల్దార్లపై కేసు
ఆత్మకూరు : నిబంధనలకు విరుద్ధంగా ఆర్ఓఆర్ పాస్‌పుస్తకం జారీ చేసిన ఆర్డీఓతో సహా ఇద్దరు తహసీల్దార్లు, ఎంఆర్ఐ, వీఆర్ఓపై ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. విచారణలో కొంతజాప్యం జరిగినప్పటికీ ఎట్టకేలకు ఆత్మకూరు ఎస్సై వి.క్రాంతికుమార్ కేసు నమోదు చేశారు. ఫిర్యాదుదారుడు గురిజాల శ్రీరామ్‌రెడ్డి కథనం ప్రకారం... మండలంలోని దామెరకు చెందిన గురిజాల దామోదర్‌రెడ్డికి కుమారులు శ్రీరామ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి ఉన్నారు. దామోదర్‌రెడ్డికి 389-ఏ, 389-బి, 390-డి సర్వేనబర్లలో 4 ఎకరాల 21 గుంటల భూమి ఉంది. అరుు తే ఈ భూమిని రెవెన్యూ అధికారులు ఎలాంటి విచారణ చేయకుండా ఏకపక్షంగా మహేందర్‌రెడ్డి ఒక్కరి పేరిట ఆర్ఓఆర్ పాస్‌పుస్తకం జారీచేశారు. అయితే ఈ భూమికి సంబంధించి అంతకుముందే ఆర్ఓఆర్ పాసుపుస్తకం తన తండ్రి పేరుమీద ఉందని.. దానిని ఏపీజీవీబీలో పెట్టి రుణం తీసుకున్నట్లు శ్రీరామ్‌రెడ్డి తెలిపారు. ఈ భూమికి సంబంధించి కోర్టులో భాగస్వామ్యదావా పెండింగ్‌లో ఉందని అభ్యంతర లేఖ ఇచ్చినప్పటికీ ఉద్దేశపూర్వకంగా రెవెన్యూ అధికారులు అక్రమ పాస్‌పుస్తకాలు ఇచ్చి రికార్డులు మాయంచేశారని ఆయన ఆరోపించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు పోలీసులు ఇంతకుముందు వరంగల్ ఆర్డీఓగా పనిచేసిన ఓజే మధు, ఏసీబీకి చిక్కిన అప్పటి ఆత్మకూరు తహసీల్దార్ కారం యాదగిరి, ఇక్కడే గతంలో తహసీల్దార్‌గా పనిచేసిన దస్తగిరి, ప్రస్తుత ఆత్మకూరు ఎంఆర్ఐ రవీందర్రావు, ఇంతకుముందు దామెరలో వీఆర్ఓగా పనిచేసిన రాజయ్యపై ఆగస్టు 9న కేసు నమోదు చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు మాయం.. ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయంలో పట్టాదారు పాసుపుస్తకాలకు సంబంధించిన ఫైళ్లు మాయమైనట్లు సమాచారహక్కు చట్టం ద్వారా వెల్లడైంది. ఈ తతంగంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement