breaking news
rice collection
-
నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు
-
రికార్డు స్థాయిలో బియ్యం సేకరణ
సాక్షి, హైదరాబాద్: మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా పౌర సరఫరాలశాఖ చేపట్టిన సంస్కరణలు ఫలితాలనిస్తున్నాయి. మిల్లర్ల నుంచి 2016–17 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) ను పూర్తిస్థాయిలో సేకరించింది. ఖరీఫ్ సీజన్లో 99.99%, రబీసీజన్‌లో 99.98% బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించారు. ఇంత భారీ మొత్తంలో సీఎమ్మార్‌ను సేకరించడం పౌరసరఫరాల శాఖ చరిత్రలోనే తొలిసారి. ప్రభుత్వం బియ్యం కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. రికార్డు స్థాయి సేకరణ: ఈసారి రబీలో 37.20లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి సీఎమ్మాఆర్ కోసం రైస్ మిల్లులకు అప్పగించింది. ఇందుకుగాను 25.28 లక్షల టన్నుల బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వా నికి అప్పగించాల్సి ఉండగా, రికార్డు స్థాయిలో 25.26 లక్షల టన్నుల (99.98%) బియ్యాన్ని అప్పగించారు. ఖరీఫ్‌లో 16.48 లక్షల టన్నుల ధాన్యానికిగాను 11.04 లక్షల టన్నుల బియ్యాన్ని అప్పగించాల్సి ఉండగా 11.03 (99.98%) లక్షల టన్నులు అప్పగించారు. ఫలించిన ప్రణాళిక మిల్లర్లకు ధాన్యాన్ని అప్పగించడంలో పౌరసరఫరాల శాఖ పక్కా ప్రణాళికతో వ్యవహ రించింది. మిల్లుల సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ధాన్యం కేటాయింపులో అధికారులు ఒక క్రమపద్ధతిని పాటించారు. ఈ ఏడాది రబీ లో గడువులోగా బియ్యం అప్పగించని మిల్లర్ల మిల్లింగ్ చార్జీలో కోత విధిస్తామన్న నిబంధన మంచి ఫలితాన్నిచ్చింది. అందరి సహకారంతోనే: సీవీ ఆనంద్ వ్యూహాత్మక ప్రణాళికలను అమలు చేయడం ద్వారా మిల్లర్ల నుంచి 99 శాతానికి పైగా బియ్యాన్ని సేకరించామని పౌరసరఫరాల కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. దీని వెనుక మిల్లర్లు, జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారుల కృషి ఎంతగానో ఉందన్నారు. ఎన్ఫోర్స్మెంట్, ఆదాయపన్ను, వాణిజ్య విభాగాలను ఏర్పాటు చేయడం, శాఖలోని అన్ని వ్యవహారాలను ఆన్లైన్ చేసి నిరంతరం పర్యవేక్షించడం వంటి చర్యలతో సత్ఫలితాలు వచ్చాయని ఆయన వివరించారు. -
అన్న భాగ్యకు బాలారిష్టాలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూపాయి కిలో బియ్యం పథకం ‘అన్న భాగ్య’కు బాలారిష్టాలు తప్పేట్లు లేవు. తొలుత బియ్యం సేకరణ తలనొప్పి వ్యవహారంగా పరిణమించడంతో ప్రకటించిన సమయం కంటే రెండు నెలలు ఆలస్యంగా ఈ పథకం కింద పంపిణీని ప్రారంభించారు. తాజాగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వారి ఆహార అభిరుచులకు అనుగుణంగా బియ్యానికి ప్రత్యామ్నాయంగా జొన్న, రాగులను వచ్చే నెల రెండో తేదీ నుంచి పంపిణీ చేయాలనుకున్నారు. అయితే ఈ ధాన్యాల సేకరణ కూడా కష్టమవడంతో డిసెంబరులోగా కూడా ఈ పథకాన్ని చేపట్టడం అసాధ్యమనిపిస్తోంది. బియ్యం వద్దనుకునే వారికి రాగి లేదా జొన్నను పంపిణీ చేయాలని రాష్ట్ర మంత్రి వర్గం ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. బీపీఎల్ కార్డుదారులకు గాంధీ జయంతి రోజు నుంచి వీటిని పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం సీజన్ కాకపోవడంతో ఈ ధాన్యాలను ఆహార, పౌర సరఫరాల శాఖ సేకరించలేక పోతోంది. నవంబరు తర్వాత మాత్రమే ఈ పంటల దిగుబడులు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. కనుక డిసెంబరు నుంచి ఈ ధాన్యాల పంపిణీని ప్రారంభిస్తామని ఆ శాఖ ప్రభుత్వానికి తెలిపింది. రాగిని 18 దక్షిణ కర్ణాటక జిల్లాల్లోని 34.28 లక్షల కుటుంబాలకు అందించాల్సి ఉంది. 13 ఉత్తర కర్ణాటక జిల్లాల్లోని 47.41 లక్షల కుటుంబాలకు జొన్నను ఇవ్వాల్సి ఉంది. మరో వైపు రాగి, జొన్న సేకరణ ఆర్థికంగా తలకు మించిన భారంగా తయారవుతోంది. ప్రస్తుతం కేజీ రాగి ధర రూ.30, జొన్న రూ.40 చొప్పున పలుకుతోంది. ప్రభుత్వం రవాణా ఖర్చులను కలుపుకొని కేజీ బియ్యాన్ని రూ.27 చొప్పున సేకరిస్తోంది. రాగి, జొన్నలపై ఖర్చు తడిసి మోపెడయ్యే అవకాశాలున్నందున, హైబ్రిడ్ రకం జొన్నను సేకరించాలనుకుంటోంది. దీని ధర కేజీ రూ.19 మాత్రమే. అయితే ఉత్తర కర్ణాటకలో ఎక్కువ మంది హైబ్రిడ్ జొన్నను ఇష్టపడరు. కనుక దీనిపై సందిగ్ధత నెలకొంది. ఏదేమైనా రాగి, జొన్న పంపిణీ ప్రారంభమైతే పెద్ద మొత్తంలో బియ్యాన్ని సేకరించే భారం తగ్గుతుంది. ప్రస్తుతం నెలకు 2.77 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరిస్తుండగా, రాగి, జొన్న పంపిణీ ప్రారంభమైతే 70 వేల టన్నుల వరకు భారం తగ్గుతుందని అధికారులు తెలిపారు. కాగా రాగి, జొన్న సేకరణకు టెండర్లను ఆహ్వానించే ప్రక్రియ ప్రారంభమైందని ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు. స్పందన బలహీనంగా ఉంటే రేషన్ షాపుల ద్వారా వీటి పంపిణీ ఆలస్యం కావచ్చని చెప్పారు.