breaking news
Ram Reddy Damodar Reddy
-
ఎస్సారెస్పీ స్టేజ్–2కు ఆర్డీఆర్ పేరు
తుంగతుర్తి, తిరుమలగిరి: ‘ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతమైన నల్లగొండ జిల్లాకు గోదావరి జలాలు తెచ్చిన ఘనత రాంరెడ్డి దామోద్రెడ్డిది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసి ఎస్సారెస్పీ స్టేజ్–2 సాధించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఒప్పించి ఎస్సారెస్పీ స్టేజ్–2 కాలువకు నీళ్లు తెచ్చారు. అందుకే ఎస్సారెస్పీ స్టేజ్–2 కాలువకు ‘ఆర్డీఆర్ ఎస్సారెస్పీ–2 కాలువ’గా నామకరణం చేసున్నాం. దీనికి సంబంధించి 24 గంటల్లోó జీవో విడుదల చేస్తాం’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాంరెడ్డి దామోదర్‌రెడ్డి లేని లోటు తీర్చలేదని, ఎస్సారెస్పీ–2కు ఆర్డీఆర్ పేరు పెట్టడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఆదివారం మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి సంతాప సభలో రేవంత్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి రేవంత్‌రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులతో కలిసి హాజరయ్యారు. గోదావరి జలాల కోసం పోరాటం దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా కరీంనగర్, వరంగల్ ప్రాంతాలకు నీళ్లు ఇచ్చారని, నల్లగొండ జిల్లాకు గోదావరి జలాలు తేవడానికి దామోదర్‌రెడ్డి ఎనలేని పోరాటం చేశారని రేవంత్‌రెడ్డి చెప్పారు. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని తీసుకొచ్చి రక్తతర్పణం చేశారని గుర్తుచేశారు. ఐదుసార్లు శాసన సభ్యుడిగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, జెండా మోసిన కార్యకర్తలకు అండగా నిలిచారని కొనియాడారు. ఖమ్మం జిల్లాలో రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, నల్లగొండ జిల్లాలో రాంరెడ్డి దామోదర్‌రెడ్డి జోడెడ్లలాగా పార్టీని తమ భుజాలపై మోసినట్లు పేర్కొన్నారు. గాంధీ కుటుంబం దామోదర్‌రెడ్డి కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటుందని, భవిష్యత్‌లో దామోదర్‌రెడ్డి కుటుంబానికి రాజకీయంగా అవకాశాలు కల్పించి కాపాడుకుంటామని రేవంత్‌రెడ్డి చెప్పారు. సోనియాగాం««దీ, రాహుల్ గాం«దీ, మల్లికార్జునఖర్గేకు దామోదర్‌రెడ్డిపై అభిమానం ఉందన్నారు. రాహుల్‌గాంధీ తన సంతాపాన్ని స్వయంగా లేఖ ద్వారా రాంరెడ్డి సర్వోత్తంరెడ్డికి పంపారని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రాంచందర్‌నాయక్, ఎంపీ రఘువీర్‌రెడ్డి, సీపీఐ శాసన సభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు, ప్రభుత్వ వీప్ బీర్ల ఐలయ్య, మాజీ మంత్రి జానారెడ్డి, మాజీ ఎంపీ హన్మంతరావు, ఎమ్మెల్యేలు మందుల సామేలు, పద్మావతి, వేముల వీరేశం, బాలునాయక్, మట్టా రాఘమయి, ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్, అద్దంకి దయాకర్, నెల్లికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు. -
మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) కన్నుమూత
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సూర్యాపేట: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ‘టైగర్ దామన్న’గా సుపరిచితులైన మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాతలింగాల గ్రామంలో రాంరెడ్డి నారాయణరెడ్డి, కమలాదేవి దంపతులకు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి 1952 సెప్టెంబర్ 14న జన్మించారు. ఖమ్మం జిల్లాలో జన్మించినా తుంగతుర్తిలోనే ఆయన రాజకీయంగా ఎదిగారు. ప్రాథమిక విద్యను స్వగ్రామంలోనే చదువుకున్న ఆయన, ఆ తరువాత హైసూ్కల్ విద్యను హైదరాబాద్‌లో పూర్తి చేశారు. డిగ్రీ వరంగల్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చదివారు. తుంగతుర్తికి చెందిన వరూధినీ దేవిని వివాహం చేసుకొని అక్కడే స్థిరపడ్డారు. 1985లో రాజకీయాల్లో చేరి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించారు. 2008లో నియోజకవర్గాల పునరి్వభజన జరిగే వరకు తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 1985, 1989, 2004లో మూడుసార్లు గెలుపొందారు. 1994లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజన తరువాత 2009 ఎన్నికల్లో సూర్యాపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో పోటీ చేసినా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఆయన 1992లో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో ఐటీ శాఖ మంత్రిగా సేవలు అందించారు. ఆయన సోదరుడు రాంరెడ్డి వెంకట్‌రెడ్డి ఖమ్మం జిల్లా నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్‌లో దామన్నది ప్రత్యేక స్థానం ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ జిల్లా రాజకీయాల్లో దామోదర్‌రెడ్డిది ప్రత్యేక స్థానం. కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఉమ్మడి జిల్లాలో దామోదర్‌రెడ్డి రాజకీయ ప్రవేశంతో తుంగతుర్తిలో రాజకీయం మారిపోయింది. కమ్యూనిస్టులు, టీడీపీ ప్రభంజనం కొనసాగుతున్న రోజుల్లో దామన్న, ఆయన సతీమణి ‘వరూధినీదేవిని వెంటబెట్టుకుని జిల్లాలో పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. కమ్యూనిస్టు యోధులు భీంరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం గెలుపొందిన తుంగతుర్తి నుంచి ఆయన నాలుగుసార్లు గెలుపొందడం విశేషం. వైఎస్ రాజశేఖరరెడ్డి పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలోనే సూర్యాపేటలో బహిరంగ సభలు, ఖమ్మం జిల్లాలో సదస్సులు పెట్టి పార్టీలో ’టైగర్ దామన్న’గా గుర్తింపు పొందారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డిమాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన సీఎం. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు.దామోదర్ రెడ్డి మృతిపట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ ద్రిగ్బాంతికాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతిపట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఒక నిబద్ధత గల కార్యకర్త నుండి రాష్ట్ర మంత్రి వరకు ఎదిగిన వ్యక్తి అని ఆయనను తామంతా దామన్న అని పిలుచుకునే వాళ్లమని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేసుకున్నారు.దామోదర్ రెడ్డి మృతి పట్ల ప్రగడ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సేవలు ప్రజలకు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని , ఒక నిజాయితీ గల నాయకుడిగా, ప్రజాసేవలో ఆయన చూపిన తపన ఎప్పటికీ మరువలేమని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు, వారి అభిమానులకు దుఃఖ సమయంలో తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.దామోదర్ రెడ్డి గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన గడ్డం ప్రసాద్ కుమార్ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్.ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారు తుంగతూర్తి, సూర్యాపేట నియోజకవర్గాల నుండి అయిదు సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.దామోదర్ రెడ్డి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతిమాజీ మంత్రి దామోదర్ రెడ్డి మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. దామన్న లేడు అనేది కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేదు, పార్టీ పటిష్ఠతకు దివంగత దామోదర్ రెడ్డి వేసిన పునాది బలమైనది. కాంగ్రెస్ తో ఆయనకున్న అనుబంధం విడదీయరానిది.