breaking news
pupil
-
కంజెనిటల్ గ్లుకోమా: ఒకసారి వస్తే.. జీవితాంతం పరీక్షలు చేయించుకోవాల్సిందేనా?
కంటిలో ఉండే ఓ ద్రవం తాలూకు ఒత్తిడి పెరగడం వల్ల కంటి నరం (ఆప్టిక్ నర్వ్) దెబ్బతిని చూపు కోల్పోయే పరిస్థితిని గ్లుకోమా (నీటికాసుల జబ్బు) అంటారన్న విషయం తెలిసిందే. చిన్న పిల్లల్లోనూ పుట్టుకతో వచ్చే కారణాలతో గ్లుకోమా వస్తే, దాన్ని కంజెనిటల్ గ్లుకోమాగా చెబుతారు. గతంలో కాస్త అరుదుగా కనిపించే ఈ కేసులు ఇటీవల విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కంజెనిటల్ గ్లుకోమా అంటే ఏమిటి, దాని లక్షణాలూ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సల వంటి అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం. కన్ను ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతూ... కంటిలో ప్రవహించే ‘యాక్వస్ హ్యూమర్’ అనే ఒక ద్రవం సరైన రీతిలో ఎప్పటికప్పుడు ఒక డ్రైనేజ్ యాంగిల్ ద్వారా బయటకు ప్రవహిస్తూ ఉంటుంది. కొంతమంది చిన్నారుల్లో ఈ యాక్వస్ హ్యూమర్ ప్రవహించాల్సిన డ్రైనేజీ యాంగిల్ సరిగా అభివృద్ధి కాదు. దాంతో యాక్వస్ హ్యూమర్ బయటకు ప్రవహించలేక అక్కడే చిక్కుబడి΄ోతుంది. దాంతో కంటిలో ఒత్తిడి పెరిగి, కంటి నరంపైన కూడా ఒత్తిడి పెరిగి కంటి నరం దెబ్బతింటుంది. ఇలా కంటిలోని యాక్వస్ హ్యూమర్ బయటకు వెళ్లలేక ఒత్తిడి పెరిగి చూపు కోల్పోయే పరిస్థితినే ‘కంజెనిటల్ గ్లుకోమా’ లేదా చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చే గ్లుకోమా అంటారు. ఎప్పుడు బయటపడుతుంది?కంజెనిటల్ గ్లుకోమా ముఖ్యంగా రెండు రకాలు. మొదటిది ప్రైమరీ కంజెనిటల్ గ్లుకోమా, రెండోది సెకండరీ కంజెనిటల్ గ్లుకోమా. ప్రైమరీ కంజెనిటిల్ గ్లుకోమాలో ఇతరత్రా అబ్నార్మాలిటీస్ ఉండవు. సెండకరీ కంజెనిటల్ గ్లుకోమాలో కార్నియాకు, ఐరిస్లకు సంబంధించిన అబ్ నార్మాలిటీస్ కూడా ఉంటాయి. ఇక ప్రైమరీ కంజెనిటల్ గ్లుకోమాలో వయసును బట్టి మరో మూడు రకాలుంటాయి. అవి... పుట్టుకతోనే వస్తే దాన్ని కంజెనిటల్ గ్లుకోమా. పుట్టిన మూడేళ్లప్పుడు (0 – 3) బయట పడేవి ఇన్ఫెంటైల్ గ్లుకోమా. మూడేళ్ల తర్వాతది జువెనైల్ గ్లుకోమా. లక్షణాలు... కొన్ని లక్షణాలను బట్టి పిల్లల్లో కంజెనిటల్ గ్లుకోమా ఉందేమోనని సాధారణంగా అనుమానిస్తుంటారు. ఉదాహరణకు పిల్లల కంట్లోంచి అదేపనిగా ఎక్కువగా నీరు స్రవిస్తున్నా, కొద్ది΄ాటి వెలుతురునూ పిల్లలు భరించలేక΄ోతున్నా లేదా కాంతి పడగానే కన్ను గట్టిగా మూయడం లేదా కనుగుడ్డు పెద్దదిగా మారడం, కంట్లోని నల్ల΄ాప మసకగా మారిపోతున్నా పిల్లల్లో కంజెనిటల్ గ్లుకోమా ఉందేమోనని అనుమానించాలి. వీటన్నింటిలోనూ కనుగుడ్డు పరిమాణం (సైజ్) పెద్దగా మారి΄ోతుండటాన్ని తీవ్రంగా పరిగణించాలి. ఈ లక్షణాలతో పాటు పిల్లలు అదేపనిగా ఏడుస్తుండటం, తరచూ వాంతులు చేసుకుంటుండటం, ముఖ్యంగా తిన్న వెంటనే ఇలా జరుగు తుంటే తక్షణం కంటి వైద్యనిపుణులకు తప్పనిసరిగా చూపించాలి. నిర్ధారణ ఇలా... ∙కంట్లో ఉండే ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్‌ను కొలవడం ∙కంట్లోని నల్ల΄ాప వ్యాసాన్ని కొలవడం ∙కంటోని నల్ల΄ాప ఎంత స్పష్టంగా ఉందో చూడటం ∙కనుగుడ్డు మొత్తం పరిమాణం (యాగ్జియల్ లెంగ్త్)కొలవడం కంటి నరం, కంటి డిస్క్‌కు జరిగిన నష్టాన్ని తెలుసుకోవడం కంటిలో దృష్టిలోపాలు ఏవైనా ఉన్నాయేమో తెలుసుకోవడం ∙యాక్వియస్ హ్యూమర్ బయటకు వెళ్లే డ్రైనేజీ యాంగిల్‌ను అంచనా వేయడం కోసం ‘గోనియోస్కోపీ’ అనే పరీక్షను నిర్వహించడం. సర్జికల్ చికిత్సలు... ఇందులో యాంగిల్ సర్జరీ, ఫిల్టరేషన్ సర్జరీ, డ్రైయినేజ్ సర్జరీ అనే మూడు అంశాల కోసం సర్జరీలు జరుగుతాయి. యాంగిల్ సర్జరీ కోసం గోనియాటమీ, ట్రాబెక్యులాటమీ అనే శస్త్రచికిత్సలు చేస్తారు. కార్నియా స్పష్టంగా (క్లియర్‌గా) ఉన్నవాళ్లలో గోనియాటమీ అనే శస్త్రచికిత్స చేస్తారు. ఇందులో 70% వరకు మంచి ఫలితాలే వస్తాయి ∙కార్నియా మసకగా ఉన్నవాళ్లలో ట్రాబ్యెక్యులాటమీ అనే శస్త్రచికిత్స చేస్తారు ∙ఇంకా కొంతమందిలో ఫిల్టరింగ్ ఆపరేషన్స్ అనే ట్రాబెక్యులెక్టమీ, క్లియరెక్టమీ అనే శస్త్రచికిత్సలూ చేస్తారు ∙డ్రైయినేజ్ ప్రొసీజర్ కోసం షంట్ సర్జరీ / వాల్వ్ సర్జరీ అనేది చేస్తారు ∙చికిత్స కోసం పిల్లలను బాగా ఆలస్యంగా తీసుకువచ్చినప్పుడు వాళ్లలో క్రైయో లేదా డయోడ్ లేజర్ అనే ప్రక్రియలతో చికిత్స అందిస్తారు. ఈ చికిత్సలకు తోడు... పిల్లల్లో రెఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉన్నప్పుడు వాళ్లకు కంటి అద్దాలు ఇస్తారు. కొందరిలో ఒక కన్ను మూసి, ఒక కన్ను తెరచి ఉంచే ప్యాచింగ్ /ఆంబ్లోపియా చికిత్సలు అందిస్తారు. జెనెటిక్స్ విభాగంలోని ఇప్పుడు వచ్చిన పురోగతితో ఈ తరహా జెనెటికల్ సమస్యలకు మూడు రకాల జన్యువులు కారణం అని తెలుసుకున్నారు. తల్లిదండ్రుల్లో ఈ జన్యువులు ఉంటే, పుట్టిన పిల్లలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి. ఒకసారి గ్లుకోమా శస్త్రచికిత్స అయ్యాక... ఆ పిల్లలు క్రమం తప్పకుండా జీవితాంతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి. వంశపారంపర్యమా... కాదా?ఇది పూర్తిగ వంశ పారంపర్యమే అని చెప్పలేకపోయినప్పటికీ... తల్లిదండ్రులిద్దరిలోనూ గ్లుకోమా ఉంటే... వారి పిల్లల్లో ఛైల్డ్‌హుడ్ గ్లుకోమా వచ్చే అవకాశాలు 10 శాతం వరకు ఉంటాయి. ఒకవేళ తలిదండ్రులిద్దరిలో ఒకరికి గ్లుకోమా ఉంటే వారి తొలిచూలు, మలిచూలులో పుట్టిన పిల్లల్లో కంజెనిటల్ గ్లుకోమా వచ్చే అవకాశాలు 5 శాతం మందిలో ఉంటాయి. ఒకవేళ పుట్టిన తొలిచూలు, మలిచూలు పిల్లల్లో కంజెనిటల్ గ్లుకోమా ఉంటే... ఆ తర్వాత పుట్టే పిల్లల్లో గ్లుకోమా వచ్చే అవకాశాలు 25 శాతం మేరకు ఉంటాయి. కంజెనిటల్ గ్లుకోమా నిర్ధారణ అయితే... దానికి శస్త్రచికిత్స చేయడమన్నదే ప్రధానంగా అందించాల్సిన చికిత్స. గ్లుకోమా ఉన్నట్లు తేలగానే డాక్టర్లు ఇచ్చే చుక్కల మందులు కేవలం తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే. ఇవి కంట్లో పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడమే కాకుండా కార్నియల్ క్లారిటీ కోసం ఉపయోగపడతాయి. ఈ కార్నియల్ క్లారిటీ వల్ల చిన్నారులకు ఏ ఆపరేషన్ ఉపయోగపడుతుందో నిర్ధారణ చేయవచ్చు. ఈ శస్త్రచికిత్సలో... కంట్లో యాక్వియస్ హ్యూమర్ వల్ల పెరుగుతున్న ఒత్తిడంతా తొలగి΄ోయేలా... ఆ ద్రవాన్నంతా బయటకు పంపుతారు (అంటే డ్రైయిన్ చేస్తారు). అయితే... కంట్లోని ఆ ఒత్తిడి తొలగించడానికి ఒక్కోసారి ఒకటి కంటే ఎక్కువ శస్త్రచికిత్సా విధానాలు (మల్టిపుల్ సర్జికల్ ప్రొసిజర్స్) అవసరం పడవచ్చు. డాక్టర్ రవికుమార్ రెడ్డి సీనియర్ కంటి వైద్య నిపుణులు -
మహా గణపతి నేత్ర దర్శనం
ఖైరతాబాద్: శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహా గణపతి రూపంలో దర్శనమివ్వనున్న ఖైరతాబాద్ మహాగణపతికి శుక్రవారం సాయంత్రం 4.40 గంటలకు శిల్పి రాజేంద్రన్ కంటి పాపను దిద్దారు. విఠల శర్మ సిద్ధాంతి నిర్ణయించిన ముహూర్తం మేరకు మహా గణపతికి దిష్టితీసి, కొబ్బరి కాయలు కొట్టి కంటి పాపను తీర్చిదిద్దారు. 58 అడుగుల ఎత్తులో మహాగణపతి అద్భుత రూపంలో భక్తులకు దర్శనమిస్తారని శిల్పి తెలిపారు. ఇప్పటికే రంగులు వేసే కార్యక్రమం దాదాపు పూర్తయిందని... శనివారం కర్రలు విప్పుతామని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు. -
సమస్యల పరిష్కారంపై అలసత్వం వద్దు
గోపాలపురం: విద్యుత్ వినియోగదారుల సమస్యలపై వెంటనే స్పందించకపోతే చర్యలు తప్పవని కన్సూ్యమర్ గ్రీవెన్సెస్ రిడ్రసల్ ఫోరం (సీజీఆర్ఎఫ్) చైర్పర్సన్ ఆర్.శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ఏఎంసీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ముఖ్యఅతిథిగా చైర్పర్సన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, మీటరు మార్పు, పేరు మార్పు, విద్యుత్ బిల్లుల విషయంలో హెచ్చుతగ్గులపై విద్యుత్ అధికారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వినియోగదారులకు ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవరి సిబ్బందిని హెచ్చరించారు. దేవరపల్లి మండలం యర్నగూడెం, చిన్నాయిగూడెం, సంగాయిగూడెం రైతులు మాట్లాడుతూ విద్యుత్ సబ్సేష్టన్ పరిధిలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా, కరెంట్ ఆయిల్ కావల్సినా తాము కొనుగోలు చేయాల్సి వస్తోందని ఫిర్యాదు చేశారు. ఫోరం సభ్యుడు పీఎస్ కుమార్ మాట్లాడుతూ విద్యుత్ పనిముట్లను రైతులు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్నారు. సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1972కు ఫోను చేయాలని సూచించారు. మరో సభ్యుడు ఎంవై కోటేశ్వరావు మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో ఎటువంటి సేవా లోపాలున్నా ఫోరానికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. కన్సూ్యమర్ గీవెన్సెస్ రిడ్రసల్ ఫోరంలో సమస్య పరిష్కారం కాకపోతే విద్యుత్ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఎంపీపీ గద్దే వెంకటేశ్వరావు, ఏఎంసీ చైర్మన్ ముళ్లపూడి వెంకట్రావు, ఏడీఈ కె.చంద్రశేఖర్, ఏఈలు చిలకా వెంకట్రావు, టి. ఈశ్వరరావు, కేవీ కష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
'అమ్మో.. ఆ టీచరమ్మ పోర్న్ స్టార్.. మాకొద్దు'
లండన్: ఓ వైపు పాఠాలు చెబుతూ రాత్రయితే పోర్న్ స్టార్‌గా మారిపోయిన ఓ జాగ్రఫీ టీచర్‌ను ఉద్యోగంలో నుంచి తప్పించారు. రెండేళ్లుగా పాఠాలు బోధిస్తున్న ఆమె అసలు రహస్యం ఓ 14 ఏళ్ల పిల్లాడి కారణంగా బయటపడింది. ఇటీవల పద్నాలుగేళ్ల బాలుడు ఆన్ లైన్లో విహరిస్తుండగా అతడికి పాఠాలు చెప్పే జార్జియానా డీ అనే టీచర్ నగ్న చిత్రాలతో, వీడియోలతో దర్శనమిచ్చింది. ఈ విషయం కాస్త అందరికీ తెలిసి ఆ పిల్లల తల్లిదండ్రులకు కూడా తెలిసిపోయింది. దీంతో వారు స్కూల్ యాజమాన్యాన్ని నిలదీయడంతో వారు ఆమెపై ఒత్తిడి చేసి రాజీనామా చేయించారు. పూర్తి వివరాల్లోకి వెళితే 27 ఏళ్ల జార్జియాన డీ అనే రోమేనియన్ పాఠశాలలో జాగ్రఫీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. ఆమె గత కొంత కాలంగా ఎవరికీ తెలియకుండా రాత్రి పూట పోర్న్ స్టార్‌గా నటిస్తుంది. ఆ వీడియోలు ఆన్లైన్ లో కూడా విహరిస్తున్నాయి. కానీ, ఆ విషయం ఎవరికీ తెలియదు. అయితే, ఇదే పాఠశాలకు చెందిన ఓ పద్నాలుగేళ్ల బాలుడికి ఆమె అశ్లీల చిత్రాలు దర్శనమివ్వడంతో అసలు వ్యవహారం బయటపడింది. స్కూల్ ప్రిన్సిపాల్ అంతర్గత దర్యాప్తునకు ఆదేశించి ఆమెతో వెంటనే రాజీనామా చేయించారు. ఈ విషయం తెలిసి తామంతా దిగ్భ్రాంతికి గురయ్యామని ఆ టీచర్ సహచర ఉద్యోగులు అంటున్నారు. పోర్న్ స్టార్ గా ఉండి అధికమొత్తంలో డబ్బు సంపాధించుకోవాలనే ఆలోచన ఆమె హక్కు అని, అయితే, విద్యాబోధనకు స్వస్తి చెప్పి ఆ పనిచేయాలని వారంతా ఒత్తిడి చేయడంతో ఆమె రాజీనామా చేసింది. ఆ ఫొటోల్లో, వీడియోల్లో ఉంది మాత్రం తాను కాదని, అది ఫేక్ అని చెప్పుకొచ్చింది.