-
కిస్..నో!
అనుమతి నిరాకరించిన పోలీసు అధికారులు! బెంగళూరు : మోరల్ పోలీసింగ్కి వ్యతిరేకంగా నగరంలో నిర్వహించ తలపెట్టిన ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమానికి ఇక బ్రేక్ పడినట్లే. ఈ కార్యక్రమానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇచ్చేది లేదని కార్యక్రమ నిర్వాహకుల్లో ఒకరైన రచితా తనేజాకు పోలీసులు తేల్చి చెప్పినట్లు సమాచారం. మోరల్ పోలీసింగ్కి వ్యతిరేకంగా కేరళలో ప్రారంభమైన ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమం దేశంలోని వివిధ మెట్రో నగరాల్లో కూడా కొన్ని ప్రజా హక్కుల సంఘాలు నిర్వహించాయి. ఇక ఇందులో భాగంగానే ఉద్యాన నగరిలో సైతం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నగరానికి చెందిన ప్రజాహక్కుల కార్యకర్త రచితా తనేజా నిర్ణయించారు. ఇతర నగరాల్లో ఈ కార్యక్రమం సందర్భంలో పోలీసులతో పాటు అనేక సంఘాలు ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అలాంటి పరిస్థితులు నగరంలో ఏర్పడరాదనే ఆలోచనతో ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమ నిర్వహణకు అనుమతి ఇవ్వాల్సిందిగా రచితా తనేజా పోలీసు శాఖను కోరారు. ఈ కార్యక్రమ నిర్వహణపై శ్రీరామసేన, ఆర్ఎస్ఎస్ తదితర సంఘాలతో పాటు రాజకీయ నేతలు, ఇతర వర్గాల నుంచి సైతం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూ వస్తోంది. ఈ తరహా కార్యక్రమాలు భారతీయ సంస్కృతికి పూర్తిగా వ్యతిరేకమని, ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకు ఎంతమాత్రం అనుమతి ఇవ్వరాదని సైతం పోలీసులకు ఫిర్యాదు అందాయి. నగరంలో కనుక ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే తప్పక అడ్డుకుంటామని శ్రీరామసేన హెచ్చరించింది. ఈ నేపథ్యంలో నగరంలో ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమానికి కనుక అనుమతి ఇస్తే నగరంలో శాంతి-భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం సైతం భావించడంతో ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వరాదని రాష్ట్ర హోం శాఖ నుంచి పోలీసు ఉన్నత అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. దీంతో ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వబోమని పోలీసులు ప్రజా హక్కుల కార్యకర్త రచితా తనేజాకు తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. -
బెంగళూరుకు పాకనున్న 'ముద్దుల' గోల
బెంగళూరు: మోరల్ పోలీసింగ్ (నైతిక పోలీసుగిరి)కి వ్యతిరేకంగా కేరళలో ప్రారంభమైన 'కిస్ ఆఫ్ లవ్' ఇప్పుడు ఉద్యాన నగరి బెంగళూరును తాకనుంది. నగరంలోని కొందరు ప్రజాహక్కుల కార్యకర్తలతో కలిసి నగరానికి చెందిన హక్కుల కార్యకర్త రచితా తనేజా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 22న నగరంలో 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉంది. **
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement