breaking news
rapid fire round
-
అల్లు శిరీష్‌తో ప్రత్యేక రాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూ
-
Shooting World Cup: 15 పతకాలతో ‘టాప్’
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్‌ను భారత్ అగ్రస్థానంతో ముగించింది. టోర్నీ ఆఖరి రోజు కూడా హవా కొనసాగిస్తూ మరో రజతం సాధించిన భారత్ మొత్తం 15 పతకాలతో నంబర్‌వన్‌గా నిలిచింది. ఇందులో ఐదు స్వర్ణాలు కాగా, ఆరు రజతాలు, నాలుగు కాంస్య పతకాలున్నాయి. రెండో స్థానంలో ఉన్న ఆతిథ్య కొరియా ఖాతాలో 12 పతకాలే ఉన్నాయి. బుధవారం 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో అనిశ్ భన్వాలా, విజయ్ వీర్ సిద్ధు, సమీర్లతో కూడిన భారత జట్టు రజత పతకం సాధించింది. ఫైనల్లో భారత జట్టు 15–17తో మార్టిన్, థామస్, మతేజ్లతో కూడిన చెక్ రిపబ్లిక్ చేతిలో ఓడిపోయింది. మొదట్లో మన షూటర్ల గురి కుదరడంతో ఒక దశలో 10–2తో పసిడి వేటలో పడినట్లు కనిపించింది. కానీ తదనంతరం లక్ష్యాలపై కచ్చితమైన షాట్లు పడకపోవడంతో 2 పాయింట్ల తేడాతో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. -
'మా ఆయన సరసన హీరోయిన్ గా జయలలిత'
ముంబై: తన భర్త అక్షయ్ కుమార్ సరసన హీరోయిన్ గా జయలలిత నటించాలని కోరుకుంటున్నట్టు రచయిత్రిగా మారిన నటి ట్వింకిల్ ఖన్నా సరదాగా వ్యాఖ్యానించింది. తన మొదటి పుస్తకం 'మిసెస్ ఫన్నీబోన్స్: షీజ్ జస్ట్ లైక్ యూ అండ్ ఏ లాట్ లైక్ మీ హియర్'ను మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు కరణ్ జోహర్ అడిగిన ప్రశ్నలకు ఆమె తనదైన శైలిలో జవాబిచ్చారు. సినిమా నటులు, రాజకీయ నాయకులతో పాటు వివిధ అంశాలపై వంగ్యాస్త్రాలు సంధించారు. వారిద్దరి సంభాషణ సాగిందిలా... కరణ్: అక్షయ్ తర్వాతి సినిమాలో హీరోయిన్ ఎవరు నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ట్వింకిల్: జయలలిత. ఆమె గొప్ప పోరాటయోధురాలు. కరణ్: మీరు ఎవరితో రియారిటీ షో చేయాలనుకుంటున్నారు ట్వింకిల్: వివాదస్పద సన్యాసిని రాధే మాతో... కరణ్: రణబీర్ కపూర్ గురించి ఏం చెబుతారు ట్వింకిల్: కత్రినా కైఫ్ నా నాలుకపై ఉంది కాబట్టి రణబీర్ గురించి మాట్లాడలేను. కరణ్: దీపికా పదుకునే గురించి చెప్పండి ట్వింకిల్: ఆమె ఏమైనా చేయగలదు. కరణ్: ప్రధాని నరేంద్ర మోదీని కలిస్తే ఏం అడుగుతారు ట్వింకిల్: మా ఆయనకు క్రీడా శాఖ మంత్రి పదవి ఇవ్వమంటా కరణ్: ఆమిర్ ఖాన్ ఫోన్ లో ఏమున్నాయి ట్వింకిల్: గ్రహాంతర వాసుల నగ్న చిత్రాలు కరణ్: అక్షయ్ గురించి ఎవరికీ తెలియని సంగతులు చెప్పండి ట్వింకిల్: సినిమాల్లో ట్రాజెడీ సీన్లు చూసినప్పుడు ఏడుస్తుంటాడు. ప్రతి రాత్రి గళ్ల పైజామా ధరిస్తారు. ఎప్పుడో ఒకసారి డ్రింక్ చేస్తాడు. కరణ్: పోర్న్ వెబ్ సైట్ల నిషేధంపై మీ అభిప్రాయం ట్వింకిల్: తల్లిగా సంతోషిస్తున్నా. కానీ పౌరురాలిగా విబేధిస్తున్నా కరణ్: స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే 377 సెక్షన్ గురించి మీ కామెంట్ ట్వింకిల్: చెట్టును పెళ్లి చేసుకునేందుకు అభ్యంతరం చెప్పరు కానీ స్వలింగ సంపర్కుల వివాహానికి ససేమీరా అంటారు