breaking news
raising funds
-
మరిన్ని సంస్కరణలు అవసరం
న్యూఢిల్లీ: భారత్ 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు సంస్కరణలకు మరింత ప్రేరణనివ్వాలని, ప్రైవేటు మూలధన నిధుల సమీకరణకు ఊతమివ్వాలని ప్రపంచ బ్యాంక్ సూచించింది. ప్రపంచ స్థాయి డిజిటల్ ప్రజా సదుపాయాలు, ప్రభుత్వ కార్యక్రమాలు విస్తృత స్థాయిలో ఆర్థిక సేవలను అందరికీ చేరువ చేసినట్టు తాజా నివేదిక (ఆర్థిక రంగ మదింపు/ఎఫ్ఎస్ఏ) లో పేర్కొంది. ఇకపై మహిళలు తమ బ్యాంక్ ఖాతాలను మరింతగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరింది. వ్యక్తులు, ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సేవలను మరింత విస్తృతం చేయాలని పేర్కొంది. అంతర్జాతీయ ద్రవ్య నిధితో కలసి ప్రపంచ బ్యాంక్ దేశాల ఆర్థిక రంగాన్ని లోతుగా, సమగ్రంగా విశ్లేíÙంచి ఎఫ్ఎస్ఏ నివేదికను విడుదల చేస్తుంటుంది. ఈ నివేదికను ఆహ్వానిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలంగా, వైవిధ్యంగా, సమ్మిళితంగా మారినట్టు ప్రపంచ బ్యాంక్ ఎఫ్ఎస్ఏ నివేదిక తెలిపింది. ఆర్థిక రంగ సంస్కరణల ఫలితంగా భారత్ కరోనా సహా పలు సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోగలిగినట్టు పేర్కొంది. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలుగా మరిన్ని ఆర్థిక రంగ సంస్కరణలతో ప్రైవేటు మూలధన పెట్టుబడులకు ఊతమివ్వాలని సూచించింది. మెరుగైన నియంత్రణలు.. సహకార బ్యాంకులకు సైతం నియంత్రణలను విస్తరించడం వాటి సమర్థతను పెంచుతుందని ప్రపంచబ్యాంక్ పేర్కొంది. అలాగే, ఎన్‌బీఎఫ్‌సీలకు వాటి స్థాయిల ఆధారంగా నియంత్రణలను అమలు చేయడాన్ని సైతం ఆహ్వానించింది. బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలకు సంబంధించి మరింత మెరుగైన పర్యవేక్షణకు వీలుగా క్రెడిట్ రిస్క్ నిర్వహణ కార్యాచరణను బలోపేతం చేయాలని సూచించింది. 2017లో చివరి ఎఫ్ఎస్ఏ నివేదిక నుంచి చూస్తే భారత జీడీపీలో క్యాపిటల్ మార్కెట్ల పరిమాణం 144 శాతం నుంచి 175 శాతానికి విస్తరించినట్టు తెలిపింది. -
రూ. 20,000 కోట్ల ఇన్ఫ్రా బాండ్ల జారీ
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) భారీ స్థాయిలో నిధుల సమీకరణకు తెరతీయనుంది. ఇందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లను జారీ చేయనుంది. ఈ బాటలో మరో పీఎస్‌యూ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రమోట్ చేసిన పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ సైతం బాండ్ల జారీ ద్వారా పెట్టుబడులను సమకూర్చుకోనుంది. రూ. 20,000 కోట్లు బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీని చేపట్టనుంది. తద్వారా ఈ ఏడాది తొలిసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీకి తెరతీయనుంది. ఈ ఆరి్థక సంవత్సరం(2024–25)లోగా బాండ్ల విక్రయాన్ని నిర్వహించేందుకు ఎస్బీఐ బోర్డు తాజాగా అనుమతించింది. పబ్లిక్ ఇష్యూ లేదా ప్రయివేట్ ప్లేస్మెంట్ ద్వారా రూ. 20,000 కోట్లవరకూ సమీకరించేందుకు బోర్డు ఆమోదించింది. వెరసి దీర్ఘకాలిక బాండ్ల జారీకి జులై మొదటి వారంలో బిడ్స్‌ను ఆహా్వనించవచ్చని మర్చంట్ బ్యాంకర్లు తెలియజేశారు. ఇప్పటికే ఎస్బీఐ మార్కెట్ వర్గాలతో చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం 10–15 ఏళ్ల కాలావధితో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీ యోచనలో ఉంది. జనవరిలో పెర్పెట్యువల్ బాండ్ల జారీ ద్వారా రూ. 5,000 కోట్లు అందుకున్న సంగతి తెలిసిందే. వీటికి కూపన్ రేటు 8.34 శాతంకాగా.. ఇంతక్రితం 15ఏళ్ల కాలపరిమితితో గతేడాది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీని చేపట్టి రూ. 20,000 కోట్లు సమీకరించింది. ఎస్బీఐలో కేంద్ర ప్రభుత్వం 57.49 శాతం వాటాను కలిగి ఉంది.పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ కూడా..మారి్పడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు)ను జారీ చేయనున్నట్లు పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ పేర్కొంది. ఇందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చనట్లు వెల్లడించింది. ప్రయివేట్ ప్లేస్మెంట్ పద్ధతిలో ఒకేసారి లేదా దశలవారీగా ఎన్సీడీల జారీని చేపట్టనున్నట్లు పేర్కొంది. నిధులను బిజినెస్ వృద్ధికి వినియోగించనున్నట్లు పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ తెలియజేసింది. ఈ మారి్టగేజ్ సంస్థ అందుబాటు ధరల గృహ విభాగంపై దృష్టిపెట్టడం ద్వారా ఈ ఏడాది లోన్‌బుక్‌లో 17 శాతం వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది(2023–24)లో లోన్‌బుక్ రూ. 63,000 కోట్లకు చేరింది. బీఎస్ఈలో ఎస్బీఐ షేరు 1 శాతం బలహీనపడి రూ. 836 వద్ద నిలవగా.. పీఎన్బీ హౌసింగ్ షేరు 1 శాతం నీరసించి రూ. 784 వద్ద ముగిసింది. -
పార్టీ నిధుల కోసం కేజ్రీవాల్ వేట!
బెంగళూరు: కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీని బ్రతికించుకోవాలంటే పెద్ద మొత్తంలో నిధుల అవసరం. ఏ పార్టీకైనా నిధుల కొరత ఏర్పడితే ఆ పార్టీ మనుగడే ప్రశ్నర్ధకరంగా మారుతుంది. పార్టీ పుట్టుకతోనే సంచలనాలు సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ అదే పనిలో పడింది. వచ్చే ఎన్నికల్లో భాగంగా పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ నిధుల సేకరణ పనిలో నిమగ్నమైయ్యారు. దీనిలో భాగంగానే కేజ్రీవాల్ ఈ వారాంతంలో బెంగళూర్ లో పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసే విందు కార్యక్రమంలో నిధుల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇన్ఫోసిస్ బోర్డు సభ్యులు, పార్టీ సభ్యుడు బాలకృష్ణన్ సమక్షంలో నిధుల సేకరణ కార్యక్రమాన్ని ఆరంభించనున్నారు. ఇప్పటికే కర్ణాటకలోని ఉన్న మొత్తం 28 లోక్ సభ స్థానాల్లో పోటీకి దిగుతున్నట్లు ఆప్ ప్రకటించింది. ప్రస్తుతం కాంగ్రెస్,బీజేపీ, జేడీఎస్ లతో పోటీ పడాలంటే పార్టీకి నిధుల ఆవశ్యం ఉందని భావించిన కేజ్రీవాల్ ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మార్చి 15వ తేదీన బెంగళూర్ లో పర్యటించే అవకాశాలున్నాయి.


