Ritvika
-
91 మొబైల్స్
App కీ కహానీ... ఆమె పేరు రిత్విక. కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటోంది. అందులో కొన్ని ప్రత్యేకతలుండాలని ముందే నిర్ణయించుకుంది. అదే పనిగా కొన్ని రిటైల్ షాపులకు వెళ్లింది. సరైంది దొరకలేదు. ఆన్లైన్లో మొబైల్ హ్యాండ్సెట్స్ గురించి జల్లెడ పట్టింది. ఫలితం లేదు. చివరి ప్రయత్నంగా తన స్నేహితురాలిని కలిసింది. ఆమె ‘91 మొబైల్స్’ యాప్ గురించి చెప్పింది. ఈ యాప్ సాయంతో రిత్విక ఆమెకు నచ్చిన స్మార్ట్‌ఫోన్ కొనుక్కుంది. మీరు కూడా ఈ యాప్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకతలు ⇒ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్. ⇒ మనకు నచ్చిన ప్రత్యేకతలతో మొబైల్ హ్యాండ్‌సెట్‌ను సెర్చ్ చేయొచ్చు. ⇒ ఆయా స్మార్ట్‌ఫోన్స్‌కు సంబంధించిన బెస్ట్ డీల్స్ ఏ ఈ-కామర్స్ సంస్థల్లో అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవచ్చు. ⇒ ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీ, ఫోన్లకు సంబంధించిన ప్రత్యేకతలను చూసుకోవచ్చు. ⇒ గ్యాడ్జెట్స్ నిపుణులతో చాట్ చేసి, వారి సలహాలను తీసుకోవచ్చు. ⇒ ఈ యాప్ ఆయా ఉత్పత్తులకు వాటి రివ్యూలు, ఫీచర్ల ఆధారంగా 100 మార్కులకుగానూ స్కోరింగ్ ఇస్తుంది. మనం ఈ స్కోరింగ్ ద్వారా ప్రొడక్ట్ గురించి ఒక అంచనాకు రావచ్చు. ⇒ ఒక వస్తువు ధర ఏ ఏ ఈ-కామర్స్ సైట్లలో ఎలా ఉన్నాయో పోల్చి చూసుకోవచ్చు. ⇒ మార్కెట్లోకి కొత్తగా ఏ ఏ ప్రొడ క్ట్స్ వచ్చాయో చూడొచ్చు. ⇒ వస్తు ధరకు సంబంధించిన అలర్ట్స్‌ను సెట్ చేసుకోవచ్చు. -
ఓ చిన్న మార్పు కోసం!
ఉరుకులు పరుగులు పెట్టే ఉద్యోగం చేసేటప్పుడు ఓ చిన్న మార్పు కోసం విశ్రాంతి కోరుకుంటాం. అలాగే, ఒకే విధమైన వస్త్రధారణతో విసిగిపోయినప్పుడు ఓ చిన్న మార్పు కోరుకుని, వెరైటీలు ట్రై చేస్తాం. ఆ విధంగా మార్పు అనేది మన జీవితంలో ఓ భాగమైంది. ఇదే అంశాన్ని ప్రధానాంశంగా చేసుకుని ‘చిత్రం’ శ్రీను, రిత్విక జంటగా ఒంగోలు సురేష్ నిర్మిస్తున్న చిత్రం ‘జస్ట్ ఫర్ చేంజ్’. సీహెచ్ శంకర్ దొర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. త్వరలో పాటలను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రంలో హీరో ఎలాంటి మార్పు కోరుకున్నాడు? అనేది తెరపై చూస్తేనే ఆసక్తికరంగా ఉంటుందని నిర్మాత అన్నారు. కానూరి రమణ మంచి పాటలు స్వరపరిచారనీ, కథ, కథనం ప్రధాన ఆకర్షణ అవుతాయనీ, ‘చిత్రం’ శ్రీనుది చాలా మంచి పాత్ర అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: బెల్లంకొండ సాహిత్యన్, కెమెరా: ఆనంద్ మురుపూర్తి.