breaking news
Refresh
-
న్యూ ఇయర్ హ్యాంగోవర్: ఇలా చేస్తే క్షణాల్లో రిలీఫ్..!
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో రాత్రంత ఆడిపాడి ఎంజాయ్ చేయడం కామన్. ముఖ్యంగా బిర్యానీలు, కూల్‌డ్రింక్స్‌తో చిల్ అవ్వుతూ..తెలియకుండానే ఎక్కువగా లాగించేస్తాం. దానికి తోడు లేటుగా ఏ అర్థరాత్రో బాగా పొద్దుపోయాక పడుకోవడంతో..తిన్న ఆహారమంతా అరగక పొద్దున్నంతా నరకరం చూస్తాం. తలంత పట్టేసి..అబ్బా చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలామందికి. ఆ హ్యాంగోవర్‌ని వదులించుకోవడం అంత ఈజీ కాదు కూడా. అలాంటి సమస్యను ఈ రిఫ్రెషింగ్ డిటాక్స్ పానీయాలతో సులభంగా చెక్ పెట్టేయొచ్చని చెబుతున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందామా..!.రాత్రిపూట..అందులోనూ బాగా లేట్‌నైట్ వేపుళ్లు, అధిక నూనెతో కూడిన పదార్థాలు తినడం కారణంగా జీర్ణక్రియ మందగిస్తుంది. ముఖ్యంగా తలనొప్పి, వికారం, పొట్ట ఉబ్బరం, అలసట, పార్టీ హ్యాంగోవర్ వంటి సమస్యలతో సతమతమవుతుంటారు. అలాంటి వాళ్లు ఈ సమస్య నుంచి తర్విరతగతిన రిలీఫ్ పొందాలంటే సరైన డిటాక్స్ పానీయాలను తీసుకుంటే చాలు అని చెబుతున్నారు. ఇవి హైడ్రేటెడ్‌గా ఉండేలా చేసి, కాలేయ పనితీరు, జీర్ణక్రియకు మద్దతిస్తాయి. శరీరం వేగంగా కోలుకోవడానికి సహాయపడతాయట. ముఖ్యంగా మద్యం సేవించినవారికి ఇవి మరింత హెల్ప్ అవుతాయని చెబుతున్నారు. ఇవి ఇంట్లోనే సులభంగా తయరు చేసుకోవచ్చట కూడా. గోరువెచ్చని నీళ్లు నిమ్మకాయ..ఇది హ్యాంగోవర్‌కు చాలా ప్రయోజనకరమైనది. గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు హైడ్రేటెడ్‌గా ఉండేలా చేసి, జీర్ణక్రియను ప్రేరేపిస్తుందట. విటమిన సీ మోతాదు..కాలేయ ఎంజైమ్‌లకు మద్దతిస్తుందట. వికారం, పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. చిటికెడు ఉప్పు, కొబ్బరి నీరు.. కొబ్బరి నీరు, ఉప్పు శరీరాన్ని తిరిగా ఉత్సాహభరితంగా ఉండేలా చేస్తుంది. ఇందులోని పొటాషియం, సహజ ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది హైడ్రేషన్‌కి అనువైనది. అలాగే శరీరంలోని సోడియం స్థాయిలను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. కడుపుని తేలికగా చేస్తుంది. తలతిరగడం, నోరు పొడిబారడం, వంటి సాధారణ హ్యాంగోవర్ లక్షణాలను తగ్గిస్తుంది. అల్లం, తేనె నీరుఅల్లం, తేనె నీరు అనేది హ్యాంగోవర్‌ను సులభంగా నయం చేసే అద్భుతమై డీటాక్స్ వాటర్. అల్లం జీర్ణవ్యవస్థను శాంతపరచడానికి సహాయపడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యను నివారిస్తుంది. వికారం తగ్గడమే కాకుండా ఇందులోని తేనే సహజ గ్లూకోజ్‌ని అందిస్తుంది.దోసకాయ, పుదీనా, నిమ్మకాయ డిటాక్స్ వాటర్ఇది పొట్ట ఉబ్బరాన్ని తగ్గించి, హైడ్రేషన్‌కు మద్దతిస్తుంది. ముక్కలు చేసిన దోసకాయ, పుదీనా ఆకులు, నిమ్మకాయ ఒక బాటిల్ వాటర్‌లో వేసి రోజంతా త్రాగండి. దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పుదీనా జీర్ణక్రియకు మద్దతిస్తుంది. నిమ్మకాయ కాలేయ పనితీరుకు మద్దతిస్తుంది.ఉసిరి నీళ్లు..శీతాకాలంలో ఉసిరిని చేర్చుకోవడం ఎంతో మంచిది. ఆమ్లాలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయ ఆరోగ్యానికి మద్దతిస్తాయి. ఆల్కహాల్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. అల్లం జీర్ణవ్యవస్థను శాంతపరచడానికి సహాయపడుతుంది. హ్యాంగోవర్ తర్వాత అద్భుతమైన రికవరీ పానీయంగా మారుతుంది. అలాగే జీర్ణక్రియకు, శక్తి స్థాయిలను మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది,జీరా (జీలకర్ర) నీరుజీరా కలిపిన నీరు మీ మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా నూతన సంవత్సరానంతర హ్యాంగోవర్‌ను నయం చేయడానికి కూడా గొప్ప నివారణి కూడా. జీరా నీటి ఆమ్లత్వం పొట్ట ఉబ్బరం నుంచి బయటపడేలా చేస్తుంది. బరువు, మలబద్దకం, కడుపు అసౌకర్యం వంటి వాటి నుంచి బయటపడేలా చేస్తుంది.నివారించాల్సినవి:హ్యాంగోవర్ సమయంలో వీటికి మాత్రం దూరంగా ఉండాలికాఫీ తీసుకోకుంటేనే మంచిది. ఆ సమయంలో కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఎనర్జీ డ్రింక్‌లు రక్తంలోని చక్కెరను పెంచుతాయి, అలాగే కాలేయంపై మరింత ఒత్తిడి ఏర్పడేలా చేస్తుంది. నొప్పి నివారణ మందులు దరిచేరనివ్వకుండా ఉండటం.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: గాంధీ కుటుంబం మెచ్చే రణతంబోర్ నేషనల్ పార్క్..! అక్కడ న్యూ ఇయర్‌కి..) -
మీ మూడ్ ని మార్చేసే పూ బాలలు.. (ఫొటోలు)
-
మండే ఎండల్లో ఈ డ్రింక్స్ గురించి తెలిస్తే..
-
చక్కటి వీకెండ్ స్పాట్.. అలీసాగర్
వర్షంతో తడిసిన నేలపై పచ్చిక రంగుల ప్రయాణం సాగుతున్నంత సేపు ఆహ్లాదాన్ని పంచుతూనే ఉంటాయి. మనసులో ఊహించుకోవడం కన్నా అలా ఇంటి నుంచి బయలుదేరితే ఆ ఆనందాన్ని హాయిగా ఆస్వాదించవచ్చు, రిఫ్రెష్ కావచ్చు అనుకుంటే ఈ సారి నిజామాబాద్ జిల్లాలోని అలీసాగర్ చక్కటి వీకెండ్ స్పాట్. - ఓ మధు హైదరాబాద్ చుట్టుపక్కల పరిసరాలు మొన్నటి వరకు ఎండలకు బోసిపోయినా... ఇప్పుడు జలసిరితో పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. నిండైన నీటితో రిజర్వాయర్.. పరుగులెత్తుతూ ప్రకృతి ఒడిలో అల్లరి చేసే జింక పిల్లలు... పిల్లలకు నచ్చే బోటింగ్, ఆడుకోవడానికి గార్డెన్... ఇలా చిన్నా పెద్ద అందరికీ నచ్చే పిక్నిక్ స్పాట్ అలీసాగర్... ద్వీప సహితం... నిజాం 1931లో నిర్మించిన ఉపయుక్తమైన నీటిపారుదల ప్రాజెక్ట్ అలీసాగర్. ఈ ప్రాజెక్ట్‌కి పోచంపాడు బ్యాక్ వాటర్స్ నీరందుతుంది. అలీసాగర్ కేవలం నీటి వనరుల వినియోగానికి మాత్రమే కాకుండా మనసు దోచే అందమైన దృశ్యాలకు కూడా నెలవు. ఈ సాగర్‌కు మధ్యలో ఉన్న ముచ్చటగొలిపే చిన్న ద్వీపం కొత్త అనుభూతిని అందిస్తుంది. అంతేకాకుండా సాగర్‌లో పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన బోటింగ్, రివర్ క్రాసింగ్‌లతో పాటు సమీప ప్రాంతాల్లో ట్రెక్కింగ్‌కూ అవకాశం ఉంది. తద్వారా సాహసికులకు, ప్రకృతి ప్రేమికులకు నచ్చేలా రూపొందిన ఈ స్పాట్‌కి శని, ఆదివారాల్లో సందర్శకులు అధికంగా వస్తుంటారు. కలర్‌ఫుల్ గార్డెన్... నిజాం హయంలో 1928లో ఏర్పాటు చేసిన ఉద్యానవనం ఇక్కడ చెప్పుకోదగిన విశేషం. దాదాపు 33 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ గార్డెన్ జిల్లాలోనే అతి పెద్ద ఉద్యానవనం. మధ్య మధ్యలో వాటర్ ఫౌంటేన్స్, రకరకాల పూల చెట్లతో కలర్ఫుల్గా ఉంటుందీ గార్డెన్. అలీసాగర్ పరిసరాల్లో ఉన్న జీవజాలంతో పాటు, అక్కడి జింకలకు హాని కలుగకుండా ఏర్పాటు చేసిన పార్క్ కూడా ఆకట్టుకుంటుంది. దీనిని 1985లో ఏర్పాటు చేశారు. అటు రంగురంగుల పూల వనంతో పాటు అక్కడే ఉన్న ఈ జింకల స్థావరం కూడా సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఉద్యానవనం, సరస్సు, జింకల పార్కు, బోటింగ్... మనసుని రిఫ్రెష్ చేసే వాతావరణం.. వెరసి కుటుంబ సమేతంగా గానీ, స్నేహబృందాలు గానీ ఆనందించేందుకు అన్ని విధాలా అనువైన చక్కటి వీకెండ్ స్పాట్ అలీసాగర్ రిజర్వాయర్. మన నగరానికి దాదాపు 200 కి.మీ దూరంలో ఉన్న అలీ సాగర్ డ్యాం చేరుకోవడానికి రవాణా సౌకర్యాలకు కొదవలేదు. నగరం నుంచి నిజామాబాద్‌కు వెళితే అక్కడి నుంచి 13 కి.మీ దురంలో ఉన్న అలీసాగర్‌కు కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే బస్సు లేదా ప్రైవేటు వాహానాల్లో చేరుకోవచ్చు.


