breaking news
ravela kisorbabu
-
మృతులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా
కోటగుమ్మం (రాజమండ్రి) :రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో వివాహానికి వెళ్లి తిరిగి వస్తూ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. శుక్రవారం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రులు పరామర్శించారు. చికిత్స అందిస్తున్న వైద్యులను క్షతగాత్రుల ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యాన్లలో ఎక్కువ మందిని ఎక్కించుకుని వెళ్లే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాన్స్‌పోర్టు అధికారులతో మాట్లాడి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మేయర్ పంతం రజనీ శేషసాయి, టీడీపీ నాయకులు కాశి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పరామర్శ రాజానగరం : జీఎస్‌ఎల్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప శుక్రవారం మధ్యాహ్నం పరామర్శించారు. గాయపడిన వారికి అయ్యే వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి అందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. -
వసతి గృహాన్ని తనిఖీ చేసిన సోషల్ వెల్ఫేర్ డీడీ
అవనిగడ్డ : స్థానిక ఎస్పీ బాలుర వసతీ గృహాన్ని సాంఘిక సంక్షేమశాఖ డెప్యూటీ డెరైక్టర్ బి.మధుసూదనరావు సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీచేశారు. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు ఆదేశాల మేరకు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం కలెక్టర్ 52 మందిని పరిశీలికులుగా నియమించినట్లు చెప్పారు. వసతీ గృహాల్లో మౌలిక సదుపాయూలు, మెనూ అమలు తీరు పరిశీలించి, నివేదికను అందించేందుకు ఈ తనిఖీ చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ వీఎస్ఎస్ గణేష్‌బాబు పాల్గొన్నారు. స్టాకు వివరాలు సక్రమంగా ఉండాలి నందిగామ రూరల్ : విద్యార్థుల వసతి గృహాల్లో స్టాక్‌రిజిస్టర్లు సక్రమంగా లేకపోతే ఉపేక్షించేంది లేదని సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్ ఎం.చిట్టిబాబు హెచ్చరించారు. నందిగామ పట్టణంలోని ఎస్సీ-1 బాలుర వసతి గృహాన్ని సోమవారం రాత్రి పొద్దుపోయాక ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్వహకుడు రవికుమార్‌ను అడిగి స్టాక్, విద్యార్థుల వివరాలను తెలుసుకున్నారు. రిజిస్టర్లో స్టాక్ వివరాలకు, నిల్వకు వ్యత్యాసం ఉండటంతో వాటి వివరాలు నమోదు చేసుకున్నారు. తనఖీల్లో ఎంసీహెచ్ నాగేశ్వరరావు, ఆర్ఐ వెంకటేశ్వరరావు, వీఆర్వో బ్రహ్మం పాల్గొన్నారు.