breaking news
register case
-
పెళ్లైన నాలుగు నెలలకే..
► హైదరాబాద్‌లో వివాహిత అనుమానాస్పద మృతి ► ఉరేసుకుందని కుటుంబ సభ్యులకు.. ► గుండెపోటుతో చనిపోయిందని అంబులెన్స్ డ్రైవర్‌కు చెప్పిన భర్త ► గుట్టుచప్పుడు కాకుండా నెల్లూరు తీసుకువచ్చిన వైనం ► భర్తే చంపేశాడంటున్న మృతురాలి కుటుంబసభ్యులు నెల్లూరు సిటీ: బ్యాంకులో ఉద్యోగం.. మంచి వ్యక్తి.. బిడ్డను బాగా చూసుకుంటాడని తల్లిదండ్రులు పెళ్లి చేసి పంపించిన నాలుగు నెలలకే వివాహితకు నూరేళ్లు నిండాయి. ఏం జరిగిందే ఏమో తెలియదు హైదారాబాద్‌లో శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భార్య మృతదేహాన్ని భర్త గుట్టుచప్పుడు కాకుండా అంబులెన్స్‌లో నెల్లూరుకు తరలించడం.. భార్య కుటుంబ సభ్యులకు ఉరేసుకుని చనిపోయిం దని..అంబులెన్స్ డ్రైవర్‌కు గుండెపోటుతో చనిపోయిందని చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరులోని అయ్యప్పగుడి సమీపంలోని విక్రమ్‌నగర్‌కు చెందిన బత్తల కృష్ణయ్య, వెంకమ్మ దంపతుల కుమారుడు బత్తల మహేష్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. గతంలో వివాహం కాగా భార్యతో విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నాడు. బుచ్చిరెడ్డిపాళెం, అనంతనారాయణపురానికి చెందిన వల్లెపు కల్లింగయ్య, గోవిందమ్మ దంపతుల కుమార్తె శాంతి(25)ని రెండో వివాహం చేసుకున్నాడు. శాంతి తల్లిదండ్రులు ఇద్దరు పక్షవాతంతో మంచానికి పరిమితమవడంతో అన్న బీమరాజు దగ్గరుండి చెల్లిలి వివాహం చేశారు. పెళ్లైన నాటి నుంచే నరకం మహేష్ పెళ్లైన తరువాత హైదరాబాద్‌లోని చింతల్‌లోని ఓ అపార్ట్మెంట్లో ప్లాట్‌ను అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు. అప్పట్నుంచే భార్యను మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు. కనీసం తిండి కూడా పెట్టకపోవడంతో అపార్ట్మెంట్లోని వారే ఆహారాన్ని అందించేవారు. తల్లిదండ్రులకు చెబితే ఇంట్లో నుంచి తరిమేస్తానని బెదిరించడంతో నాలుగు నెలల పాటు నరకయాతన అనుభవించిందని మృతురాలి కుటుంబసభ్యులు తెలిపారు. గుట్టుచప్పుడుగా మృతదేహం తరలింపు హైదరాబాద్ నుంచి బత్తల మహేష్ శనివారం శాంతి కుటుంబసభ్యులకు ఫోన్ చేశాడు. శాంతి ఇంట్లో ఉరేసుకుని చనిపోయిందని చెప్పాడు. శాంతి కుటుంబసభ్యులు వెళ్లేందుకు సిద్ధమవుతుండగానే తానే మృతదేహాన్ని తీసుకువస్తున్నాని తెలిపాడు. అంబులెన్స్ డ్రైవర్‌కు గుండెపోటుతో చనిపోయిందని చెప్పి గుట్టుచప్పుడు కాకుండా ఆదివారం అర్ధరాత్రి 2 గంటలకు నెల్లూరులోని విక్రమ్‌నగర్‌కు మృతదేహాన్ని తీసుకువచ్చాడు. శాంతి మృతదేహంపై రక్తపు మరకలు ఉండడంతో కుటుంబసభ్యులు, బంధువులకు అనుమానం కలిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవగా మహేష్ చల్లగా జారుకున్నాడు. దీంతో కోపోద్రిక్తులైన శాంతి కుటుంబ సభ్యులు మహేష్ ఇంటిపై దాడి చేశారు. అనంతరం తమ బిడ్డను భర్త చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఐదో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేవారు. కేసును హైదరాబాద్‌కు బదిలీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పాపం పండింది..
