దామన్నా... ‘బ్యాగుంది’ | Leather bag sentiment to ram reddy damodar reddy in elections | Sakshi
Sakshi News home page

దామన్నా... ‘బ్యాగుంది’

Nov 16 2018 2:36 AM | Updated on Mar 18 2019 9:02 PM

Leather bag sentiment to ram reddy damodar reddy in elections  - Sakshi

బ్యాగు భుజాన వేసుకుంటే చాలు.. అంతా బాగే!. ఇదీ మాజీ మంత్రి, పార్టీ సూర్యాపేట అభ్యర్థి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఎన్నికల సెంటిమెంట్‌. ఎన్నికల్లో పోటీచేసే ప్రతిసారీ ఆయన చంకన లెదర్‌బ్యాగ్‌ వేసుకొని కనిపిస్తుంటారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆయన అభిమానులు ఢిల్లీ నుంచి ఓ బ్యాగును పంపిస్తుంటారు. దానినే ఆయన ప్రచార సమయంలో వాడుతుంటారు. ఈసారి మాత్రం అమెరికాలో ఉండే ఆయన సోదరుడి కుమారుడు లెదర్‌ బ్యాగ్‌ను పంపించారు.

మొన్న.. మొదటి దఫా నామినేషన్‌ దాఖలుకు సూర్యాపేట ఆర్డీఓ కార్యాలయం వద్దకు వాహనంలో వచ్చిన దామోదర్‌రెడ్డి.. లెదర్‌ బ్యాగ్‌ భుజాన వేసుకొని కారులోంచి దిగారు. ప్రజలకు అభివాదం చేస్తూ నామినేషన్‌ దాఖలుకు వెళ్లారు. ఓ లెటర్‌ ప్యాడ్, పెన్ను, టవల్‌తో పాటు మరికొన్ని వస్తువులను ఆయన సెంటిమెంట్‌గా అందులో భద్రపరుచుకుంటారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement