breaking news
rayagiri station
-
యాదాద్రి రైల్వే స్టేషన్‌గా రాయగిరి..
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి రైల్వేస్టేషన్ పేరును యాదాద్రి రైల్వే స్టేషన్‌గా మార్పు చేశా రు. ఈ మేరకు కేంద్రం నుంచి ఉత్తర్వు లు జారీ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దుతున్న విష యం తెలిసిందే. అయితే యాదాద్రి ఆల య పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు పూర్తయితే దేశ నలుమూలల నుంచి రోజూ లక్ష మంది భక్తులు వస్తారని ప్ర భుత్వం అంచనా వేసింది. ఈ క్రమంలో ఘట్కేసర్ వరకు ఉన్న ఎంఎంటీఎస్‌ను రాయగిరి వరకు పొడిగించాలని, దీంతో పాటు రాయగిరి రైల్వేస్టేషన్ పేరును యాదాద్రి రైల్వే స్టేషన్‌గా మార్చాలని 2016లో ముఖ్య మంత్రి కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. ఈ క్రమంలో ఎంఎంటీఎస్‌ను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్ పేరును కూడా మార్పు చేసింది. ఇందుకు సంబంధించి ఈనెల 18న దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఉత్వర్వులు జారీ చేశారు. కాగా గత సంవత్సరం సెప్టెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వ గెజిట్‌లో పేరు మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు. యాదగిరిగుట్టకు రాయగిరి రైల్వే స్టేషన్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. సికింద్రాబాద్ – ఖాజీపేట సెక్షన్లో భువనగిరి – వంగపల్లి మధ్యన రాయగిరి రైల్వే స్టేషన్ ఉంది. రాయగిరిలో రైలు దిగి యాదగిరిగుట్టకు భక్తులు వెళ్తారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం సాక్షి, యాదాద్రి : రాయగిరి రైల్వే స్టేషన్ పేరు యాదాద్రి రైల్వే స్టేషన్‌గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్ బూరనర్సయ్యగౌడ్ హర్షం వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్‌కు పేరు మార్పుతో యాదాద్రి దేశ వ్యాప్తంగా ప్రాముఖ్యతను సంతరించుకుంటుందన్నారు. 2016లో యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ కేంద్రం మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, రైల్వే శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. –డా.బూరనర్సయ్యగౌడ్, మాజీ ఎంపీ, భువనగిరి -
పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు రాయగిరిలో హాల్టింగ్
సాక్షి, హైదరాబాద్: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి 8 నుంచి 12 వరకు పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు రాయగిరి స్టేషన్లో హాల్టింగ్ సదుపాయం కల్పించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్-గుంటూరు మధ్య నడిచే గోల్కొండ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 1.49 గంటలకు, తిరుగు ప్రయాణంలో ఉదయం 11.50 గంటలకు నిమిషం పాటు రాయగిరిలో ఆగుతుంది. సికింద్రాబాద్-బల్లార్ష మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 3.54 గంటలకు, తిరుగు ప్రయాణంలో ఉదయం 9 గంటలకు రాయగిరిలో నిమిషం ఆగుతుంది. సికింద్రాబాద్-సిరిపూర్ కాగజ్‌నగర్ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఉదయం 9.05 గంటలకు, తిరుగు ప్రయాణంలో సాయంత్రం 6.55 గంటలకు రాయగిరిలో నిమిషం ఆగుతుంది.