breaking news
Rajanna cinema
-
రాజన్న నటిపై విచిత్ర ఆరోపణలు.. కేసు నమోదు..!
ప్రముఖ నటి శ్వేతా మీనన్ ఊహించని వివాదంలో చిక్కుఉంది. అశ్లీల కంటెంట్‌లో నటించిందనే ఆరోపణలతో కేరళ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. తన ఆర్థిక లాభం కోసం అడల్ట్ చిత్రాల్లో నటింటిన శ్వేతా మీనన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేరళకు చెందిన సామాజిక కార్యకర్త మార్టిన్ మేనచేరి ఫిర్యాదు చేయడంతో ఆమెపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తన ఆర్థిక లాభం కోసం అడల్ట్ చిత్రాల్లో నటిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోందని మార్టిన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో ఆమె మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూ వల్లే ఫిర్యాదు చేయడానికి కారణమన్నారు. డబ్బు కోసం తాను ఇలాంటి సినిమాలు చేయడానికి సిద్ధమేనని ఆమె చెప్పారని మార్టిన్ ఆరోపించారు. అడల్ట్ సినిమాల ద్వారా డబ్బులు సంపాదించడం ఐటీ చట్టం ప్రకారం తప్పు అని ఆయన పోలీసులను ఆశ్రయించారు. అయితే మొదట పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి శ్వేత మీనన్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.కాగా.. శ్వేతా మీనన్.. 1991లో మలయాళ చిత్రం అనస్వరంతో తన నటనను ప్రారంభించింది. ఆ తర్వాత మలయాళ చిత్రాలతో పాటు పలు బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లోనూ కనిపించింది. టాలీవుడ్లో నాగార్జున నటించిన రాజన్న చిత్రంలో కనిపించింది. బాలీవుడ్లో అశోక, బంధన్, హంగామా, రన్, కార్పొరేట్, శాండ్విచ్, కిస్సే ప్యార్ కరూన్ లాంటి సినిమాల్లో నటించింది. ఆమె చివరిగా 2024లో విడుదలైన మలయాళ చిత్రం జాంగర్, వెబ్ సిరీస్ నాగేంద్రన్స్ హనీమూన్స్‌లో మెప్పించింది. ఇటీవలే ఎంకిలే ఎన్నోడు పారా అనే మలయాళ షోను కూడా శ్వేత హోస్ట్ చేసింది. మలయాళంలో రతినిర్వేదం, పలేరి మాణిక్యం, కలిమన్ను వంటి చిత్రాలలో తన నటనతో ఆకట్టుకుంది. సినిమాలతో పాటు ఆమె పలు వాణిజ్య ప్రకటనలు చేసింది. -
అన్నయ్యే అన్నీ..
రాజన్న సినిమాలో ‘అమ్మా అవని..’ అంటూ అభినయించిన బాలనటి అనీ అంటే ఆ అన్నకు ప్రాణం. ఎంతలా అంటే ఆ ముద్దుల చెల్లెలు పేరును చేతిపై టాటూ వేయించుకునేంత. అనీ తొమ్మిదో తరగతి చదువుతుంటే.. అన్నయ్య ఆశిష్ బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నాడు. ఏజ్ గ్యాప్ ఏడేళ్లున్నా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. చెల్లెలి వల్లే తమ ఫ్యామిలీకి గుర్తింపు వచ్చిందంటాడు ఆ అన్న. నాకు అన్నీ అన్నయ్యే అంటుంది చెల్లి. అలగడం హాబీగా ఉన్న చెల్లిని ఓదార్చడం అన్నకు ఇష్టం. టీవీలో యాంకర్లను చూసి.. అద్దం ముందు చెల్లెలు చేసే అభినయం మరింత ఇష్టం. చెల్లెలు గిఫ్ట్‌గా ఇచ్చిన షర్ట్ వేసుకుంటే ఎక్కడ పాడైపోతుందోనని.. బీరువాలో భద్రంగా దాచుకోవడం ఎంతో ఇష్టం. చిన్న వయసులోనే ఎంతో పరిణ తితో ఆలోచించే అనీ.. తనకు అక్కలా మాట్లాడుతుందని మురిసిపోతూ చెప్తాడు ఆశిష్. నటన తన చెల్లికి దేవుడిచ్చిన వరమని చెబుతున్న ఆశిష్.. అనీ పెద్దయిన తర్వాత మంచి నటిగానో.. యాంకర్గానో స్థిరపడాలని కోరుకుంటున్నాడు. షూటింగ్‌లతో అన్నయ్యను మిస్సయినా.. ఆయన పంచే అనురాగాన్ని మాత్రం మిస్సయ్యేది లేదంటోంది అనీ. రాఖీ పండుగ రోజు షూటింగ్‌కు వెళ్లాల్సి రావడం బాధగా ఉంటుందని చెబుతోంది. ‘ఆ రోజు అన్నయ్య నిద్ర లేవక ముందే చేతికి రాఖీ కట్టి ముద్దు పెట్టి షూటింగ్‌కు వెళ్లిపోతాను. నేను షూటింగ్ నుంచి వచ్చే వరకు వెయిట్ చేసి మరీ అన్నయ్య మంచి గిఫ్ట్ ఇస్తాడు’ అని ఆ అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని అనీ మనముందుంచింది.