Bigg Boss 10: బిగ్‌బాస్‌లోకి నిజామాబాద్ కుర్రాడు
ఈసారి అగ్నిపరీక్షలో నెగ్గి బిగ్‌బాస్ 10లోకి అడుగుపెట్టిన వాళ్లలో తెలంగాణ కుర్రాడు చరణ్ మహాదేవ్ అలియాస్ ఆర్జే చరణ్ ఒకడు. నిజామాబాద్‌లో పుట్టి పెరిగిన ఇతడు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి రేడియో జాకీగా ఆల్ ఇండియా రేడియో (AIR) హైదరాబాద్‌లో కెరీర్ మొదలుపెట్టాడు. యాంకర్‌గా పలు ఇంటర్వ్యూలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. డ్యాన్స్‌పై ఉన్న ఆసక్తితో పిల్లలకు డాన్స్ నేర్పిస్తూ, ఆన్లైన్ వీడియో ఎడిటింగ్ కూడా నేర్పిస్తుంటాడు.చరణ్‌కి డాన్స్ అంటే విపరీతమైన ఇష్టం. అలా రేడియో యాంకరింగ్, ఎడిటింగ్, డ్యాన్స్.. ఇలా తన ప్రతిభని చూపిస్తూ బిగ్‌బాస్ అగ్నిపరీక్ష పోటీ వరకు వచ్చాడు. ఇందులో తనదైన ముద్ర వేసి జడ్జిలను మెప్పించి ఇప్పుడు బిగ్‌బాస్ 10వ సీజన్లో పాల్గొనే సదావకాశం దక్కించుకున్నాడు.