-
ఏడాది తర్వాత కనిపించిన కిమ్ జోంగ్ ఉన్ భార్య
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ భార్య రిసోల్–జు దాదాపు ఏడాది తర్వాత కనిపించారు. కిమ్ జోంగ్ ఉన్ తండ్రి, మాజీ దేశాధినేత కిమ్ జోంగ్ ఇల్ జయంతి మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భర్తతో కలిసి రిసోల్–జు కూడా పాల్గొన్నారు. సాధారణంగా ప్రతి కార్యక్రమానికి కిమ్ జోంగ్ ఉన్‌తోపాటు ఆమె కూడా హాజరవుతారు. కానీ, గత ఏడాది కాలంగా ఆమె ఎక్కడా కనిపించలేదు. అజ్ఞాతంలోనే ఉన్నారు. దీనిపై ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. చివరిసారిగా 2020 జనవరిలో ఆమె కనిపించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలోనే రిసోల్–జు బహిరంగ ప్రదేశాల్లోకి రాలేదని ఉత్తర కొరియాకు శత్రు దేశమైన దక్షిణ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీసు వర్గాలు భావిస్తున్నాయి. చదవండి: (శ్వేతసౌధం ఒక బంగారు పంజరం: బైడెన్) ప్యాంగ్యాంగ్లో కిమ్ జోంగ్ ఇల్ జయంతి వేడుకల్లో కిమ్ జోంగ్ ఉన్, ఆయన సతీమణి రిసోల్–జు -
కిమ్ హత్య చేయలేదు.. ఆమె బతికేవుంది
ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఏం చేసినా వార్తగా మారుతోంది. మరీ.. ప్రపంచ వినాశనానికి కారణభూమమవుతాడని భావిస్తున్న వ్యక్తి ఏం చేసినా వార్తే కదా. తాజాగా తన భార్య రి సోల్ జుతో కలిసి బయటకు వచ్చారు కిమ్. సాధారణానికి భిన్నంగా ప్రవర్తించే కిమ్ బాటలోనే ఆయన భార్య కూడా నడుస్తారు. అందుకే నెలల తరబడి ఎవరికి కనిపించకుండా(బయటి ప్రపంచానికి) ఉంటారు. ఎప్పుడో గానీ ఆవిడ ప్రజల ముందుకు రారు. తాజాగా ఓ విందు కార్యక్రమానికి భార్యభర్తలు కలిసి హాజరుకావడంతో ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. కొన్ని ఫోటోలు మీడియాకు చిక్కడంతో కిమ్ భార్య బయటకు వచ్చారంటూ వార్తలు గుప్పుమన్నాయి. మరి మీరు ఓ సారి నియంత భార్యను చూసేయండి. వాస్తవానికి కిమ్ తాత ఉత్తరకొరియా అధ్యక్షులుగా ఉన్న సమయంలో ఆయన భార్య బయటి ప్రపంచానికి కనిపించలేదు. ఆ సంప్రదాయన్నే కొనసాగంచిన కిమ్ నాన్న కూడా పాటించారు. అయితే భార్యను బయటి ప్రపంచంలోకి తీసుకువచ్చి కిమ్ సంప్రదాయాన్ని బద్దలు కొట్టారు. అయితే అది అడపా దడపా మాత్రమే. ఆ మధ్య రెండు మూడు సార్లు వీరిద్దరూ కలిసి కన్పించారు. ఇటీవల కాలంలో అది కూడా తగ్గిపోయింది. దీంతో ఆమె గర్భవతి అయి ఉంటుంది అందుకే బయటకు రావడం లేదని వార్తలు వచ్చాయి. అంతటితో ఆగకుండా కిమ్‌కు.. తన భార్యకు మధ్య విభేదాలు వచ్చాయని ఆమె కిమ్ నుంచి విడిపోవాలని అనుకుంటున్నారని పుకార్లు వచ్చాయి. విభేదాలతో కిమ్ ఆమెను చంపేశారనే వార్తలు కూడా కొన్ని మీడియా సంస్ధలు ప్రచురించారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన విందు కార్యక్రమంలో మళ్లీ వీరిద్దరూ కలిసి కన్పించడంతో పుకార్లకు చెక్ పెట్టినట్లయింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్‌రావు
కేకేఆర్‌తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్‌రౌండ్ షో.. పంజాబ్‌ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement