breaking news
rbi rules changed
-
ఫోన్‌పే, పేటీఎంలో ఇక రెంటు కట్టడం కష్టం!
ఫోన్ పే, పేటిఎం లేదా క్రెడ్ వంటి మొబైల్ యాప్‌లలో క్రెడిట్ కార్డు ద్వారా ప్రతి నెలా రెంటు చెల్లించేవారికి ఇకపై కష్టతరం కానుంది. అనేక ఫిన్ టెక్ ప్లాట్‌ఫామ్ లు ఇప్పుడు తమ రెంటు పేమెంట్ సేవలను నిలిపివేశాయి. ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లించడం ఒక ప్రసిద్ధ ధోరణిగా మారింది. ఎందుకంటే ఈ చెల్లింపులపై వినియోగదారులకు రివార్డ్ పాయింట్లతోపాటు వడ్డీ లేని క్రెడిట్ వ్యవధిని ఆస్వాదించే అవకాశం కలిగేది. అయితే ఆర్బీఐ తాజా నిబంధనలను అనుసరించి ఈ సౌలభ్యం ఇప్పుడు కనుమరుగవుతోంది.చెల్లింపు సేవలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సెప్టెంబర్ 15న ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఈ చర్య ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ రివార్డులను సంపాదించడానికి లేదా వారి ఆర్థిక వ్యవహారాలను నిర్వహించడానికి రెంటు చెల్లింపులపై ఆధారపడిన వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. వారు ఇప్పుడు ప్రత్యక్ష బ్యాంకు బదిలీలు లేదా చెక్కు చెల్లింపులు వంటి సాంప్రదాయ పద్ధతులకు తిరిగి రావాల్సి ఉంటుంది.ఆర్బీఐ కొత్త నిబంధనలుసవరించిన మార్గదర్శకాల ప్రకారం.. తమతో ప్రత్యక్ష ఒప్పందాలను కలిగి ఉన్న, పూర్తి కేవైసీ ప్రక్రియను పూర్తి చేసిన వ్యాపారుల లావాదేవీలను మాత్రమే ప్రాసెస్ చేయడానికి పేమెంట్ అగ్రిగేటర్లు (PA), పేమెంట్ గేట్ వేలకు అనుమతి ఉంటుంది. తత్ఫలితంగా, ఈ యాప్‌లు ఇకపై తమ ప్లాట్ ఫామ్ లలో అధికారిక వ్యాపారులుగా నమోదు కాని భూస్వాములకు అద్దె చెల్లింపులను సులభతరం చేయలేవు.ఆర్బీఐ ఇటీవలి చర్యకు ముందే బ్యాంకులు ఇలాంటి లావాదేవీలను పరిమితం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాయి. ఉదాహరణకు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జూన్ 2024 నాటికే క్రెడిట్ కార్డు ద్వారా చేసే అద్దె చెల్లింపులపై 1% వరకు రుసుమును ప్రవేశపెట్టింది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ కార్డులు కూడా ఈ చెల్లింపులపై రివార్డ్ పాయింట్లను అందించడం నిలిపివేశాయి. ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పేతో సహా అనేక ప్లాట్ ఫామ్‌లు మార్చి 2024 నాటికి ఈ సేవను నిలిపివేసినప్పటికీ తర్వాత పాక్షికంగా వెసులుబాటు కల్పిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు కేవైసీ ప్రక్రియను కఠినతరం చేయడంతో ఇకపై అనధికార రెంటు చెల్లింపులకు అవకాశం ఉండదు. -
నెలకు రూ.400 కోట్ల రుణాలిచ్చే కంపెనీ.. మూసివేస్తున్నట్లు షాకింగ్ కామెంట్లు..
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ జెస్ట్‌మనీ తమ కార్యకలాపాలను నిలిపివేసినట్లు ప్రకటించింది. వ్యాపారం పునరుద్ధరించడానికి ఎన్నో ప్రయాత్నాలు చేశామని, కానీ అవి ఫలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. దాంతో తమ వద్ద పనిచేస్తున్న 150 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు షాకింగ్ కామెంట్లు చేసింది. దేశంలో ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా రుణాలపై ఆధారపడుతున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. భారత ప్రజల్లో వస్తు వినియోగం పెరుగుతోంది. ఈ క్రమంలో అనేక ‘బై నౌ పే లేటర్’ ఫిన్ టెక్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఇవి షాపింగ్ కోసం ప్రజలకు తక్కువ ఖర్చుతో రుణాలు కల్పిస్తున్నాయి. అలా ఏడాళ్ల కిందట జెస్ట్‌మనీ కంపెనీ ప్రారంభమైంది. దేశంలో ఈ వ్యాపార మోడల్‌పై నియంత్రణ చట్టాల్లో వచ్చిన మార్పులు కంపెనీని దెబ్బతీసినట్లు సమాచారం. దాంతో బిజినెస్ పునరుద్ధరించడంలో విఫలమైనట్లు కంపెనీ ప్రకటించింది. చివరికి సంస్థను మూసివేస్తున్నట్లు తెలిపింది. కంపెనీలో పనిచేస్తున్న 150 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చెప్పింది. మూసివేతకు సంబంధించి ప్రక్రియ పూర్తి చేసే వరకు కొంతమంది కంపెనీలోనే ఉండనున్నట్లు వివరించింది. తొలగించిన ఉద్యోగులకు డిసెంబర్ నెల వేతనం ఇస్తామని జెస్ట్‌మనీ హామీ ఇచ్చినట్లు సమాచారం. అలాగే కొత్త ఉద్యోగం వెతుక్కోవడంలోనూ వారికి సహాయం చేస్తామని చెప్పినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. గతంలో జెస్ట్మనీను ఫోన్‌పేకు విక్రయించాలని ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ ఒప్పందం కుదురకపోవడంతో కంపెనీ ముగ్గురు సహ వ్యవస్థాపకులు రాజీనామా చేశారు. దీంతో సంస్థ కొత్త నాయకత్వ బృందాన్ని నియమించింది. అయినా మూలధన అవసరాల నిమిత్తం నిధులను సమీకరించడం కష్టంగా మారింది. ఫలితంగా కంపెనీ మూసివేత అనివార్యమైందని సమాచారం. ఇదీ చదవండి: రూ.333 చెక్కుకు రూ.20 లక్షలు.. అదే ప్రత్యేకత! వాస్తవానికి కంపెనీని 2016లో లిజ్జీ చాప్మన్, ప్రియా శర్మ, ఆశిష్ అనంతరామన్ స్థాపించారు. కంపెనీ 17 మిలియన్ల కస్టమర్లను కలిగి ఉండి నెలకు రూ.400 కోట్ల రుణాలను పంపిణీ చేసేది. దేశంలో 10,000 ఆన్లైన్ బ్రాండ్లు, 75,000 ఆఫ్‌లైన్ స్టోర్లతో 27 రుణ, వ్యాపార భాగస్వాములను కలిగి ఉండేది. ఈ క్రమంలో నియంత్రణ చట్టాల్లో వచ్చిన మార్పులతో వ్యాపారాన్ని కొనసాగించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని నెలల కిందట కంపెనీ యజమానులు బాధ్యతల నుంచి తప్పుకున్నారు. -
కోపరేటివ్‌లపై రాజకీయ పెత్తనానికి చెక్
ముంబై: పట్టణ సహకార బ్యాంకుల (అర్బన్ కోపరేటివ్ బ్యాంకులు) విషయంలో ప్రమాణాలను బలోపేతం చేస్తూ ఆర్బీఐ పలు నూతన నిబంధనలను తీసుకొచ్చింది. అర్బన్ కోపరేటివ్ బ్యాంకుల ఎండీలు, హోల్‌టైమ్ డైరెక్టర్ల (డబ్ల్యూటీడీలు) విషయంలో అర్హత ప్రమాణాలను పటిష్టం చేసింది. ఈ పోస్ట్‌లకు ఎంపీలు, ఎంఎల్ఏలు, మున్సిపల్ కార్పొరేషన్ల పాలకమండలి సభ్యులను అనర్హులుగా ప్రకటించింది. అలాగే, స్థానిక పాలక మండళ్ల సభ్యులు, వ్యాపారంలో ఉన్నవారు, ఏదైనా కంపెనీతో సంబంధం ఉన్నవారు కూడా అనర్హులుగా నిర్దేశించింది. ఎండీ, డబ్ల్యూటీడీ పోస్ట్‌లకు కనీసం పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా ఫైనాన్స్‌లో అర్హత ఉండాలని నిబంధన విధించింది. చార్టర్డ్/కాస్ట్ అకౌంటెంట్, ఎంబీఏ (పైనాన్స్) లేదా బ్యాంకింగ్, కోపరేటివ్ బిజినెస్ మేనేజ్మెంట్లో డిప్లోమా కలిగి ఉండాలని పేర్కొంది. 35–70 ఏళ్ల వయసు పరిమితిని ప్రవేశపెట్టింది. అంతేకాదు కనీసం ఎనిమిదేళ్ల పని అనుభవం కూడా ఉండాలని ప్రతిపాదించింది. కనీసం రూ.5,000 కోట్లు అంతకుమించిన ఆస్తులు కలిగిన అర్బన్ కోపరేటివ్ బ్యాంకులు చీఫ్ రిస్క్ ఆఫీసర్ నియమించుకోవడం తప్పనిసరి చేస్తూ ఆర్బీఐ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. చదవండి: జీడీపీలో 56 శాతానికి బ్యాంకింగ్ రుణాలు -
నోట్ల కోసం ఎంతలా నిరసన వ్యక్తం చేసినా..
రద్దుచేసిన పెద్దనోట్లను మార్చుకునే విషయంలో భారతీయ రిజర్వ్ బ్యాంకు రోజుకో కొత్త నిబంధన తీసుకొస్తుండడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో విధించిన గడవు డిసెంబర్ 30వ తేదీన ముగిసిన విషయం తెల్సిందే. ఈలోగా మార్చుకోని వారు సరైన కారణాలను వివిరిస్తూ అఫిడవిట్ సమర్పిస్తే ఆర్బీఐ బ్రాంచ్‌ల వద్ద రద్దయిన నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం ముందుగా ప్రకటించింది. ఆ తర్వాత మాట మార్చింది. రద్దయిన పెద్ద నోట్లను మార్చుకునే అవకాశం కేవలం ప్రవాస భారతీయులకు మాత్రమేనని ఆర్బీఐ ఆనక ప్రకటించింది. మళ్లీ దాన్ని కూడా సవరిస్తూ ప్రభుత్వం ఇచ్చిన గడువుకాలంలో భారత్‌లో లేని ఎన్ఆర్ఐలకు మాత్రమే నోట్లను మార్చుకునేందుకు అనుమతిస్తామని ప్రకటించింది. ఆ తర్వాత బ్యాంక్ ఖాతాలున్న ఎన్ఐఆర్లకు మాత్రమే ఈ అవకాశం ఇస్తామని, వారు కూడా ఒరిజనల్ పాస్‌పోర్టులను పట్టుకొని రావాలంటూ ఆర్బీఐ తాజాగా నోటుసును జారీ చేసింది. రోజుకో రూలు పెడుతుంటే ఏమీ తెలియని అమాయక ప్రజలు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. కేవలం ఐదు వేల రూపాయల పాత నోట్లను మార్చుకునేందుకు ఢిల్లీలోని ఆర్బీఐ కార్యాలయం చుట్టూ మూడు రోజులుగా తిరుగుతున్న ఓ మహిళ అసహనాన్ని తట్టుకోలేక నగ్నంగా తయారై నిరసన వ్యక్తం చేసింది. అయినా ఆమెను కనికరించలేదు. ముంబైలోని ఆర్బీఐ కార్యాలయం ముందు రద్దయిన నోట్లను మార్చుకోలేక ప్రజలు ముఖ్యంగా, వృద్ధులు పడిగాపులు పడుతున్నారు. ప్రజలు లోనికి రాకుండా గేట్లు మూసేసిన బ్యాంక్ అధికారులు కేవలం బ్యాంక్ ఖాతాలున్న ఎన్ఆర్ఐలను మాత్రమే అనుమతిస్తున్నారు. సరైన కారణాలు వివరిస్తే ప్రజలందరికి నోట్లు మార్చుకునేందుకు అవకాశం ఇస్తామని ప్రభుత్వం ముందుగా చెప్పిన మాటలే తమకు తెలుసునని, ఆ తర్వాత నిబంధనలను మార్చిన విషయం తెలియదని ప్రజలు వాపోతున్నారు. భక్తితో ఆవులకు ప్రజలు సమర్పించిన సొమ్మును మార్చుకునేందుకు వచ్చిన వాటి సంరక్షకులు, భర్తలకు తెలియకుండా చీరల మడతల్లో దాచుకున్న సొమ్మును మార్చుకునేందుకు వచ్చిన భార్యలు బాధితుల్లో ఎక్కువగా ఉన్నారు. 1. గోమాతకొచ్చిన నిధులు: ‘గాయ్ కా డబ్బా’లో ప్రజలు సమర్పించిన సొమ్ములో 2,500 రూపాయల పాత నోట్లను మార్చుకునేందుకు పొవాయ్ నుంచి ఓ వ్యక్తి వచ్చారు. 2. మతిమరుపు బామ్మ: తాను దాచుకున్న పింఛను సొమ్ము ఐదు వేల రూపాయలను మార్చుకునేందుకు వాపి నుంచి 78 ఏళ్ల బామ్మ వచ్చారు. తనకు మతిపరుపు ఎక్కువని, ఎప్పుడో చీర మడతల్లో డబ్బు పెట్టి మరచిపోయానని, బట్టలు సర్దుతుంటే ఇటీవలే డబ్బు దొరికిందని, ముంబైలో ఉంటున్న తన కూతురికి ఈ విషయం తెలిపి మార్చుకునేందుకు ఆమెను తీసుకుని వచ్చానని చెప్పారు. 3. భార్య పరుపుకిందున్న సొమ్ము: అనారోగ్యంతో మంచం పట్టిన తన భార్య పరుపు కింద 5,500 రూపాయలు బయటపడ్డాయని, వాటిని మార్చుకునేందుకు వచ్చానని కుర్లా నుంచి వచ్చిన ఓ సీనియర్ సిటిజన్ వాపోయారు. 4. తాగుబోతు భర్తకు తెలియకుండా దాచిన సొమ్ము: అత్తకు వచ్చే పింఛను నుంచి తాగుబోతు భర్తకు తెలియకుండా దాచిన ఏడువేల రూపాయలను మార్చుకునేందుకు వితయ అనే ఇల్లాలు థానే నుంచి వచ్చారు. 5. బ్యూటీషియన్ దాచుకున్న సొమ్ము: చీర మడతల్లో దాచుకున్న 20 వేల రూపాయల సొమ్మును మార్చుకునేందుకు బాంద్రా నుంచి ఓ బ్యూటీషియన్ వచ్చారు. ఈ నోట్లను మార్చుకునేందుకు తాను గతంలో బ్యాంకుల వద్దకు వెళ్లానని, ఎప్పుడూ జనంతో రద్దీ ఎక్కువగా ఉండడంతో మార్చుకోలేదని, ఆర్బీఐలో మార్చుకునేందుకు ఎలాగూ అవకాశం ఉందన్న కారణంతో ఇన్ని రోజులు ఊరుకున్నానని ఆమె ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇలాంటి వారెవరూ కూడా నల్లడబ్బును మార్చుకునేందుకో వారి తరఫున మార్చేందుకో రాలేదు. వారు చెబుతున్న విషయాల్లో నిజాయితీ కనిపిస్తోంది. ఇలాంటి వారికి అన్యాయం జరగకుండా అధికారులు నిబంధనలను సడలించాల్సి ఉంటుంది.