కమ్యూనిస్టుల్బకంచుకోటలను ఛేదించిన ధీశాలి, అటువంటి మహానేత మననుండి నిష్క్రమించడం దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీ పటిష్టవంతానికి ఆయన చేసిన కృషి అనిర్వచనీయం. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధిలో ఆయన భాగస్వామ్యం కీలకమైనది.పార్టీ కోసం,పార్టీ ఆశయాల కోసం,పార్టీ క్యాడర్ కోసం నిరంతరం పరితపించిన నేత దామోదర్ రెడ్డి. చివరి వరకు కాంగ్రెస్ పార్టీని ఊపిరిగా భావించిన యోధుడు దామన్న. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని అన్నారు.దామోదర్ రెడ్డి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతిఆయన మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. దామోదర్ రెడ్డి మరణం.కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటు. దామోదర రెడ్డి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న నాయకులు, క్రమశిక్షణతో పార్టీ పట్ల అంకితభావంతో పని చేసిన నాయకులు, దామోదర రెడ్డి మృతి తనను తీవ్రంగా కలచివేసింది.5 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పని చేసిన దామోదర్ రెడ్డి ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణంపై మంత్రి కొండా సురేఖ ద్రిగ్బాంతితెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణం పట్ల మంత్రి కొండా సురేఖ తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కుటుంబంలో ఒక నిబద్ధత గల కార్యకర్త నుండి రాష్ట్ర మంత్రి వరకు ఎదిగిన నాయకుడు దామోదర రెడ్డి అని పేర్కొన్నారు. ఆయన మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ మహనీయుడి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి సురేఖ ప్రార్థించారు.1985, 89, 94, 2004, 2009 లో ఎమ్మెల్యేగా గెలుపుఅనారోగ్యంతో మృతి చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డిదామోదర్ రెడ్డి స్వస్థలం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాత లింగాలతల్లిదండ్రులు: నారాయణ రెడ్డి, కమలమ్మనలుగురు సోదరులు, సోదరీమణులుప్రైమరీ స్కూల్ కామేపల్లి, హైదరాబాద్ వివేక వర్ధిణి, వరంగల్ లో బీఎస్సీ, బీజెడ్సీజననం: 1952, 14 సెప్టెంబర్ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పనిచేసిన దామోదర్ రెడ్డి1985, 89, 94, 2004, 2009 లో ఎమ్మెల్యేగా గెలుపు1992 నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, 2007 లో వైఎస్సార్ కేబినెట్ లో మంత్రిగా చేసిన దామన్ననాలుగుసార్లు తుంగతుర్తి, ఒకసారి సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపు1994లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్(ప్రజా కాంగ్రెస్) గా పోటీ చేసి గెలుపు1999 లో టీడీపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర రావు చేతిలో ఓటమి2004 లో తుంగతుర్తి నుంచే సంకినేనిపై దామన్న గెలుపు1985 లో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే1989 లో నల్లగొండ జిల్లాలో గెలిచిన ముగ్గురిలో దామన్న ఒకరుతెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన మూడు ఎన్నికలు 2014, 2018, 2023 లో వరుసగా మూడుసార్లు ఓటమి2023 అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి చేతిలో ఓటమిఎన్నికల పూర్తయ్యాక అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికే పరిమితం అయిన దామోదర్ రెడ్డి -
దామన్నా... ‘బ్యాగుంది’
