breaking news
Retired Supreme Court Judge
-
మద్రాస్ హైకోర్టుకు మందలింపు.. కరూర్ కేసు సీబీఐకి అప్పగింత
సాక్షి, ఢిల్లీ: కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు(CBI) అప్పగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది(Karur Stampede CBI Investigation). నిస్సందేహంగా.. న్యాయసమ్మతమైన, పక్షపాతరహిత విచారణ అనేది పౌరుల హక్కు అని ఈ సందర్భంగా ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను దేశ సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.కరూర్ తొక్కిసలాట ఘటనపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ టీవీకే పార్టీ వేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు.. సీబీఐ విచారణకు ఆదేశించింది. అయితే ఈ విచారణను పర్యవేక్షించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(SIT) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ఇద్దరు ఐపీఎస్‌ల ఈ కమిటీలో ఉంటారని పేర్కొంది. ఈ కమిటీకి సీబీఐ ఎప్పటికప్పుడు దర్యాప్తు నివేదికను అందించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 27వ తేదీన కరూర్‌లో జరిగిన టీవీకే ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందారు. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం తొలుత రిటైర్డ్ జడ్జి అరుణా జగదీశన్‌తో దర్యాప్తునకు ఆదేశించింది. ఈ కమిటీ మూడు నెలల్లో నివేదికను సమర్పించనుంది. అయితే ఈ కేసులో కుట్ర కోణం ఉందంటూ టీవీకే మొదటి నుంచి వాదిస్తోంది. ఈ క్రమంలో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా ఊరట దక్కలేదు. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం సీబీఐ విచారణకు లైన్ క్లియర్ చేసింది. అదే సమయంలో.. మద్రాస్ హైకోర్టును సుప్రీం కోర్టు మందలించింది. తమిళనాడులో రాజకీయ పార్టీల ర్యాలీలు, సభల కోసం ఒక ప్రామాణిక విధానాన్ని (SOP) రూపొందించాలనే అభ్యర్థనతో టీవీకే పిటిషన్ వేస్తే.. మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్(సింగిల్ బెంచ్) ఆ పార్టీ, ఆ పార్టీ అధినేత విజయ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీనిని సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. అంతేకాదు.. విచారణ జరపకుండానే ఐపీఎస్ అధికారి అస్రా గార్గా నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(SIT) ఏర్పాటు చేయడం కూడా పిటిషన్ పరిధిని మించి వెళ్లడమేనని, పైగా డివిజనల్ బెంచ్‌లో ఉండగా సింగిల్ బెంచ్ అలాంటి ఆదేశాలు ఎలా ఇవ్వగలిగింది? అనే అభ్యంతరాలను సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం వ్యక్తం చేసింది.ఇదీ చదవండి: 'మీరేం ఒంటరి కాదు..' విజయ్‌కు బీజేపీ సపోర్ట్!! -
జస్టిస్ కె.రామస్వామి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె.రామస్వామి (87) కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున నిద్రలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్యా ముగ్గరు పిల్లలున్నారు. భార్య శ్యామలాదేవి గతంలోనే కన్నుమూశారు. కుమారుడు శ్రీనివాస్ కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. మొదటి కుమార్తె జ్యోతి న్యూయార్క్‌లో ఎస్బీఐ ఏజీఎంగా... రెండో కుమార్తె జయ ఉస్మానియాలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. న్యూయార్క్‌లో ఉన్న కుమార్తె గురువారం సాయంత్రానికి హైదరాబాద్ చేరుకునే అవకాశముంది. శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జస్టిస్ రామస్వామి అంత్యక్రియలు జరగనున్నాయి. న్యాయవర్గాల్లో జస్టిస్ రామస్వామికి ఎంతో గొప్ప పేరుంది. న్యాయమూర్తుల సంతాపం.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీబీ రాధాకృష్ణన్ రిటైర్డ్ జస్టిస్ రామస్వామి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదాద్చారు. న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్రచౌహన్, జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ సంజయ్‌కుమార్, జస్టిస్ కోదండరాం, జస్టిస్ అమర్నాథ్గౌడ్, సుప్రీంకోర్టు జస్టిస్ సయ్యద్ షా మహ్మద్ ఖాద్రీలు, రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ ఈశ్వరయ్య తదితరులు కూడా జస్టిస్ రామస్వామి భౌతికాయం వద్ద నివాళులర్పించారు. భీమవరం నుంచి ఢిల్లీ వరకు 1932 జూలై 13న జన్మించిన జస్టిస్ కె.రామస్వామి ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం డబ్ల్యూజీబీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆంధ్రా లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1962 జూలై 9న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సివిల్, క్రిమినల్ కేసుల్లో మంచి నైపుణ్యం సాధించిన ఆయన 1972 నుంచి 1974 వరకు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. 1974లో హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది (జీపీ)గా విధులు నిర్వర్తించారు.1981–82 కాలంలో ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. 1982 సెప్టెంబర్ 29న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2 నెలలకు శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 1989 సెప్టెంబర్ నుంచి ఇంటర్నేషనల్ జూరిస్ట్స్ ఆర్గనైజేషన్ (ఆసియా) ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. 1989 అక్టోబర్ 6న పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1997 జూలై 12న పదవీ విరమణ చేశారు. 1998లో ఆయన జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులుగా నియమితులయ్యారు. 2012 వరకు ఆ పోస్టులో కొనసాగారు. -
హైకోర్టు ఏర్పాటు చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధం
సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి వరంగల్ : తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టును ఏర్పాటు చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురువారం హన్మకొండలోని వాగ్దేవి కళాశాలలో సురవరం ప్రతాప్‌రెడ్డి స్మారక ప్రథమ సభ కు ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ‘ప్రత్యేక హైకోర్టు లేని తెలంగాణ రాష్టం రాజ్యంగ బద్ధమేనా?’ అం శంపై ఆయన మాట్లాడుతూ ‘నేను ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంటే విశాల ప్రజానీకానికి వ్యతిరేకమైన ఈ చర్యను తీవ్రంగా పరిగణించేవాడినని’ అన్నారు. 214వ అధికరణం ద్వారా ప్రతి రాష్ట్రానికి విధిగా హైకోర్టును ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. వైశాల్యంలో, జనాభాలో చిన్న రాష్ట్రాలు అయిన త్రిపుర, మణిపూర్, మేఘాలయాకు హైకోర్టును ఏర్పాటు చేశారని, 4కోట్లకు పైగా జనాభా, విశాలమైన విస్తీర్ణం ఉన్న తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టును ఏర్పాటు చేయకపోవడం విచారకరమని పేర్కొన్నారు.