♦ గుర్రం బాబాపై కేసు.. ♦ తీసుకొచ్చిన వ్యక్తిపై కూడా.. ♦ భీమదేవరపల్లిలో ఇదే తంతు ♦ పోలీసులు వదిలేయడంతో కురవిలో మోసం కురవి/భీమదేవరపల్లి: గిరిజనుల ఆరోగ్యాలను బాగుచేస్తానని మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేసిన గుర్రం బాబాతోపాటు మరో వ్యక్తిపై కురవి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆది వారం ‘సాక్షి’లో ‘గుర్రంబాబా ఘరానా మోసం’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన సంగతి విధితమే. దీనిపై స్పందించిన పోలీ సులు దొంగబాబాపై కేసు నమో చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం దోసపహాడ్ గ్రామానికి చెందిన కడవంచి రామ్ దొంగ బాబాగా అవతారమెత్తి బొడ్రాయి ప్రతిష్ఠాపన పేరుతో కురవి శివారు లింగ్యా తండాకు చేరుకున్నాడు. అనంతరం తండాలో ఓ వ్యక్తి ఇంట్లో ఆశ్రయం తీసుకున్నా డు. బొడ్రాయి ప్రతిష్ఠాతోనే తండావాసులు సుఖ సంతోషాలతో ఉంటారని పెద్ద మనుషులను నమ్మించాడు. దీనికి పెద్దమనుషులు ఒప్పుకుని రూ.29వేలు వసూలు చేసి గుర్రంబాబాకు అందజేశారు. అంతటితో ఆగకుండా గుర్రంపై తండాలో ఇళ్లు ఇళ్లు తిరుగుతూ ఒక్కో ఇంటివద్ద ఆగి ‘మీ ఇంట్లో బాగాలేదు.. నయం చేయాల్సి ఉంది.. కొంత ఖర్చు అవుతుందని’ చెప్పాడు. దీంతో ఆరోగ్యాలు బాగాలేని వ్యక్తు లు కొందరు ఆయన మాటలను నమ్మి రూ. 2వేల నుంచి రూ.10వేల వరకు ముట్టచెప్పుకున్నారు. తండాకు చెందిన ఓ వ్యక్తికి కొంతకాలంగా ఆరోగ్యం బాగాలేకపోవడంతో గుర్రం బాబా ఇంటి ముందుకు వచ్చి మీ ఆరోగ్యం బాగాలేదు, బాగుచేయడానికి రూ.1లక్ష ఖర్చు అవుతుందని చెప్పడంతో బాధితుడు తలూపాడు. రూ.1లక్ష ఇచ్చుకోలేక మళ్లీ అతన్ని కలువలేదు. ఇలా అనేక మంది వద్ద డబ్బులను వసూళ్లు చేశాడు. డబ్బులతోకాకుండా చిన్న రోగమైతే కోడిపుంజు, పెద్ద రోగమైతే గొర్రెపోతు ఇవ్వాలని అడిగినట్లు తెలిసింది. దొంగబాబాతోపాటు మరొకరిపై కేసు .. గిరిజనులను మోసం చేసి డబ్బులు వసూళ్లకు పాల్పడిన సంఘటనపై స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని కురవి ఎస్సై తీగల అశోక్ తెలిపారు. బాబాతోపాటు తం డాకు చెందిన ఇస్లావత్రాములుపై కూడా కేసు నమోదు చేశామని తెలిపారు. కాగా, బాబాపై గతంలో నల్లగొండ, నిజామాబాద్ తదితర జిల్లాలో సైతం కేసులునమోదు అయినట్లు తెలిసింది. గుర్రానికి ట్రాలీ.. బాబాకు కారు.. గుర్రంబాబా ఎక్కడికి వెళ్లినా ఆయన వెంట ఓ ట్రాలీ ఆటో ఉంటుంది. అందులో గుర్రాన్ని తరలిస్తారు. అలాగే ఆయనకు ఒక సొంత కారు ఉంటుంది. ఆ కారులో తండాలకు చేరుకుంటాడు. అనంతరం ఓ ఇంట్లో ఆశ్రయం పొంది, నుదుటున విభూది పూసుకుని, కాషాయపు వస్త్రాలు ధరించి, గుర్రాన్ని అలంకరించి తండాల్లో ఊరేగింపు చేస్తూ అమాయకులను మోసం చేస్తుంటాడు. భీమదేవరపల్లిలో ఇదే తంతు.. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలో గుర్రం బాబా ఇలాంటి ఘటనకే పాల్పడడంతో అక్కడి పోలీసులకు బాధితులు ఈనెల 4వ తేదీన ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు బాబా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారించి వదిలేసినట్లు తెలిసింది.భీమదేవరపల్లి పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుని ఉంటే కురవి శివారు లింగ్యా తండాలో ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండేది.


