breaking news
Rammandir structure
-
అయోధ్యలోని రామాలయ ప్రారంభోత్సవాన్ని..57 ఏళ్ల క్రితమే ఊహించారా?
ఈ నెల 22న జరగబోయే బాలరాముని విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించిన కార్యక్రమాలు అట్టహాసంగా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో నేపాల్‌కు చెందిన 57 ఏళ్ల నాటి సీతారాముల స్టాంపు ఒకటి బయటపడింది. సరిగ్గా ఏప్రిల్ 18, 1967న శ్రీరామ నవమి (రాముడి పుట్టినరోజు) సందర్భంగా ఈ స్టాంపును విడుదల చేశారు. ఈ స్టాంప్‌పై నేపాల్, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో అనుసరించే హిందూ క్యాలెండర్ అయిన విక్రమ్ సంవత్ 2024 సంవత్సరం ఉంది. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం 1967లో విడుదలైన ఈ స్టాంప్‌పై ఈ ఏడాది రాసి ఉంది. అలాగే హిందువులు అనుసరించే విక్రమ్ సంవత్, గ్రెగోరిన్ క్యాలెండర్ కంటే 57 ఏళ్లు ముందుంటుంది. సరిగ్గా అయోధ్యలో ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాలు రసవత్తరంగా సాగుతున్న వేళ ఈ స్టాంప్ బయటపడటం రకరకాల ఊహాగానాలుకు తెరతీసింది. అంతేగాదు ఇప్పుడు అయోధ్యలో జరగనున్న రామాలయ ప్రారంభోత్సవాన్ని నేపాల్ 57 ఏళ్ల క్రితమే ఊహించిందా?.. అంటూ చర్చలకు దారితీసింది. అదికూడా సరిగ్గా ఈ టైంలో వెలుగులోకి వచ్చిన ఈ స్టాంప్‌పై ఉన్న సంవత్సరం ఈ ఏడాదిని పోలి ఉండటం అందర్నీ ఆలోచింపచేసేలా ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా ఈ స్టాంప్ విడుదలైన సంవత్సరం ఆలయ ప్రతిష్టాపన సంవత్సరంతో సరిపోలింది. 2024లో రాముడు తన జన్మభూమి అయిన అయోధ్యకి తిరిగి వస్తాడని 57 ఏళ్ల కిత్రం నేపాల్‌లో ఈ స్టాంప్ విడుదలైనప్పుడు ఎవరూ ఊహించి ఉండరు కదా!. ఇదిలా ఉండగా, ఈనెలలో జరగనున్న రామ ప్రాణప్రతిష్టాపన కోసం 56 అంగుళాల పొడవుతో సింహగర్జనతో కూడిన డ్రమ్ అయోధ్యకు పెద్ద ఊరేగింపుగా వచ్చింది. దీన్ని ఆలయంలో ఉంచుతారు. అలాగే ఎనిమిది లోహాలతో కూడిన శంఖం కూడా ప్రాణ ప్రతిష్టాపన సమయంలో బాల రాముడి పాదాల వద్ద ఉంటుంది. ఈ శంఖాన్ని అలీఘర్ నివాసి విరాళంగా ఇచ్చారు. కాగా, ఈ నెల 22న జరగనున్న భవ్య రామాలయం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ వంటి ప్రముఖులు హాజరుకానున్నారు. దాదాపు ఏడు వేల మంది ప్రముఖ ఆహ్వానితులలో క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి వారు ఉన్నారు. (చదవండి: రూ. 500 నోట్లపై శ్రీరాముడ ముఖచిత్రం..వైరల్) -
కేంద్రానికి వీహెచ్‌పీ డెడ్‌లైన్
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: అయోధ్యలో రామమందిరం నిర్మాణం అంశంలో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) గళం పెంచింది. కేంద్ర ప్రభుత్వానికి గడువు విధించింది. ఈ ఏడాది చివరిలోగా రామమందిర నిర్మాణంపై ఆర్డినెన్స్ తేకుంటే తమకు వేరే ప్రత్యామ్నాయాలున్నాయంటూ హెచ్చరికలు చేసింది. శుక్రవారం ఇక్కడ భేటీ అయిన వీహెచ్‌పీ ఉన్నత స్థాయి కమిటీ రామ్ జన్మభూమి న్యాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆధ్వర్యంలో చర్చలు జరిపింది. అనంతరం వీహెచ్‌పీ ప్రముఖులంతా రాష్ట్రపతి కోవింద్‌కు∙తీర్మాన ప్రతిని ఇచ్చారు. వీహెచ్‌పీ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ మాట్లాడారు. ‘ప్రభుత్వం స్పందించకుంటే వేరే ప్రత్యామ్నాయాలున్నాయి. వచ్చే ఏడాది మహాకుంభమేళా సందర్భంగా సాధువులతో జరిగే ధరమ్ సన్సద్ సమావేశంలో నిర్ణయిస్తాం’ అని తెలిపారు. ‘ఈ మధ్య జంధ్యం ధరించిన కొందరు నేతలు ఆలయాలను దర్శించుకుంటున్నారు. వారూ మాకు మద్దతివ్వాలని రాహుల్‌గాంధీనుద్దేశించి అన్నారు. కేసు సుప్రీంకోర్టులో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ..‘ఇప్పటికే చాలా ఏళ్లపాటు ఎదురు చూశాం. ఇప్పుడిక వేచి చూడలేం’ అని‡ అన్నారు. ఢిల్లీలో సమావేశంలో పాల్గొన్న వీహెచ్‌పీ నేతలు -
రామ్ మందిర్ లక్ష్యంగా హిందుత్వ సంస్థ
న్యూఢిల్లీ: అయోధ్యలో వివాదాస్పద రామ్‌మందిర్ నిర్మాణాన్ని చేపట్టి.. మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని తీసుకునేలా ముస్లింలను ఒప్పించే లక్ష్యంతో బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి కొత్తగా హిందుత్వ సంస్థను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. విరాట్ హిందుస్తాన్ సంఘం పేరుతో ఏర్పాటుచేసే ఈ సంస్థ ఆర్టికల్ 370 రద్దు, ఏకీకృత సివిల్ కోడ్, రామ్‌మందిర్, గోవధ నిషేధం కోసం పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. రామ్ మందిర్ అంశాన్ని 2016, జనవరి 1 నుంచి చేపడతామన్నారు. ‘‘సౌదీఅరేబియాలో మాదిరి వక్ఫ్‌బోర్డును ఏర్పాటు చేసి సరయూ నదీతీరంలో మసీదు నిర్మాణానికి స్థలమిచ్చి, రామ్ మందిర్ స్థలాన్ని పూర్తిగా ఆలయానికే కేటాయించేలా చేయాలని ప్రభుత్వానికి సూచిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.