బ్యాగు భుజాన వేసుకుంటే చాలు.. అంతా బాగే!. ఇదీ మాజీ మంత్రి, పార్టీ సూర్యాపేట అభ్యర్థి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఎన్నికల సెంటిమెంట్. ఎన్నికల్లో పోటీచేసే ప్రతిసారీ ఆయన చంకన లెదర్బ్యాగ్ వేసుకొని కనిపిస్తుంటారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆయన అభిమానులు ఢిల్లీ నుంచి ఓ బ్యాగును పంపిస్తుంటారు. దానినే ఆయన ప్రచార సమయంలో వాడుతుంటారు. ఈసారి మాత్రం అమెరికాలో ఉండే ఆయన సోదరుడి కుమారుడు లెదర్ బ్యాగ్‌ను పంపించారు. మొన్న.. మొదటి దఫా నామినేషన్ దాఖలుకు సూర్యాపేట ఆర్డీఓ కార్యాలయం వద్దకు వాహనంలో వచ్చిన దామోదర్‌రెడ్డి.. లెదర్ బ్యాగ్ భుజాన వేసుకొని కారులోంచి దిగారు. ప్రజలకు అభివాదం చేస్తూ నామినేషన్ దాఖలుకు వెళ్లారు. ఓ లెటర్ ప్యాడ్, పెన్ను, టవల్‌తో పాటు మరికొన్ని వస్తువులను ఆయన సెంటిమెంట్‌గా అందులో భద్రపరుచుకుంటారట. -
భక్తి శ్రద్ధలతో చంద్రపట్నం
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని లింగమంతులస్వామి (పెద్దగట్టు) జాతరలో భాగంగా మం గళవారం చంద్రపట్నం వేసే కార్యక్రమాన్ని యాదవ పూజారులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్దగట్టు హక్కుదారులైన మెంతనబోయిన, మున్న, గొర్ల (రెడ్డి) వంశీయులు తెచ్చి న పూజా సామగ్రి, తెల్లపిండి, పచ్చపిండి, కుంకుమలతో క్రమ పద్ధతిలో దేవతా మూర్తు ల చిత్రాలను అచ్చుగా వేశారు. దానిపై పసు పు, కుంకుమ, తెల్లపిండి వేసి అందంగా అలంకరించారు. అనంతరం లింగమంతుల స్వామి విగ్రహాలు ఉన్న దేవరపెట్టెను చంద్రపట్నంపై ఉంచి పూజలు చేశారు. తర్వాత పట్నం ముందు బైకాన్లు బియ్యంతో పోలు పోసి తమలపాకులు, కుడుక, పోకలు, ఖర్జూరాలు ఉంచి కల్యాణ తంతుకు అన్నీ సన్నద్ధం చేశారు. మెంతనబోయిన, మున్న, గొర్ల వం శాలకు చెందిన పెద్దలకు బైకాన్లు కంకణం కట్టి, బొట్టు అప్పగించారు. వివాహ ఘడియ దాటిపోయిందని లింగమంతుల కల్యాణం నిలిచిపోవడం, ఆ తర్వాత మెంతనబోయిన వారు కటార్లు, మున్న, గొర్ల వంశీయులు ఆసరాలు ఇచ్చే తంతు నిర్వహించారు. అనంతరం మెంతనబోయిన వంశీయులు పూజలు చేసి కేసారం గ్రామానికి పయనమయ్యారు. కార్యక్రమాలను కలెక్టర్ సురేంద్రమోహన్, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డితోపాటు, ఇతర అధికారులు దగ్గరుండి పర్యవేక్షిం చారు. చంద్రపట్నం చూసేందుకు భక్తులు లక్షలాదిగా తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నా రు. జాతరలో భాగంగా నాలుగో రోజైన బుధవారం నెలవారం నిర్వహించనున్నారు. -
'వైఎస్ఆర్ సీపీ సమైక్య తీర్మానం పెడితే అడ్డుకుంటాం'
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు సమైక్య తీర్మానం పెడితే తెలంగాణ ఎమ్మెల్యేలంతా అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి గురువారం హైదరాబాద్‌లో తెలిపారు. తెలంగాణ తీర్మానాన్ని అసెంబ్లీలో పెట్టాలని కొన్నేళ్లుగా తాము కొరినా పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.సమైక్య తీర్మానాన్ని ఇప్పుడెలా ప్రవేశపెడతారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విభజించాలని లేఖ ఇచ్చిన ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విభజన బిల్లుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు,ఎంపీలు మాదిరిగా అసెంబ్లీలో సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర విభజనకు సహకరిస్తారని రాంరెడ్డి దామోదరరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ బిల్లును వెంటనే శాసనసభకు పంపాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పర్యవేక్షుడు దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ఆయన్ని అడ్డుకుంటే జరిగే పరిణామాలకు వారే బాధ్యులు అవుతురని ఆయన సీమాంధ్ర నేతలు, ఉద్యోగులకు పరోక్షంగా హెచ్చరించారు. అలాగే సభలో తెలంగాణ బిల్లు అడ్డుకుంటే భాగ్యనగరంలోని సీమాంధ్రులకు ఏదైన జరిగితే కూడా వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు.