breaking news
Romance With Finance
-
ఏప్రిల్‌లో ‘రొమాన్స్ విత్ ఫైనాన్స్’
చిత్ర దర్శకుడు రాజు కుంపట్ల మామిడికుదురు :యువతకు మంచి సందేశాన్ని అందించే అంశాలతో ‘రొమాన్స్ విత్ ఫైనాన్స్’ చిత్రాన్ని రూపొందించామని, ఈ చిత్రం అన్నివర్గాల పేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర దర్శకుడు రాజు కుంపట్ల తెలిపారు. ఆయన స్వగృహం మండల పరిధిలోని ఆదుర్రు శివారు మోరిపొలంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చిత్ర విశేషాలను రాజు వివరించారు. ప్రేమ, హాస్యం, కుటుంబ కథా నేపథ్యంలో ‘రొమాన్స్ విత్ ఫైనాన్స్’ చిత్రాన్ని రూపొందించామని చెప్పారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందని, దీనిని ఏప్రిల్‌లో విడుదల చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఈ చిత్రం షూటింగ్ మొత్తం తూర్పుగోదావరి జిల్లాలోనే చేశామన్నారు. ఇందులో ఐదు పాటలు ఉన్నాయని చెప్పారు. ఉగాది సందర్భంగా ఆడియోను రిలీజ్ చేశామని, ఈ చిత్రంలోని పాటలకు మంచి స్పందన వచ్చిందని పేర్కొన్నారు. జనార్దన్ మందుముల, సుదర్శన్ సరికొండ నిర్మాతలుగా ఈ చిత్రాన్ని రూపొందించామని, సతీష్‌బాబు, సురేష్ దేశరాజు, మెరీనా, ప్రియాంక నటించారని చెప్పారు. ఈ చిత్రానికి వీరూ పోట్ల సంగీతం అందించగా, మురళీ కెమెరామన్‌గా పని చేశారని పేర్కొన్నారు. ఈ చిత్రంలో ధనరాజు, చంటి, తాగుబోతు ఫణి, సురేష్, జెన్నీఫర్, ఉమ, తదితరులు ఈ చిత్రంలో నటించారని రాజు తెలిపారు.‘డ బ్బుంటే ఏ అమ్మాయిని అయినా వశ పర్చు కోవచ్చు అనుకునే అబ్బాయిలు’, ‘డబ్బున్న అబ్బాయిలను వాడుకుని వదిలేయవచ్చు అనుకునే అమ్మాయిలు’ ఈ పరిణామాల నేపథ్యంలో ఎదురయ్యే ఇబ్బందులు, తల్లితండ్రులు తీసుకోవల్సిన జాగ్రత్తలతో ఈ చిత్రం రూపొందించామన్నారు. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్, రవిరాజా పినిశెట్టి, వీరూపోట్ల, శివకుమార్ తనకు గురువులని రాజు కుంపట్ల పేర్కొన్నారు. తదుపరి ప్రముఖ నటునితో చిత్రం రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తానన్నారు. -
కామెడీ లవ్‌స్టోరీ
ప్రేమకథ నేపథ్యంలో సాగే రొమాంటి క్ ఎంటర్టైనర్ ‘రొమాన్స్ విత్ ఫైనాన్స్’. కామెడీ ఎంటెర్టైనర్ ఉపశీర్షిక. సతీష్ బాబు, మెరీనా జంటగా జనార్ధన్ మందుముల నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజు కుంపట్ల దర్శకుడు. ఈ చిత్రం ఆడియో సీడీని తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, ట్రైలర్‌ను దర్శకుడు వీవీ వినాయక్ ఆవిష్కరించారు. ఔత్సాహిక సినీ కళాకారుల కోసం తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని స్వామి గౌడ్ తెలిపారు. -
ప్రేమలో స్వార్థం
అన్ని ప్రేమలూ ఒకలా ఉండవ్. ప్రేమ ముసుగులో ఆర్థిక ప్రయోజనాలు పొందాలనుకునేవారు కూడా ఉంటారు. ఈ నేపథ్యంలో రాజు కుంపట్ల దర్శకత్వంలో జనార్దన్ మందుముల నిర్మిస్తున్న చిత్రం ‘రొమాన్స్ విత్ ఫైనాన్స్’. సతీష్, మెరీనా నాయకా నాయికలు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను నిర్మాత గొట్టిముక్కల పద్మారావు ఇటీవల హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రేమ ముసుగులో స్వార్థం అనేది ఈ చిత్రం ప్రధానాంశం. జాన్ స్వరపరచిన పాటలు, మురళి ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘టైటిల్ వినగానే.. ఇది బూతు చిత్రం అనుకునే అవకాశం ఉంది. కానీ, వినోద ప్రధానంగా సాగే ఆహ్లాదకర చిత్రం ఇది. త్వరలో పాటలను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. -
‘రొమాన్స్ విత్ ఫైనాన్స్’ సినిమా స్టిల్స్