breaking news
Rasamayi Balakrishna
-
మానకొండూరు: రసమయికి గట్టి పోటీనే!
ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఉన్నారు. డబుల్ బెడ్ రూం ఇచ్చే అంశంలో వెనుకడుగు, అలాగే 100 పడకల హాస్పిటల్ రాకపోవడం మైనస్ లుగా చెప్పవచ్చు. ► ఎస్సీలు 23శాతం ► బీసీలు 65 శాతం ► ఎస్టీలు 1 శాతం ► ఇతరులు 11 శాతం ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ నుండి: రసమయి బాలకిషన్ కాంగ్రెస్ పార్టీ నుండి: కవ్వంపెల్లి సత్యనారాయణ బీజేపీ పార్టీ నుండి: గడ్డం నాగరాజు దరువు ఎల్లన్న సొల్లు అజయ్ వర్మ కుమ్మరి శంకర్ బీఎస్పీ పార్టీ నుండి: నిషాణీ రామచంద్రం మాతంగి అశోక్ వీరందరూ బరిలో ఉండేందుకు సన్నద్ధం అవుతుండగా ప్రధాన పోటీలు మాత్రం రసమయి బాలకిషన్ (బిఆర్ఎస్), కవ్వంపెల్లి సత్యనారాయణ (కాంగ్రెస్), ఆరపెల్లి మోహన్ (బిఆర్ఎస్), ఓరుగంటి ఆనంద్ (బిఆర్ఎస్)గడ్డం నాగరాజు (బీజేపీ)దరువు ఎల్లన్న (బీజేపీ)ల మధ్య గట్టి పోటీ ఉంటదని తెలుస్తుంది. ఆయా పార్టీల నుండి ఇచ్చే టికెట్‌పై ఆధారపడి ఉంటుంది. -
ఆ అధికారుల మధ్య నిశ్శబ్ద యుద్ధం!
సాక్షి, కరీంనగర్: ప్రభుత్వం అమలు చేసే ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల వద్దకు చేర్చే రెండు వ్యవస్థల మధ్య అంతరం పెరుగుతోంది. ప్రభుత్వ పెద్దల వద్ద వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవాలనే ఆలోచన జిల్లా అధికార యంత్రాంగంలో కూడా పెరిగిపోవడంతో ప్రజా ప్రతినిధులతో నిశ్శబ్దయుద్ధం వాతావరణం నెలకొంది. మీటింగులు, ముఖ్యమైన కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి మెలిసి ఉన్నట్లు కనిపిస్తున్నా... వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. తనను అనర్హుడిని చేసేందుకు ఓ అధికారి విపక్ష నాయకుడితో కుమ్మక్కయ్యాడనే ఆరోపణలు చేయడం పరిస్థితికి అద్దం పడుతుంది. కరీంనగర్ నుంచి అధికార పార్టీ తరఫున మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన గంగుల కమలాకర్ ఏకంగా జిల్లా కలెక్టర్‌పైనే ఆరోపణలు చేయడమే గాక, అప్పటి బీజేపీ అభ్యర్థి సంజయ్‌కుమార్‌తో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడిన ఆడియో టేప్‌ను ముఖ్యమంత్రికి పంపించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంతో అధికారులకు, ప్రజాప్రతినిధులకు మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి తీరు వెలుగు చూసింది. ఒక్క కరీంనగర్‌లోనే గాక పెద్దపల్లి జిల్లాలో కూడా ప్రజా ప్రతినిధులు, అధికారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడం గమనార్హం. అధికారుల ఏకపక్ష నిర్ణయాలు పెద్దపల్లి జిల్లాలో ప్రజాప్రతినిధులకు మింగుడు పడడం లేదు. ఎంపీపీలు, జెడ్పీటీసీలకు జిల్లా స్థాయి అధికారులు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదనే విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. 2014 నుంచే గంగులతో అంతరం? 2014లో జిల్లా జాయింట్ కలెక్టర్‌గా సర్ఫరాజ్ అహ్మద్ వ్యవహరించారు. కార్పొరేషన్‌కు స్పెషల్ ఆఫీసర్‌గా కూడా వ్యవహరించిన ఆయన వద్దకు మునిసిపల్ ఉద్యోగులు ఒక ఫైల్‌పై సంతకం కోసం వెళ్లారు. అప్పటి స్పెషల్ ఆఫీసర్ ఫైల్‌ను తమపైకే విసిరేశారని ఆరోపిస్తూ పెన్‌డౌన్ సమ్మె నిర్వహించారు. ఈ వివాదానికి అప్పటి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పూర్తి సహకారం అందించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందనే వాదన ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన జిల్లా కలెక్టర్‌తో గంగులకు మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఇటీవల లీకైన సంజయ్–కలెక్టర్ ఆడియో టేప్‌తో వెల్లడవుతోంది. 2017లో రసమయితో ‘డోంట్ టాక్ ’ కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన డీజీ–ధన్‌మేళా కార్యక్రమాన్ని 2017 మార్చి 1న కరీంనగర్లో జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అప్పటి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, జిల్లా మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంపీ వినోద్‌కుమార్ ఫొటో ముద్రించకపోవడాన్ని ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, గంగుల కమలాకర్ తప్పుపట్టారు. వేదికపైకి రమ్మన్నా వెళ్లకుండా నిరసన వ్యక్తం చేశారు. తరువాత ఈటల, వినోద్‌కుమార్ పిలవడంతో స్టేజీపైకి వెళ్లిన వీరిద్దరు వినోద్‌కుమార్ ఫ్లెక్సీ అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రసమయి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ఉద్ధేశించి ప్రభుత్వ కార్యక్రమంలో ఎంపీ ఫొటో పెట్టకపోవడాన్ని తప్పు పడుతూ ప్రశ్నించగా... ఆయన ఎమ్మెల్యేకు కుడిచేతి వేలు చూపిస్తూ... ‘డోంట్ టాక్’ అనడం అప్పట్లో సంచలనం సృష్టించింది. పెద్దపల్లిలో పూడ్చలేని అగాధం పెద్దపల్లి జిల్లాలో సైతం ప్రజా ప్రతినిధులకు అధికారులకు మధ్య అంతరం పూడ్చలేనంతగా పెరిగిందని తెలుస్తోంది. ప్రజా ప్రతినిధులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా జిల్లా ముఖ్య అధికారి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. పారిశుధ్యంలో జిల్లా నెంబర్‌వన్‌గా మారినట్టు అవార్డులు వస్తున్నా... ఆ క్రెడిట్ ఏదీ ప్రజాప్రతినిధులకు రావడం లేదు. అదే సమయంలో పారిశుధ్య నిర్వహణ కోసం చేస్తున్న కొనుగోళ్ల వ్యవహారం కూడా వివాదాస్పదం అవుతోంది. గ్రామ పంచాయతీలలో పారిశుధ్య నిర్వహణకు 237 ట్రాక్టర్ల కొనుగోలు అంశం మొదలుకొని ప్లాస్టిక్ బుట్టలు, ట్రీ గార్డుల కొనుగోళ్ల వరకు ప్రజాప్రతినిధులతో సంబంధం లేకుండానే నిర్ణయాలు జరిగిపోయినట్లు అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. కీర్తికాంక్షతో ప్రజాప్రతినిధులను పరిగణనలోకి తీసుకోని వైనం పెద్దపల్లి జిల్లాలోనే నెలకొందని ఓ ఎంపీపీ ‘సాక్షి’కి తెలిపారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలకు ఏమాత్రం విలువ లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు గౌరవ మర్యాదలకు ఢోకా లేకున్నా.. ఎంపీపీ, జెడ్పీటీసీల పరిస్థితి పెద్దపల్లికి భిన్నంగా లేదు. అధికారులు, ప్రజా ప్రతినిధులకు మధ్య పెరుగుతున్న అంతరం చివరికి ప్రజలకు అందించే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
‘పొన్నం’ వర్సెస్ ‘రసమయి’
కరీంనగర్: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సాంస్కృతిక సారథి చైర్మన్ రస మయి బాలకిషన్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరుపార్టీల వారు నినాదాలు, ప్రతినినాదాలు చేయడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కరీంనగర్లో మాతా శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి ఆర్అండ్ బీ అతిథిగృహంలో సేద తీరారు. ప్రభాకర్ కాంగ్రెస్ నేతలతో కలసి ఆర్అండ్బీ అతిథి గృహానికి వెళ్లారు. పొన్నం తన బృందంతో మంత్రి లక్ష్మా రెడ్డి వద్దకు వచ్చి తమకు సమయం ఇవ్వాలని కోరారు. మెడికల్ కళాశాల మంజూరు ఆలస్యంపై ప్రశ్నిస్తూ నాటి పత్రిక ప్రకటనలు, సీఎం మాట్లాడిన వీడియో క్లిప్పిం గ్లను సెల్‌ఫోన్ ద్వారా మంత్రికి చూపిస్తుండగా.. రస మయి జోక్యం చేసుకొని ‘చూపెట్టింది చాలులే.. ఇన్నాళ్లు మీరేం చేశారంటూ..’ ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. మంత్రి ఇరువురిని సముదాయిం చారు. రసమయిని పక్కకు తీసుకెళ్లడంతో ఆందోళన సద్దుమణిగింది. -
హరితహారంతో ఎంతో మేలు
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి కె. తారకరామారావు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హరితహారం కార్యక్రమం ద్వారా భావితరాలకు ఎంతో మేలు చేకూరనుందని పంచాయతీరాజ్ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. శనివారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హరితహారంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో కేటీఆర్ సమీక్షించారు.గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ విభాగాల సిబ్బందిని హరితహారం కార్యక్రమానికి వినియోగించుకోవాలని... గ్రామం యూనిట్‌గా దీనిని చేపట్టాలని, గ్రామ సర్పంచ్‌లకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. మొక్కల పెంపకం బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించాలన్నారు. ఈ నెల 25 నుంచి హరిత హారంపై ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని, దీనికోసం తెలంగాణ సాంస్కృతిక సారథుల సేవలను వినియోగించుకోవాలని సూచిం చారు. ఖమ్మం జిల్లా పాల్వంచ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అటవీ శాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంతో తెలంగాణ సుభిక్షంగా మారనుందన్నారు. చెట్లుంటేనే వానలొస్తాయ్: వీడియో కాన్ఫరెన్స్‌లో మెదక్ జిల్లా ఫసల్వాడి సర్పంచ్ శాయమ్మతో కేటీఆర్ ముచ్చటించారు. చెట్లుంటేనే కాసింత నీడకాచుకోవచ్చని, చెట్లుంటేనే వానలొస్తాయని ఆమె మంత్రికి వివరించింది. ప్రజల్లోకి హరితహారం: రసమయి శనివారం సచివాలయంలోని విలేకరుల సమావేశంలో తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ మాట్లా డుతూ హరితహారాన్ని ఒక ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకెళ్తామని వ్యాఖ్యానిం చారు. హరితహారంపై సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలను పాట రూపకంగా మలచినట్లు తెలిపారు. -
అమరులకు నివాళిగా.. రసమయి పాట..!