రామ్ మందిర్ లక్ష్యంగా హిందుత్వ సంస్థ | Ram Mandir goal Hindu organization | Sakshi
Sakshi News home page

రామ్ మందిర్ లక్ష్యంగా హిందుత్వ సంస్థ

Apr 9 2015 1:20 AM | Updated on Mar 29 2019 9:31 PM

రామ్ మందిర్ లక్ష్యంగా హిందుత్వ సంస్థ - Sakshi

రామ్ మందిర్ లక్ష్యంగా హిందుత్వ సంస్థ

అయోధ్యలో వివాదాస్పద రామ్‌మందిర్ నిర్మాణాన్ని చేపట్టి.. మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని తీసుకునేలా ....

న్యూఢిల్లీ: అయోధ్యలో వివాదాస్పద రామ్‌మందిర్ నిర్మాణాన్ని చేపట్టి.. మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని తీసుకునేలా ముస్లింలను ఒప్పించే లక్ష్యంతో బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి కొత్తగా హిందుత్వ సంస్థను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. విరాట్ హిందుస్తాన్ సంఘం పేరుతో ఏర్పాటుచేసే ఈ సంస్థ ఆర్టికల్ 370 రద్దు, ఏకీకృత సివిల్ కోడ్, రామ్‌మందిర్, గోవధ నిషేధం కోసం పోరాటం చేస్తుందని పేర్కొన్నారు.

రామ్ మందిర్ అంశాన్ని 2016, జనవరి 1 నుంచి చేపడతామన్నారు.  ‘‘సౌదీఅరేబియాలో మాదిరి వక్ఫ్‌బోర్డును ఏర్పాటు చేసి సరయూ నదీతీరంలో మసీదు నిర్మాణానికి స్థలమిచ్చి, రామ్ మందిర్ స్థలాన్ని పూర్తిగా ఆలయానికే కేటాయించేలా చేయాలని ప్రభుత్వానికి సూచిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement